MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/new-movies-do-two-or-three-parts-a6354b1f-a6b0-48c0-96bb-7e15818ccaaf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/new-movies-do-two-or-three-parts-a6354b1f-a6b0-48c0-96bb-7e15818ccaaf-415x250-IndiaHerald.jpgసినిమా నిడివిపై దర్శకులు కొత్తగా ఆలోచిస్తున్నారు. రెండున్నర గంటలకు మించి ఉంటే ప్రేక్షకులు సంతృప్తి చెందరని భావిస్తున్నారు. అందుకే రెండు భాగాలుగా తెరకెక్కిస్తూ ప్రజల్లో ఉత్కంఠను పెంచడంతో పాటు.. హ్యాపీగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కథ ఎక్కువగా ఉంటే.. మొత్తం రెండున్నర గంటల్లో చూపించలేరు కనుక.. రెండు, మూడు, భాగాలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. new movies do two or three parts {#}krishna chaitanya;srikanth addala;Guntur;Jayam;Chitram;Arjun;Trisha Krishnan;aishwarya;Allu Arjun;sukumar;Audience;Cinemaఒక్కసారి చేస్తే సరిపోదట..2, 3 సార్లు చేస్తేనే సంతృప్తి..!ఒక్కసారి చేస్తే సరిపోదట..2, 3 సార్లు చేస్తేనే సంతృప్తి..!new movies do two or three parts {#}krishna chaitanya;srikanth addala;Guntur;Jayam;Chitram;Arjun;Trisha Krishnan;aishwarya;Allu Arjun;sukumar;Audience;CinemaSun, 25 Jul 2021 07:44:02 GMTసినిమా నిడివి...ఎంత తక్కువగా ఉంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రేక్షకులు. ఎందుకంటే తక్కువ టైమ్ లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి. కట్టె..కొట్టె.. తెచ్చేలా ఉంటే బాగా అర్థం చేసుకుంటారు. ఒకవేళ రెండు గంటలకు మించి స్టోరీ ఉంటే ఆడియన్స్ లో ఆసక్తి బాగా తగ్గిపోతుందనే చెప్పొచ్చు. ఒకవేళ ఎక్కువ కథ ఉంటే దాన్ని రెండు గంటల్లో పూర్తి చేయడం చాలా కష్టం. అందుకే పెద్ద కథలున్న సినిమాలను ఒక్కసారితో సరిపెట్టుకోకుండా.. రెండు.. మూడు పార్ట్ లుగా చేస్తూ ప్రేక్షకులను సంతృప్తిపరిచే పనిలో పడ్డారు.  

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తొలిసారి రఫ్ లుక్ లో.. చింపిరి గడ్డంతో కనిపిస్తున్న సినిమా పుష్ప.  సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ రెండు పార్ట్ లుగా విడుదల అవుతోంది. తొలుత ఈ మూవీని  ఒక్క పార్ట్ గానే అనుకున్నాడు సుకుమార్. అయితే ఎక్కువ కథ ఉండటంతో దీన్ని రెండున్నర గంటల్లో ముగించలేము అనుకున్నాడు. అందుకే రెండు భాగాలుగా చేస్తున్నాడు. అంతేకాదు బహుభాషా చిత్రంగా మలుస్తున్నాడు. మొత్తంగా అయిదు భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది.  

ప్రేమకథా చిత్రంతో ఎంటర్‌టైన్ చేస్తోన్న నితిన్‌, తొలిసారి ఒక పీరియాడికల్‌ సినిమా చేస్తున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ 18 ఏళ్ల యువకుడిగా, 40 ఏళ్ల మధ్య వయస్కుడిగా, 60 ఏళ్ల వృద్ధుడిగా మూడు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించబోతున్నాడట. ఇక ఈ చిత్రం కూాడా రెండు పార్టులుగా రాబోతోంది.

కుటుంబ కథా చిత్రాలతో మెప్పించే శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు భారీ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ కు పూనుకున్నాడు. గుంటూరు బ్యాక్‌డ్రాప్‌లో 'అన్నాయ్' పేరుతో ఒక యాక్షన్‌ స్టోరీ తీయబోతున్నాడు. ఇక ఈ సినిమాని మూడు భాగాలు విడుదల  చేస్తానని చెబుతున్నాడు.  

గతంలో ఉన్న జోరును కొనసాగించేందుకే కష్టపడుతోన్న మణిరత్నం, 'పొన్నియన్ సెల్వన్' అనే హిస్టారికల్ డ్రామా తీస్తున్నాడు. చోళుల కాలం నాటి కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నాడు. తొలి భాగం వచ్చే సంవత్సరం విడుదల కాబోతోంది. ఇక ఈ మూవీలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు.  



గ్యాప్ ఇస్తే రెచ్చిపోవచ్చు...అందుకే ఇలా...!

నవీన్ పొలిశెట్టి ట్వీట్ పై దారుణమైన ట్రోలింగ్ ?

ఆసియాలో అందగాడు ప్రభాస్ !

టీవీ: యాక్టర్ జ్యోతి రెడ్డి భర్త ఏం చేస్తారో తెలుసా ?

ఆఫర్లు లేక అందాలు ఆరబోస్తున్న మిస్ వరల్డ్.. పిక్స్ వైరల్..

ఆ రెండిటిని మించేలా పుష్ప ఐటం సాంగ్..!

రాజమౌళికి జక్కన్న అని పేరు పెట్టింది ఆయనేనా?

పూరిజగన్నాధ్ కు సలహా ఇచ్చిన మహేష్ బాబు?

మాస్ రాజా డబుల్ సెంటిమెంట్.. ఈసారి రిజల్ట్ ఎలా ఉంటుందో..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>