BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag684c5e53-e6ad-4035-bc90-46d76b833b33-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag684c5e53-e6ad-4035-bc90-46d76b833b33-415x250-IndiaHerald.jpg కృష్ణా, గోదావ‌రి న‌దుల యాజ‌మాన్య బోర్డు నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన నోటిఫికేష‌న్‌వ‌ల్ల తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతోంద‌ని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌లు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైఖ‌రే ఇందుకు కార‌ణ‌మ‌ని విమ‌ర్శించారు. యాజ‌మాన్యాల బోర్డు నోటిఫికేష‌న్‌వ‌ల్ల తెలంగాణ‌కు అన్యాయం జ‌రుగుతోన్నా కేసీఆర్ నోరు మెద‌ప‌డంలేద‌ని, కోర్టుకు వెళ్లి స్టే తెస్తేనే రాష్ట్ర హ‌క్కుల‌ను కాపాడిన‌వారిమ‌వుతామ‌న్నారు. అంత‌కుముందు న‌ల్గొండ జిల్లా జ‌డ్పtag{#}MLA;District;KCR;central government;Congressతెలంగాణ‌కు అన్యాయం చేస్తోన్న కేసీఆర్‌?తెలంగాణ‌కు అన్యాయం చేస్తోన్న కేసీఆర్‌?tag{#}MLA;District;KCR;central government;CongressSun, 25 Jul 2021 13:53:00 GMT
కృష్ణా, గోదావ‌రి న‌దుల యాజ‌మాన్య బోర్డు నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన నోటిఫికేష‌న్‌వ‌ల్ల తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతోంద‌ని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌లు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైఖ‌రే ఇందుకు కార‌ణ‌మ‌ని విమ‌ర్శించారు. యాజ‌మాన్యాల బోర్డు నోటిఫికేష‌న్‌వ‌ల్ల తెలంగాణ‌కు అన్యాయం జ‌రుగుతోన్నా కేసీఆర్ నోరు మెద‌ప‌డంలేద‌ని, కోర్టుకు వెళ్లి స్టే తెస్తేనే రాష్ట్ర హ‌క్కుల‌ను కాపాడిన‌వారిమ‌వుతామ‌న్నారు. అంత‌కుముందు న‌ల్గొండ జిల్లా జ‌డ్పీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ఉత్త‌మ్‌, కోమ‌టిరెడ్డి పాల్గొన్నారు. పార్ల‌మెంటు స‌భ్యుల‌మ‌న్న గౌర‌వం కూడా లేకుండా చిన్న‌చూపు చూస్తున్నార‌ని, క‌నీస ప్రోటోకాల్ కూడా పాటించ‌డంలేద‌ని ఆ స‌మావేశంలో వీరిద్ద‌రూ అధికారుల తీరుపై మండిప‌డ్డారు. కేంద్ర ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో కూడా ఈ ప్రోటోకాల్ ఉండ‌టంలేద‌న్నారు. అయితే దీనిపై ఎమ్మెల్యే కంచ‌ర్ల భూపాల్‌రెడ్డి  అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. జ‌డ్పీ చైర్మ‌న్ స‌ర్దిచెప్పడంతో కంచ‌ర్ల‌, ఉత్త‌మ్‌, కోమ‌టిరెడ్డి శాంతించారు.

హుజూరాబాద్‌లో సెంటిమెంటును పండిస్తోన్న ఈటల..!

బీజేపీకి వ్య‌తిరేకంగా దీదీ పిలుపు.. కొత్తేమీ కాదంటూ కాంగ్రెస్ పెద‌వి విరుపు..!

