PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/by-poll6e5b02ea-e2ba-4912-855e-7fa077df22de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/by-poll6e5b02ea-e2ba-4912-855e-7fa077df22de-415x250-IndiaHerald.jpgఏపీలో ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీయే విజయం. అది కూడా వార్ వన్ సైడ్ అన్నట్లుగా కధ సాగుతోంది. తాజాగా ఏలూరు కార్పోరేషన్ ఫలితాల మీద కూడా ఎవరికీ వేరే ఆలోచనలు అయితే అసలు లేవు. కచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అనుకున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికలు జరిగి ఇప్పటికి అయిదు నెలలు గడచింది. by poll{#}Jagan;kadapa;Rayalaseema;YCP;Eluru;Elections;war;Coronavirus;Districtఆ ఉప ఎన్నికే బాగా ఇంటరెస్ట్... ?ఆ ఉప ఎన్నికే బాగా ఇంటరెస్ట్... ?by poll{#}Jagan;kadapa;Rayalaseema;YCP;Eluru;Elections;war;Coronavirus;DistrictSun, 25 Jul 2021 19:59:46 GMTఏపీలో ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీయే విజయం. అది కూడా వార్ వన్ సైడ్ అన్నట్లుగా కధ సాగుతోంది. తాజాగా ఏలూరు కార్పోరేషన్ ఫలితాల మీద కూడా ఎవరికీ వేరే ఆలోచనలు అయితే అసలు లేవు.

కచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అనుకున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికలు జరిగి ఇప్పటికి అయిదు నెలలు గడచింది. అంటే కరోనా రెండవ దశ రాక ముందు. అపుడు చూసుకుంటే అన్ని చోట్లా అప్పట్లో ఇదే తీరున వైసీపీ వీర విహారం చేసింది కూడా. ఇక జిల్లా పరిషత్తు ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో జరిగాయి. వాటి ఫలితాలు మిగిలి ఉన్నాయి. డివిజన్ బెంచ్ ఇచ్చే తీర్పు బట్టి ఫలితాల లెక్కింపు చేపడతారా లేక మళ్ళీ కొత్తగా ఎన్నికలు పెడతారా అన్నది తేలాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ఏపీలో జగన్ పాలన కరోనా రెండవ దశ ముందు వరకూ బాగానే ఉంది అని ఫలితాలు చూపించాయి. అయితే రెండవ దశ తరువాత జన జీవితంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. దాంతో ప్రజాభిప్రాయం ఏమైనా మారుతుందా అన్న చర్చ అయితే ఉంది. ఇక మరో ఉప ఎన్నిక కచ్చితంగా ఉంది. అదే కడప జిల్లా బద్వేల్. ఇక్కడ ఫలితం మీద కూడా ఎవరికీ పెద్దగా ఆసక్తి లేదు. ఇక్కడ కూడా వైసీపీ విజయం సాధించడం ఖాయమే.

మరి జగన్ పాలన మీద సరైన తీర్పు రావాలి అంటే ఏం జరగాలి అంటే. వేరే చోట ఎక్కడైనా ఉప ఎన్నిక జరగాలి. అంటే జగన్ సొంత ఇలాకాలో కాకుండా రాయలసీమ నేపధ్యం లేని వేరే చోట ఉప ఎన్నికలు కనుక వస్తేనే కొంతలో కొంత ప్రజాభిప్రాయం తెలుస్తుంది అంటున్నారు. అలా జరిగిన ఉప ఎన్నికల్లో కూడా వైసీపీకే జనాలు జై కొడితే మాత్రం ఇక 2024 ఎన్నికల కొరకు  విపక్షాలు గట్టి పోరాటానికి తయారుగా ఉండాల్సిందే అన్న మాట కూడా ఉంది. మొత్తానికి ఈ ఫలితాలను చూసి అటు విపక్షాలు కానీ ఇటు జనాలు కానీ పెద్దగా ఆలోచించడంలేదు. ఎందుకంటే ఇవి అయిదు నెలల క్రితం జరిగిన ఎన్నికలు కాబట్టే.






ఏపీలో జగన్ పొలిటికల్ హవా అలా ఎదురులేని స్థితిలో కొనసాగుతోంది. ఇది తాజాగా వచ్చిన ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలతో మరో సారి ప్రూవ్ అయింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ జగన్ దగ్గర ఒక సీక్రెట్ ఉంది. దాంతోనే ఆయన ఈ అప్రతిహత విజయాలు సాధిస్తున్నారు అన్న మాట కూడా ఉంది.

హిమాచల్ లో ఘోర ప్రమాదం

నారప్పపై వెంకటేష్‌ ఎమోషనల్‌ ?

సంవత్సరానికి 5 గంటలు మాత్రమే తెరిచి ఉండే గుడి ఎక్కడో తెలుసా..?

హాట్ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తున్న నోరా..

కాశ్మీర్ లోయల్లో మెగాఅల్లుడి రొమాన్స్...

ఏలూరు కార్పొరేషన్ వైసీపీ కైవసం.. లెక్కలివే..!!

చింతమనేని... ద డైనమిక్ లీడర్

హుజూరాబాద్‌లో సెంటిమెంటును పండిస్తోన్న ఈటల..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>