PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nara-chandra-babu-naidu659d1bc7-3bd0-4942-b942-65b22dc7f4c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nara-chandra-babu-naidu659d1bc7-3bd0-4942-b942-65b22dc7f4c3-415x250-IndiaHerald.jpgఅయితే ఆమె వరసకు బంధువు అయ్యే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ప్రోద్బలంతో టీడీపీలో చేరిపోయారు. తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆమె భావించారు. అయితే చంద్రబాబు తెలివిగా దెబ్బ తీశారు. మరో వైపు పాడేరు నియోజకవర్గంలో వర్గ పోరు కూడా గిడ్డి ఈశ్వరి అవకాశాలకు చెక్ పెట్టేసాయి. ఆమె 2019 ఎన్నికల్లో భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. ఇక ఓడిన తరువాత ఆమె తిరిగి వైసీపీలో చేరుతారు అన్న ప్రచారం అయితే సాగింది. కానీ ఆమెను తీసుకోవడానికి వైసీపీ అధినాయకత్వం సుముఖంగా లేదని వార్తలు వచ్చాయి. ChandraBabu{#}Paderu;Giddi Eswari;Araku Valley;Cheque;Jagan;Vishakapatnam;Andhra Pradesh;News;Dookudu;YCP;Minister;Hanu Raghavapudi;CBN;TDPప‌దిమంది కేడ‌ర్ లేని ఈ మ‌హిళా నేత చంద్ర‌బాబును ఏం అడిగిందో తెలుసా...!ప‌దిమంది కేడ‌ర్ లేని ఈ మ‌హిళా నేత చంద్ర‌బాబును ఏం అడిగిందో తెలుసా...!ChandraBabu{#}Paderu;Giddi Eswari;Araku Valley;Cheque;Jagan;Vishakapatnam;Andhra Pradesh;News;Dookudu;YCP;Minister;Hanu Raghavapudi;CBN;TDPSun, 25 Jul 2021 09:16:00 GMTజగన్ జోలికొస్తే గొడ్డలితో తలనరుకుతాను అంటూ ఏకంగా టీడీపీ పెద్దల మీదనే మాటల దూకుడు చేసిన ఫైర్ బ్రాండ్ గిడ్డి ఈశ్వరి. విశాఖ జిల్లా పాడేరుకు చెందిన ఈ గిరిజన మహిళా నాయకురాలు జగన్ కి ఒకనాడు అత్యంత ఆప్తురాలు అయిన సోదరి. ఆమె పూర్వాశ్రమంలో టీచర్ గా చేసేవారు. వైసీపీలో ఆమె చేరగానే జగన్ ఆమె పార్టీకి చేసిన సేవలను మెచ్చి గిడ్డి ఈశ్వరికి పాడేరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆమె మంచి మెజారిటీతో గెలిచింది.  ఆమెను జగన్ శాసన సభ పక్ష ఉప నేతను కూడా చేశారు. ఆమె కూడా మూడేళ్ల పాటు వైసీపీ తరఫున గట్టిగానే పోరాటం చేశారు.

అయితే ఆమె వరసకు బంధువు అయ్యే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ప్రోద్బలంతో టీడీపీలో చేరిపోయారు. తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆమె భావించారు. అయితే చంద్రబాబు తెలివిగా దెబ్బ తీశారు. మరో వైపు పాడేరు నియోజకవర్గంలో వర్గ పోరు కూడా గిడ్డి ఈశ్వరి అవకాశాలకు చెక్ పెట్టేసాయి. ఆమె 2019 ఎన్నికల్లో భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. ఇక ఓడిన తరువాత ఆమె తిరిగి వైసీపీలో చేరుతారు అన్న ప్రచారం అయితే సాగింది. కానీ ఆమెను తీసుకోవడానికి వైసీపీ అధినాయకత్వం సుముఖంగా లేదని వార్తలు వచ్చాయి.

దాంతో ఇన్నాళ్ళూ మౌనంగా ఉన్న గిడ్డి ఈశ్వరి ఇపుడు రోడ్డు మీదకు వచ్చారు. వైసీపీ హయాంలో నిత్యావసర వస్తువున ధరలు బాగా పెరిగిపోయాయని, సామాన్యుడు ఇబ్బందుల పాలు అవుతున్నారంటూ ఆమె ధర్నా చేపట్టారు. అయితే గిడ్డి వెనక పట్టుమని పది మంది కూడా క్యాడర్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించేలా చేస్తోంది. ఆమెకు టీడీపీ నుంచి సపోర్ట్ లేకపోవడం, వైసీపీ క్యాడర్ ఆమె వైపు రాకపోవడంతో సాధారణ నాయకురాలిగా పార్టీలో మిగిలిపోయారు అన్న మాట అయితే వినిపిస్తోంది.

తనకు ఏపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి ఇవ్వాలని ఆమె కోరుకుంటున్నారు.  కానీ ఆమె వెనక క్యాడర్ లేని సీన్ చూస్తే చంద్రబాబు అంతటి సాహసం ఎప్పటికీ చేయరు అని కూడా అంటున్నారు. మొత్తానికి చూస్తే గిడ్డి ఈశ్వరి బంగారం లాంటి వైసీపీని వీడి తన రాజకీయ భవిష్యత్తుని తానే నాశనం చేసుకున్నారు అని అంటున్నారు అనుచరులు.



ఎంతగా దిగజారావు అశోక్?

రాజ్ కుంద్రా ల్యాప్టాప్ లో అన్ని ఆ వీడియోలే..!

ఒక్క దెబ్బకు రూ.42కోట్ల నష్టం..!

పని ఇప్పిస్తామని చెప్పి ఆ ముగ్గురు బాలికలను.. అలా..?

పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

ప‌వ‌న్ ఆ ప‌ని చేస్తే జ‌న‌సేన‌ ఖేల్ ఖతమేనా.. ?

పెద్దిరెడ్డిని ఎప్ప‌ట‌కైనా ఈ అనీషారెడ్డే ఓడిస్తుందా ?

నవీన్ పొలిశెట్టి ట్వీట్ పై దారుణమైన ట్రోలింగ్ ?

మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>