MoviesRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cinema834a8649-1b90-44f6-85f9-7091e438f29a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cinema834a8649-1b90-44f6-85f9-7091e438f29a-415x250-IndiaHerald.jpgఊళ్లో పోస్ట‌ర్ ప‌డ‌క చాలా కాలం అయింది స‌ర్ .. ఇంట్లో దీపం వెల‌గ‌క చాలా కాలం అయింది స‌ర్.. అయినా సినిమా ఇంటి దీపం క‌దా మ‌రి! ఇలా చంపేస్తున్నారేంటి.. నాలుగు రూపాయ‌లు వ‌చ్చేక నా బిడ్డ‌ల‌కు ఈ సినిమా చ‌దువు నేర్ప‌మ‌ని బోధించింది.. నా లుగు రూపాయ‌లు వ‌చ్చాక ఓ దారి ఇది అని చూపి పోయింది.. సినిమా అని చెప్పాడొక‌రు.. ఓ థియేట‌ర్ గేట్ మేన్..ఓ పోస్ట‌ర్ బోయ్ ఇలా అంతా ఇవే క‌థ‌లు క‌న్నీళ్లతో చెప్పి జీవితాన్ని ముంచి పోయిన క‌రోనాను తిట్టుకుంటున్నారు.. స‌ర్ .. చిరూ స‌ర్ ఈ ద‌స‌రాకు వ‌స్తారా.. పోనీ ప‌వ‌న్ .. ఇలా ఏcinema{#}Cinema;Fatherథియేట‌ర్ స‌చ్చిపోతే నేనేమైపోతానో!థియేట‌ర్ స‌చ్చిపోతే నేనేమైపోతానో!cinema{#}Cinema;FatherSun, 25 Jul 2021 20:44:13 GMT
ఏవీ చావ కూడ‌దు
ఏవీ చావు వ‌ర‌కూ వెళ్ల కూడ‌దు
బ‌తికే ఆశ బ‌తికించాలి అన్న కోరిక
లేదా స్పృహ ఉంటే భ‌యాలు పోతాయి
న‌మ్మ‌కాలు కుదురుతాయి
ఈ సారి థియేట‌ర్ కు పోవాలి  
పోనీ పోయిన న‌మ్మ‌కం ఏదో వెతుక్కోవాలి
న‌మ్మ‌కం అంటే మంచి  సినిమా వ‌స్తుంద‌ని
న‌మ్మ‌కం అంటే మంచి సినిమాకు నేనొక బానిస అని
రండి సినిమా చూసొద్దాం...ఐ ల‌వ్ బిగ్ స్క్రీన్ ...
 

స‌ర్ మా సినిమాను మీరు చూడాలి నాలుగు మాట‌లు రాయాలి .. మా సినిమా నుంచి ఈ స‌మాజం ఏం నేర్చుకుందో మీరే చె ప్పాలి ఓ రివ్యూ రైట‌ర్ ను అభ్య‌ర్థించాడో డైర‌క్ట‌ర్ ..మా సినిమా ఓటీటీలో కాదు థియేట‌ర్ లో వ‌స్తుంది.. అని చెప్పాడాయ‌న.. ఔనా! అచ్ఛా! అన్నాడా రైట‌ర్.. సినిమా అంటే థియేట‌రే కదా స‌ర్ .. మ‌రి!థియేట‌ర్ ను చంపేసి మీరు నాలుగు డ‌బ్బులు ఓటీటీ నుంచి పిండుకోవాల‌ని ఎలా ప్లాన్ చేస్తున్నారు..

 

నాన్న చూపిన సినిమా
అమ్మ గ‌ర్భంలో ఉంటూ విన్న సినిమా
క‌ళ్ల‌కు రంగుల లోకం చూపిన సినిమా
రంగుల లోకంలో  విషాదాలు ఇవి అని నేర్పిన సినిమా
ఇప్పుడు అలా చ‌చ్చుబ‌డి పాడుబ‌డి ఏదో ఓ చో ట ఆగిపోతే
థియేట‌ర్ ను న‌మ్ముకున్నోడు ఏం కావాలి ..

ఊళ్లో పోస్ట‌ర్ ప‌డ‌క చాలా కాలం అయింది స‌ర్ .. ఇంట్లో దీపం వెల‌గ‌క చాలా కాలం అయింది స‌ర్.. అయినా సినిమా ఇంటి దీపం  క‌దా మ‌రి! ఇలా చంపేస్తున్నారేంటి.. నాలుగు రూపాయ‌లు వ‌చ్చేక నా బిడ్డ‌ల‌కు ఈ సినిమా చ‌దువు నేర్ప‌మ‌ని బోధించింది.. నా లుగు రూపాయ‌లు వ‌చ్చాక  ఓ దారి ఇది అని చూపి పోయింది.. సినిమా  అని చెప్పాడొక‌రు.. ఓ థియేట‌ర్ గేట్ మేన్..ఓ పోస్ట‌ర్ బోయ్ ఇలా అంతా ఇవే క‌థ‌లు క‌న్నీళ్లతో చెప్పి జీవితాన్ని ముంచి పోయిన క‌రోనాను తిట్టుకుంటున్నారు.. స‌ర్ .. చిరూ స‌ర్ ఈ ద‌స‌రాకు  వ‌స్తారా.. పోనీ ప‌వ‌న్ .. ఇలా ఏవేవో ప్ర‌శ్న‌లు ఫ్యాన్స్ అడుగుతున్నారు.. పాపం ఓటీటీలు బాగున్నాయి.. ఓటీటీల పనే బాగుంది. కానీ నిర్మాత‌కు అది లాభ‌మా న‌ష్టమా తెలియ‌దు కానీ చావు అంచుల దాకా పోతున్న కొన్ని కుటుంబాల‌కు థియేటరే అన్న‌పూర్ణ‌మ్మ..అన్నం పెట్టండి త‌ల్లీ అన్న‌ది ఓ అభ్య‌ర్థ‌న..
 





'బచ్‌పాన్ కా ప్యార్' వైరల్... బాలుడికి బాద్‌షా కాల్

వానపాటలంటే వణుకు అంటున్న హాట్ బ్యూటీ..

రష్యాలో రాళ్ళపల్లి పెద్ద కూతురు మరణం వెనక అసలు కారణం ?

ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాలో సూపర్ కామెడీ ట్రాక్..!

నారప్పపై వెంకటేష్‌ ఎమోషనల్‌ ?

హాట్ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తున్న నోరా..

చిరంజీవి ని ఫూల్ చేద్దామని చివరికి .. ?

ఛత్రపతి హిందీ రీమేక్ లో ఆ హీరోయిన్ నటించనుందా?

ఎన్టీఆర్ తో కైకాల అనుబంధం... ఎలా అంటే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>