Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr1bc74dca-a060-4b1f-b17c-e4d96f19515a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr1bc74dca-a060-4b1f-b17c-e4d96f19515a-415x250-IndiaHerald.jpgహుజురాబాద్ ఉప ఎన్నిక.. ప్రస్తుతం తెలంగాణ ప్రజానీకం చూపు మొత్తం దీనిపైనే ఉంది. ఇంకా హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను కూడా విడుదల కాలేదు. కానీ హుజురాబాద్లో ఎన్నికల వేడి మాత్రం రాజుకుంది. ఎన్నికలప్పుడైనా ఇన్ని వ్యూహాలు ఉంటాయో లేదో తెలియదు కానీ ఇక ఇప్పటి నుంచే అన్ని పార్టీలు తమదైన వ్యూహాలతో హుజురాబాద్ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని ఈటెల రాజేందర్ పాదయాత్ర చేస్తున్నారు.. హుజురాబాద్ లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని కేసీఆర్ తనదైన వ్యూహాలKcr{#}TPCC;mandalam;srikanth;Audio;Revanth Reddy;kaushik;Huzurabad;KCR;Telangana;Bharatiya Janata Party;Congressఈటెల పై పోటీకి ఆ రెడ్డి గారినే దింపుతున్న కెసిఆర్...?ఈటెల పై పోటీకి ఆ రెడ్డి గారినే దింపుతున్న కెసిఆర్...?Kcr{#}TPCC;mandalam;srikanth;Audio;Revanth Reddy;kaushik;Huzurabad;KCR;Telangana;Bharatiya Janata Party;CongressSun, 25 Jul 2021 12:47:00 GMTహుజురాబాద్ ఉప ఎన్నిక..  ప్రస్తుతం తెలంగాణ ప్రజానీకం చూపు మొత్తం దీనిపైనే ఉంది.  ఇంకా హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను కూడా విడుదల కాలేదు.  కానీ హుజురాబాద్లో ఎన్నికల వేడి మాత్రం రాజుకుంది. ఎన్నికలప్పుడైనా ఇన్ని వ్యూహాలు ఉంటాయో లేదో తెలియదు కానీ ఇక ఇప్పటి నుంచే అన్ని పార్టీలు తమదైన వ్యూహాలతో హుజురాబాద్ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని ఈటెల రాజేందర్ పాదయాత్ర చేస్తున్నారు.. హుజురాబాద్ లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని కేసీఆర్ తనదైన వ్యూహాలను అమలు చేస్తున్నారు.



 అయితే ఇటీవలే టీపీసీసీ చీఫ్ గా ఎన్నికైన రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనీ గెలిపించి తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. ఇలా అన్ని పార్టీలు హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ప్రస్తుతం ప్రధాన పోటీ బీజేపీ టీఆర్ఎస్ మధ్య అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈటల కు పోటీగా టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఎవరిని రంగంలోకి దింపు పోతున్నారు అన్నది ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఇటీవలే  కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక హుజూరాబాద్ నియోజకవర్గం లో తనకు టిక్కెట్ ఖరారు అయ్యింది అంటూ ఆయన మాట్లాడిన ఆడియో కాల్ లీక్ కావడం కూడా సంచలనంగా మారిపోయింది.



 ఈ క్రమంలోనే నిజంగానే కౌశిక్ రెడ్డి కి టిఆర్ఎస్ టికెట్ ఇస్తారా అని ప్రచారం మొదలైంది. అయితే ఇటీవలే కొత్త పేరు వెలుగులోకి వచ్చింది.  ఎవరూ ఊహించని విధంగా కొత్త వ్యక్తికి కెసిఆర్ టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైన టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇక ఇటీవలే వీణవంక మండలం అన్నారం గ్రామానికి చెందిన ఎన్నారై శ్రీకాంత్ రెడ్డికి టిఆర్ఎస్ టికెట్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం మొదలయింది. సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు శ్రీకాంత్ రెడ్డి. ప్రస్తుతం ఇండియాలో పలు వ్యాపారాలు కూడా చేస్తున్నారు. అయితే ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి. దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో శ్రీకాంత్ రెడ్డి కి అవకాశం ఇవ్వాలని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీకాంత్ రెడ్డి అమెరికాలో ఉన్నారు.



పార్టీ నుంచి స‌స్పెండ‌వ‌నున్న వైసీపీ ఎమ్మెల్యే?

సాయంత్రానికి ఒక క్లారిటీకి వస్తా

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగులు "బిఎస్ పి" వైపేనా..?

ఈ దేశ పార్ల‌మెంట్ సామాన్యుడ్ని మ‌రిచిపోయిందా?

తెలంగాణ రాజకీయమంతా హుజురాబాద్ చుట్టూనే తిరుగుతోందా..?

కేటీఆర్ గారి సైన్యానికి ధన్యవాదాలు!

ప్రభుత్వాన్ని కాపాడుకోలేక పోతున్న సీఎం...? కూలిపోయినట్టే...?

మేము ప్రభుత్వ అధికారులమా.. బానిసలమా.?

మనీ: వారి కోసమే కేసిఆర్ వినూత్న ఆవిష్కరణ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>