బాలికలు ఫోన్ మాట్లాడారని.. చివరికి ఎంత పని చేశారు?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భార‌తీయ జ‌న‌తాపార్టీ ఎంపీ సోయం బాపురావు మండిప‌డ్డారు. హుజురాబాద్ ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకొనే కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రకటించారని విమ‌ర్శ‌లు గుప్పించారు. దళితబంధు కింద ఎస్టీల‌కు కూడా 10 లక్షల రూపాయ‌లివ్వాల‌ని బాపురావు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో మాయ మాట‌లు చెప్ప‌డం ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు వెన్న‌తో పెట్టిన విద్య అని, బీసీ, ఎస్సీ, ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద 30వ తేదీన ధర్నా చేస్తున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రాన్ని కేసీఆర్ దొరల రాష్ట్రంగా మార్చార‌ని, పోడు భూములపై అసెంబ్లీలో మాట ఇచ్చి ఇప్ప‌టివ‌ర‌కు దాన్ని నిల‌బెట్టుకోలేద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇస్తున్న కంపా నిధుల‌ను దోచుకుంటున్న తెలంగాణ రాష్ట్ర స‌మితి నేత‌లంద‌రినీ అరెస్ట్ చేయాల‌ని బాపురావు డిమాండ్ చేశారు. దీనిపై ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర పూర్తిస్థాయి స‌మాచారం ఉంద‌ని, అయిన‌ప్ప‌టికీ ఏమ తెలియ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, కేంద్ర నిధుల దుర్వినియోగానికి సంబంధించి గ‌తంలో కూడా తాము అనేక‌సార్లు ఫిర్యాదులు చేశామ‌ని చెప్పారు.

కేంద్రం నిధులు దోచుకున్న‌వారు వీరేనా?

ఐఎఎస్‌ అధికారి అంటేనే నిజాయితీగా, సమర్దవంతంగా విధులు నిర్వ‌హిస్తార‌నే పేరుంటుంది. కుల, మతాలకు అతీతంగా విధి నిర్వ‌హ‌ణ వారి బాధ్య‌త‌. పాల‌కులు అండ‌గా ఉన్నారు.. ఉన్న‌తాధికారుల ఆశీస్సులున్నాయ‌నే ఆలోచ‌న‌తో త‌న కింద ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌పై జులుం చెలాయిస్తే కూర్చున్న కొమ్మ‌ను న‌రుక్కున్న‌వారే అవుతారు. చివ‌ర‌కు త‌మ గోతిని తాము తవ్వుకునే ప‌రిస్థితులు ఎదుర‌వుతాయి. తమ అక్రమ సంపాదన వివరాలు బయటకు వ‌చ్చినా ఆ అధికారి త‌మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారే అయితే చాలు.. పాల‌కులైనా, మంత్రులైనా ప‌ట్టించుకోవ‌డంలేదు. ఆ త‌ర‌హా అధికారుల‌కే వ‌త్తాసు ప‌లుకుతున్నారు.

ఐఏఎస్‌కు షాకిచ్చిన జ‌గ‌న్‌?

ఓటు బ్యాంకు రాజ‌కీయాలు, మ‌త రాజ‌కీయాల నేప‌థ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుప‌డింద‌ని భార‌తీయ జ‌న‌తాపార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు విమ‌ర్శించారు. ఆల‌యాల సంద‌ర్శ‌న కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న ఈరోజు వినుకొండ‌లో ప‌ర్య‌టించారు. రాష్ట్రంలో గోవ‌ధ చ‌ట్టాన్ని ర‌ద్దుచేయాల‌ని ఎమ్మిగ‌నూరు ఎమ్మెల్యే మాట్లాడార‌ని, ఆయ‌న్ను పార్టీనుంచి బ‌హిష్క‌రించాల‌ని సోము ముఖ్య‌మంత్రిని డిమాండ్ చేశారు. ప‌విత్ర‌మైన గోవును వ‌ధించ‌కుండా కేంద్రం తెచ్చిన చ‌ట్టాన్ని విమ‌ర్శించే హ‌క్కు ఎవ‌రికీ లేద‌న్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు హిందూ మ‌తానికి వ్య‌తిరేకంగా మాట్లాడుతుంటే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎందుకు మౌనంగా ఉన్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో మ‌త‌మార్పిడుల అంశం క‌ల‌క‌లం రేకెత్తిస్తోంద‌ని అయిన‌ప్ప‌టికీ దీనిపై ప్ర‌భుత్వం స్పందించ‌డ‌క‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. రాష్ట్రంలో దెబ్బ‌తిన్న ఆల‌యాల‌న్నీ బీజేపీ ప‌రిశీలిస్తోంద‌ని వీటికి మ‌ర‌మ్మ‌తులు నిర్వ‌హించే బాధ్య‌త ప్ర‌భుత్వ‌మే తీసుకోవాల‌ని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>