MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rebelstare8c7cf41-39fc-4528-a6b7-055385ecb086-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rebelstare8c7cf41-39fc-4528-a6b7-055385ecb086-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో రెబెల్ స్టార్ అంటే ఆరడుగుల క్రిష్ణంరాజు కనిపిస్తారు. ఆయన సినీ జీవితం చాలా చిత్రంగా సాగింది. క్రిష్ణంరాజు టాప్ హీరోగా ఎదిగే క్రమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఆయన సినీ ఇండస్ట్రీకి మొదట హీరోగానే ఎంట్రీ ఇచ్చారు. rebelstar{#}krishnam rajuరెబెల్ స్టార్ కి అలా అన్యాయం... ?రెబెల్ స్టార్ కి అలా అన్యాయం... ?rebelstar{#}krishnam rajuSun, 25 Jul 2021 20:00:00 GMTటాలీవుడ్ లో రెబెల్ స్టార్ అంటే ఆరడుగుల క్రిష్ణంరాజు కనిపిస్తారు. ఆయన సినీ జీవితం చాలా చిత్రంగా సాగింది. క్రిష్ణంరాజు టాప్ హీరోగా ఎదిగే క్రమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఆయన సినీ ఇండస్ట్రీకి మొదట హీరోగానే ఎంట్రీ ఇచ్చారు.

ఆ తరువాత మాత్రం ఆయన విలన్ గా మారిపోయారు. తాను విలన్ గా ఏడిపించిన హీరోయిన్లతోనే హీరోగా నటించి ఆడియన్స్ చేత శభాష్ అనిపించుకున్నారు. ఇదిలా ఉంటే క్రిష్ణంరాజు మొదట తేనే మనసులు మూవీ ద్వారానే పరిచయం కావాల్సింది. అయితే ఆయనను హీరోగా  ఆ చిత్ర యూనిట్ ఎంచుకోలేదు. ఆ తరువాత చిలకా గోరింకా మూవీ ద్వారా హీరో అయ్యారు. ఇక రెండవ సినిమాకు హీరోగా చాన్స్ రాకపోతే నేనేంటే నేనే అన్న క్రిష్ణ  మూవీతో విలన్ గా మారిపోయారు. అలా ఎన్టీయార్, అక్కినేని, శోభన్ బాబు సినిమాల్లో విలన్ గా నటించి డెబ్బైల మధ్యలో మళ్లీ హీరో అయ్యారు. అయితే ఆయన హీరోగా చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.

వాటిలో సూపర్ హిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి. కానీ అవేమీ ఇపుడు అందుబాటులో లేకుండా పోవడమే ఆయన అభిమానులకు షాకింగ్ గా ఉంటోంది. క్రిష్ణంరాజు హీరోగా వేసిన బంట్రోత్తు భార్య, ఇంటి కోడలు, జీవితాశయం, మేమూ మనుషులమే, హారతి, గీత సంగీత, ఇంటి దొంగలు ఆడవాళ్ళూ అపనిందలు ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. ఇపుడు అవేమీ
ఎక్కడ సెర్చ్ చేసినా కనీసం కనిపించవు.

క్రిష్ణంరాజు దాదాపుగా రెండు వందల సినిమాల్లో నటిస్తే ఆయన సొంత సినిమాలు, 80 తరువాత వచ్చిన చిత్రాలు తప్ప మిగిలినవి లేకపోవడం నిజంగా బాధాకరమే.  క్రిష్ణంరాజు కంటే ముందు హీరోలు అయిన ఎన్టీయార్, ఏయన్నార్ వంటి వారి బ్లాక్ అండ్ వైట్ మూవీస్ కూడా ఉన్నాయి కానీ రెబెల్ స్టార్ మూవీస్ అందుబాటులో లేకపోవడం ఒక విధంగా అన్యాయమే అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ సినిమాల గురించి  తమ హీరోకైనా తెలుసా అన్నది వారి పెద్ద డౌటుట. ఏమో మరి అనుకోవాలేమో.
 





పప్పులో కాలేసిన భూమి ఫడ్నేకర్... అది ఒలంపిక్స్ కాదమ్మా !!

ప్రభాస్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్.. ఫ్రాన్స్ లో పెరుగుతున్న అంచనాలు?

ప్రభాస్ సినిమాలో మార్పులు..!

జూలై 26 ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ .. షూట్ సీబీఐ కోర్టులో

చరణ్ ఇంటి ముందు ఎన్టీఆర్? మేనేజర్ క్లారిటీ!

రికార్డు సృష్టించిన రెబల్ స్టార్ ప్రభాస్.. ఎవరికీ సాధ్యం కాదు ఇది!!

కనీసం ఇప్పుడైనా త్రిష ప్రేమ ఫలిస్తుందా..?

బిగ్ న్యూస్ : ప్రభాస్, నాగ్ అశ్విన్ మూవీ షురూ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>