BreakingRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ou-and-jntu-not-ready-for-tyaking-btech-classes-in-telugu-medium-09d6de0c-85ed-4382-9347-32d99d61ecdc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ou-and-jntu-not-ready-for-tyaking-btech-classes-in-telugu-medium-09d6de0c-85ed-4382-9347-32d99d61ecdc-415x250-IndiaHerald.jpgఏదేమైన‌ప్ప‌టికీ సాంకేతిక విద్యను ఇంగ్లీషులోనే బోధించాల‌ని, అలానే వ‌ర్శిటీలు త‌మ ప్ర‌మాణాలు మెరుగుప‌ర్చాల‌ని, వ‌ర్శిటీల ప‌రిధిలో ఉన్న ప్ర‌యివేటు యాజ‌మాన్యాలు కూడా ఇదే రీతిన ఉన్న‌త విద్య‌ను అందించేందుకు కృషి చేయాల‌ని కోరుతున్నారు.btechతెలుగులో బీటెక్కా... నో వేతెలుగులో బీటెక్కా... నో వేbtechSun, 25 Jul 2021 11:14:07 GMT ఇప్ప‌ట్లో అయ్యేలా లేదు .. ఇప్ప‌టికీ త‌మ స‌న్న‌ద్ధత లేదు.. అని చెబుతున్నాయి జేఎన్టీయూ, ఓయూ. తాము తెలుగులో బీటెక్ విద్య‌ను అందించేదుకు సుముఖంగా లేమ‌ని సాంకేతిక ఉన్న‌త విద్యా మండ‌లికి  తేల్చి చెప్పాయి. దీంతో ఈ ఏడాది మాతృభాష‌లో ఇంజినీరింగ్ త‌రగతుల బోధ‌న‌కు కుదిరేలా లేదు. అక్టోబ‌ర్ 15 నుంచి ప్రారంభం అయ్యే త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ‌లో తెలుగులో ఇంజినీ రింగ్ కోర్సుల నిర్వ‌హ‌ణ లేద‌ని స్ప‌ష్టం అయిపోయింది.  మ‌రోవైపు తెలుగులో ఇలా త‌రగతుల బోధ‌న వ‌ల‌న ఫ‌లితం ఏముంద‌ని కొన్ని వ‌ర్గాలు పెద‌వివిరుస్తున్నాయి. ఇప్ప‌టికే విదేశాల్లో మ‌న చ‌దువు సంబంధిత  నాణ్య‌తా ప్ర‌మాణాల‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌లు చూస్తే ఎవ్వ‌ర‌యినా త‌ల‌దించుకోక త‌ప్ప‌ద‌ని, దేశంలో ఎన్ ఐ టీలే నాణ్య‌మ‌యిన విద్యను అందించ‌లేక‌పోతున్నాయి అలాంటిది ఇలాంటి సాంకేతిక విద్య‌ను తెలుగులో బోధిస్తే ఉద్యోగావ‌కాశాలు ద‌క్కేదెలా అని కొంద‌రు నిపుణులు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ ఆలోచ‌నే అంత స‌హేతుకంగా లేద‌ని తేల్చి చెబుతున్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ సాంకేతిక విద్యను ఇంగ్లీషులోనే బోధించాల‌ని, అలానే వ‌ర్శిటీలు త‌మ ప్ర‌మాణాలు మెరుగుప‌ర్చాల‌ని, వ‌ర్శిటీల ప‌రిధిలో ఉన్న ప్ర‌యివేటు యాజ‌మాన్యాలు కూడా ఇదే రీతిన ఉన్న‌త విద్య‌ను అందించేందుకు కృషి చేయాల‌ని కోరుతున్నారు.





సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>