HealthChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsb0b61f7d-92e8-4ff7-8a5a-6a11ea60344e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsb0b61f7d-92e8-4ff7-8a5a-6a11ea60344e-415x250-IndiaHerald.jpgనిద్ర.. మనిషికి తిండి ఎంత ముఖ్యమో.. మెదడుకు నిద్ర కూడా అంతే ముఖ్యం.. కొన్ని గంటలు సరిగ్గా నిద్ర లేకపోతేనే మనిషి సరిగ్గా పని చేయలేడు.. ఆరోగ్య నిపుణులు చెప్పేదాని ప్రకారం.. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం ఎనిమిది గంటల నిద్ర ఉండాలట. కానీ.. ఈరోజుల్లో అంత ప్రశాంతంగా 8 గంటలు నిద్ర పోవడం సులభమేనా.. ఇవాళ్టి ఉద్యోగాలు.. పనులు, ఒత్తిళ్లు ఇలా ఎన్నో ప్రశాంతమైన నిద్రకు ఎన్నో ఆటంకాలు.. మరి సరిగ్గా నిద్రపోకే పోతే ఏమవుతుంది.. నిద్రలేమి మనిషి జీవితాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుంది.. తెలుసుకుందాం.. ఓ మనhealth tips{#}Chequeనెల రోజులు సరిగ్గా నిద్ర లేకపోతే.. ఏమౌతుందో తెలుసా..?నెల రోజులు సరిగ్గా నిద్ర లేకపోతే.. ఏమౌతుందో తెలుసా..?health tips{#}ChequeSun, 25 Jul 2021 10:10:18 GMTప్రశాంతమైన నిద్రకు ఎన్నో ఆటంకాలు.. మరి సరిగ్గా నిద్రపోకే పోతే ఏమవుతుంది.. నిద్రలేమి మనిషి జీవితాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుంది.. తెలుసుకుందాం..


ఓ మనిషి రోజంతా నిద్రపోకుండా మేలుకుంటే.. మగతగా అనిపిస్తుందట. రోజంతా నిద్ర లేకపోతే మెదడు పనితీరు మందగిస్తుందట. ఏకాగ్రత దెబ్బతింటుందట. రోజంతా నిద్ర లేకపోతే చిన్న విషయానికి కూడా చిరాకు పడుతుంటారట. మానసిక స్థితి కూడా ఏమాత్రం స్థిరంగా ఉండదట. మూడు రోజులు వరుసగా  నిద్ర లేకుండా ఉంటే.. ఏమవుతుందో తెలుసా.. ఆ మనిషి మెదడు తీవ్ర ఒత్తిడికి గురవుతుందట. భ్రాంతులకు గురవుతుందట. మనిషి దిగాలుగా ఉండటం, స్థిమితంగా లేకపోవడం జరుగుతుందట. అంతే కాదు.. జ్ఞానేంద్రియాలపై నియంత్రణ కోల్పోతాడట.


ఇక ఈ నిద్రలేమి వారానికి మించితే దాని ప్రభావం మెదడుపై బాగా ఉంటుందట. నిద్రలేమితో మనిషి ఏదో కోల్పోతున్నట్టు ఫీలవుతాడట. శరీరంలో తేమశాతం తగ్గుతుందట. చర్మం కూడా పొడిబారిపోతుందట. ఇక ఇదే పరిస్థితి నెల రోజులు గడిపితే.. ఆ మనిషి మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింటుందట. తీవ్రమైన ఒత్తిడికి గురై కొన్ని సందర్భాల్లో భయాందోళనతో వణికిపోతాడట. చివరకు ఏది నిజమో.. ఏది భ్రాంతో అర్థం కాని దుస్థితి వస్తుందట.


ఇక నెలరోజులు సరిగ్గా నిద్ర లేకపోతే ఏమవుతుందో తెలుసా.. వారి మెదడులో వారికి తెలియకుండానే ఏవేవో ఆలోచనలు వస్తుంటాయట. ఒళ్లంతా చెమటలు పడతాయట. బరువు తగ్గిపోతారట. ఇలా నిద్రలేమితో వచ్చే ఇబ్బందులు ఎన్నో. అందుకే ఎన్ని సమస్యలు ఉన్నా.. నిద్ర తగినంత పోవాల్సిందే. నిద్ర లేమికి దారి తీసే ఉద్యోగాలు ఎక్కువ కాలం చేయడం కూడా ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మరి మీరు తగినంత నిద్ర పోతున్నారా.. ఓసారి చెక్ చేసుకోండి.





నెలరోజులు సరిగ్గా నిద్ర లేకపోతే ఏమవుతుందో తెలుసా.. వారి మెదడులో వారికి తెలియకుండానే ఏవేవో ఆలోచనలు వస్తుంటాయట. ఒళ్లంతా చెమటలు పడతాయట. బరువు తగ్గిపోతారట. ఇలా నిద్రలేమితో వచ్చే ఇబ్బందులు ఎన్నో. అందుకే ఎన్ని సమస్యలు ఉన్నా.. నిద్ర తగినంత పోవాల్సిందే.

ప‌దిమంది కేడ‌ర్ లేని ఈ మ‌హిళా నేత చంద్ర‌బాబును ఏం అడిగిందో తెలుసా...!

ఆ వైసీపీ కమ్మ ఎమ్మెల్యేకు జగన్ మార్క్ షాక్?

ఇంస్టాగ్రామ్ లో సెగరేపుతున్న విష్ణుప్రియ..!

కటకటాల్లోకి శిల్పా కూడా వెళ్లనుందా..?

ష‌ర్మిల‌క్క కు థాంక్స్ ?

ఢిల్లీవైపు దూసుకొస్తున్న రాజ‌కీయ తుపాన్‌?

హుజూరాబాద్ వార్: షాకింగ్ సర్వే?

రోగనిరోధక శక్తి పెరుగుదలకు ఈ ఫుడ్స్ తినండి..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>