PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-7f79f910-9500-49d6-a5d6-2c099a13bb31-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-7f79f910-9500-49d6-a5d6-2c099a13bb31-415x250-IndiaHerald.jpgసంచలనం సృష్టించారు. కరోనా, నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులను పరామర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన రాజీనామా లేఖను ప్రభుత్వానికి అందించారు. స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నానని తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేస్తానని ఆయన అంటున్నారు. ఇలా తెలంగాణలో ఊహించని పరిణామాలతో గత వారం రోజులుగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇలా కాంగ్రెస్, బిజెపి , టిఆర్ఎస్ పార్టీలు విజయం మాదంటే మాది అంటూ ఒకరినొకరు మాటలతో తూటాలు పేలుస్తూ తమదైన శైలిలో రాజకీPolitical {#}praveen;Sharmila;Eatala Rajendar;Audio;Revanth Reddy;revanth;kaushik;Telangana Rashtra Samithi TRS;Huzurabad;KCR;రాజీనామా;politics;Bharatiya Janata Party;Congress;TDP;Party;Telanganaతెలంగాణ రాజకీయమంతా హుజురాబాద్ చుట్టూనే తిరుగుతోందా..?తెలంగాణ రాజకీయమంతా హుజురాబాద్ చుట్టూనే తిరుగుతోందా..?Political {#}praveen;Sharmila;Eatala Rajendar;Audio;Revanth Reddy;revanth;kaushik;Telangana Rashtra Samithi TRS;Huzurabad;KCR;రాజీనామా;politics;Bharatiya Janata Party;Congress;TDP;Party;TelanganaSun, 25 Jul 2021 11:21:58 GMT గత కొద్ది రోజుల నుంచి తెలంగాణలో రాజకీయ సమీకరణాలు  మారుతూ వస్తున్నాయి. ఎదురులేని శక్తిగా ఉన్నటువంటి అధికార టీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఈటల రాజేందర్  టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరినప్పటినుంచి  తెలంగాణలో  రాజకీయాలు వేడెక్కాయి. ఇదే క్రమంలో హుజురాబాద్ లో  ఉప ఎన్నిక రావడం  అన్ని రాజకీయ పార్టీలు అక్కడ విజయం కోసం  ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంకా అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం  గత వారం, పది రోజులుగా హుజురాబాద్ లో సర్వేలు నిర్వహిస్తూ అభ్యర్థిని వెతకడంలో పడ్డాయి. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొన్నది. ఆయన  ప్రమాణ స్వీకారం చేసిన అప్పటినుంచి గత వారం రోజులుగా చురుకుగా తెలంగాణలో  తమదైన శైలిలో అటు మాటలతో, ఇది చేతలతో మార్కు రాజకీయం చేస్తున్నారు. పాత నేతలందరినీ కలుస్తూ  పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

టిఆర్ఎస్ లో ఉన్నటువంటి అసమ్మతి నేతలను కూడా  కాంగ్రెస్ లోకి తెచ్చుకునేందుకు గాలం వేస్తున్నారు. ఈ క్రమంలోనే  హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి అనుకున్నారు అందరు,  కానీ కౌశిక్ రెడ్డి  కాంగ్రెస్ కు అనుకోకుండా షాక్ ఇచ్చారు. అతను ఆడియో కాల్ రికార్డు బయటకు రావడంతో ఈ విషయం బట్టబయలైంది. దీంతో ఆయన కెసిఆర్ సమక్షంలో  టిఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో  హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కోసం  రేవంత్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే  ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం లో  తమదైన శైలిలో ప్రచారం చేస్తూ, ప్రభుత్వ  వైఫల్యాలను ఎండగడుతూ పాదయాత్ర మొదలు పెట్టారు. ఆత్మగౌరవం పేరుతో తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా  కెసిఆర్ హుజురాబాద్ లో ఎలాగైనా విజయం సాధించాలని కోణంలో అందరు నేతలతో టచ్లో ఉంటున్నారు. హుజురాబాద్ లో  ఎవరిని పెడితే విజయం సాధిస్తారో అలాంటి నేత కోసం  వెతుకులాట ప్రారంభించారు. టిడిపి అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. ఇలా వారం రోజుల నుండి  సభలు,  సమావేశాలు పలు మార్పు రాజకీయాలతో కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో  గత వారం క్రితం  11 వేల పింఛన్లు ఒకేసారి అమలు చేశారు. అలాగే దళిత బంధు పేరుతో  వేల కోట్ల రూపాయలు  దళితులకు ఇచ్చేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చి దాన్ని హుజురాబాద్ లోనే  ముందుగా ప్రారంభించారు.

మరో పక్క వైయస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి సంచలనం సృష్టించారు. కరోనా, నిరుద్యోగంతో  ఆత్మహత్య చేసుకున్న   విద్యార్థులను పరామర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  తన రాజీనామా లేఖను ప్రభుత్వానికి అందించారు. స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నానని  తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేస్తానని ఆయన అంటున్నారు. ఇలా తెలంగాణలో ఊహించని పరిణామాలతో గత వారం రోజులుగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇలా కాంగ్రెస్, బిజెపి , టిఆర్ఎస్ పార్టీలు  విజయం  మాదంటే మాది అంటూ ఒకరినొకరు మాటలతో తూటాలు పేలుస్తూ తమదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు.



ప‌వ‌న్‌ను ఎమ్మెల్యేను చేసేందుకు బాబుకు ఎంత క‌ష్టం...!

కేటీఆర్ గారి సైన్యానికి ధన్యవాదాలు!

రాజస్థాన్ కాంగ్రెస్ లో ముసలం.. రెండుగా వర్గాలుగా చీలిన పార్టీ ?

మేము ప్రభుత్వ అధికారులమా.. బానిసలమా.?

మనీ: వారి కోసమే కేసిఆర్ వినూత్న ఆవిష్కరణ..

10 లక్షలు పూర్తి ఉచితం.. కెసిఆర్ క్లారిటీ?

బెజ‌వాడ టీడీపీని ముంచుతోన్న నేత‌ల గ్రూపు త‌గాదాలు ?

బెజ‌వాడ టీడీపీలో ఎవ‌రు ఎవ‌రికి టార్గెట్‌... ఈ కొత్త ట్విస్టులేంటి ?

ఓవ‌ర్ టు హైకోర్ట్ : ఆ నియామ‌కాలు చెల్ల‌వు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>