PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/congressb8e97053-0130-4882-890a-3f452ee9f6a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/congressb8e97053-0130-4882-890a-3f452ee9f6a9-415x250-IndiaHerald.jpgకేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకం కావాలంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విప‌క్ష‌లాకు ప్ర‌తిపాద‌న పంప‌డంతో పాటు ఆహ్వానం పంపారు. అయితే దీనిపై ఇలాంటివి కొత్తదేమీ కాదని కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. గతంలో కూడా ఆమె ఈ విధంగా పలు సార్లు ఆహ్వానాలు పంపారని కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ ప్రదీప్ భట్టాచార్య అన్నారు. అయితే మ‌మ‌తా ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చురుకుగా పరిశీలిస్తున్నారని ఆయన వివరించారు. దీనిపై ఆమె త్వరలcongress{#}SoniaGandhi;Mamta Mohandas;West Bengal - Kolkata;MP;Congress;Party;Bharatiya Janata Partyబీజేపీకి వ్య‌తిరేకంగా దీదీ పిలుపు.. కొత్తేమీ కాదంటూ కాంగ్రెస్ పెద‌వి విరుపు..!బీజేపీకి వ్య‌తిరేకంగా దీదీ పిలుపు.. కొత్తేమీ కాదంటూ కాంగ్రెస్ పెద‌వి విరుపు..!congress{#}SoniaGandhi;Mamta Mohandas;West Bengal - Kolkata;MP;Congress;Party;Bharatiya Janata PartySun, 25 Jul 2021 13:55:08 GMT కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకం కావాలంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విప‌క్ష‌లాకు ప్ర‌తిపాద‌న పంప‌డంతో పాటు ఆహ్వానం పంపారు. అయితే దీనిపై ఇలాంటివి కొత్తదేమీ కాదని కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. గతంలో కూడా ఆమె ఈ విధంగా పలు సార్లు ఆహ్వానాలు పంపారని కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ ప్రదీప్ భట్టాచార్య అన్నారు.

    అయితే మ‌మ‌తా ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చురుకుగా పరిశీలిస్తున్నారని ఆయన వివరించారు. దీనిపై ఆమె త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని భ‌ట్టా చార్య ఉంద‌ని వివ‌రించారు. నిజానికి బీజేపీని ఎదుర్కొవ‌డానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల‌ని దీంతో బీజేపీ గ్రాఫ్ ప‌డిపోతుంద‌ని  సోనియా గాంధీ ఇదివరకే పిలుపునిచ్చారని ఆయన పేర్కొన్నారు. పైగా ఈ విషయమై గ‌తంలో చర్చలకు రావాలని సోనియా ఆహ్వానాలు పంపినా తృణమూల్ కాంగ్రెస్ నేతలు హాజరు కాలేదని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసన తెలపాలని, ఇందుకు సమావేశమవుదామని సోనియా పిలుపునిచ్చింద‌ని అయినా తృణ‌ముల్ పార్టీ నేత‌లు ఎవ‌రూ కూడా స్పందించలేదని ఆయన చెప్పారు.

  ఏది ఏమైనా..  బీజేపీకి ఓ ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పడాలని ప్రజలంతా కోరుకుంటున్నార‌ని ఈ సమయం ఇప్పుడు వ‌చ్చింద‌ని ఇప్ప‌టికైనా అన్ని రాజ‌కీయ ప‌క్షాలు క‌మ‌ల పార్టీకి వ్య‌తిరేకంగా కూట‌మీగా ఏర్ప‌డాల‌ని ప్ర‌దీప్ భ‌ట్టాచ‌ర్య పిలుపునిచ్చారు.

    2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు సోనియా నాయకత్వంలో విపక్షాలన్నీ ఒక్కటి కావాలని కోరారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో తృణమూల్ కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధమని బెంగాల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎంపీ దీప్తిమాన్ ఘోష్ ఇటీవ‌ల వ్యాఖ్యానించారు.  ఈ క్ర‌మంలో భట్టాచార్య స్పందించారు. అయితే ఈ కూట‌మికి సోనియా నాయకత్వమే స‌రైంద‌ని కాంగ్రెస్ పార్టీ నేత‌లు కోరుతుండగా.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా తక్కువేమీ కాదని, ఆమె కూడా బెట‌రేన‌ని దీదీ ఆధ్వర్యంలో విపక్షాలు సమైక్యం కావాలని తృణ‌ముల్ నేతలు చెబుతున్నారు. త్వ‌ర‌లోనే మ‌మ‌త బెన‌ర్జీ ఢిల్లీని సందర్శించి సోనియా గాంధీ, తదితర నేతలను కలుసుకోనున్న‌ట్టు తెలుస్తోంది.

 





తెలంగాణ‌కు అన్యాయం చేస్తోన్న కేసీఆర్‌?

కేంద్రం నిధులు దోచుకున్న‌వారు వీరేనా?

పార్టీ నుంచి స‌స్పెండ‌వ‌నున్న వైసీపీ ఎమ్మెల్యే?

సాయంత్రానికి ఒక క్లారిటీకి వస్తా

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగులు "బిఎస్ పి" వైపేనా..?

ఈటెల పై పోటీకి ఆ రెడ్డి గారినే దింపుతున్న కెసిఆర్...?

ఈ దేశ పార్ల‌మెంట్ సామాన్యుడ్ని మ‌రిచిపోయిందా?

తెలంగాణ రాజకీయమంతా హుజురాబాద్ చుట్టూనే తిరుగుతోందా..?

ప‌వ‌న్‌ను ఎమ్మెల్యేను చేసేందుకు బాబుకు ఎంత క‌ష్టం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>