PoliticsN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr1bc74dca-a060-4b1f-b17c-e4d96f19515a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr1bc74dca-a060-4b1f-b17c-e4d96f19515a-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హుజారాబాద్‌ ఉపఎన్నిక కలవరపెడుతోందా? ఈ ఉపఎన్నికల గులాబీ పార్టీకి సవాల్‌గా మారిందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే- హుజురాబాద్‌ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం అధికార తెరాసకు వ్యతిరేకంగా ఉందన్న రహస్య నివేదికలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందాయట. ఈ క్రమంలోనే ఆయనకు గెలుపు భయం పట్టుకుందట. దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికల్లో ఎదురైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న కేసీఆర్‌.. హుజురాబాద్‌ ఉపఎన్నికలో చాలా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇందులdalitha bandhu row{#}Telangana;Government;CM;Telangana Chief Minister;Partyదళిత బంధుతో గులాబీ పార్టీకి ఓట్లు రాలేనా?దళిత బంధుతో గులాబీ పార్టీకి ఓట్లు రాలేనా?dalitha bandhu row{#}Telangana;Government;CM;Telangana Chief Minister;PartySun, 25 Jul 2021 20:54:00 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హుజారాబాద్‌ ఉపఎన్నిక కలవరపెడుతోందా? ఈ ఉపఎన్నికల గులాబీ పార్టీకి సవాల్‌గా మారిందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే- హుజురాబాద్‌ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం అధికార తెరాసకు వ్యతిరేకంగా ఉందన్న రహస్య నివేదికలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందాయట. ఈ క్రమంలోనే ఆయనకు గెలుపు భయం పట్టుకుందట. దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికల్లో ఎదురైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న కేసీఆర్‌.. హుజురాబాద్‌ ఉపఎన్నికలో చాలా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే దళిత బంధు పథకానికి రూపకల్పన చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రకటించడంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. టీఆర్ఎస్‌ సర్కార్‌కు ఏడేళ్ల తర్వాత ఇప్పుడు దళితులు గుర్తుకొచ్చారా అని ప్రశ్నిస్తున్నాయి. దళిత సాధికారత కోసం ఇప్పటివరకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రతిపక్షాల నాయకులు నిలదీస్తున్నారు.

వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దళితులపై ఎన్నో వరాలు కురిపించారు. తెలంగాణ ఏర్పాటైతే దళితుడిని సీఎం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంలోకి వచ్చాక ఆ హామీని మరిచిపోయారు. అంతేకాదు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని ఘనంగా ప్రకటించారు. కానీ ఆ పథకం మున్నాళ్ల ముచ్చటగా మారింది. కొంతమందికి భూములిచ్చి ఆ పథకానికి మంగళం పాడారని విపక్ష నేతలు ఆక్రోశిస్తున్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు దళిత బంధు పథకం తీసుకొచ్చారని మండిపడుతున్నారు. ఎన్నికల్లో లబ్దిపొందేందుకు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును సీఎం కేసీఆర్‌ దుర్వినియోగం చేయడం పరిపాటిగా మారిందని విమర్శలు గుప్పిస్తున్నారు.

హుజురాబాద్‌ ఉపఎన్నిక కోసమే దళిత బంధు పథకం తెచ్చారన్న విపక్షాల ప్రశ్నలకు సీఎం కేసీఆర్‌ ఔననే సమాధానమిచ్చారు. బరాబర్‌ రాజకీయ లాభం చూసుకుంటామని తేల్చిచెప్పారు. టీఆర్‌ఎస్‌ సన్యాసుల మఠం కాదని, రాజకీయ పార్టీ అని అన్నారు. చేసిన మంచి పనులకు రాజకీయ లాభం ఎందుకు చూసుకోవద్దని ప్రశ్నించారు. దళిత బంధు అషామాషీగా అమలు చేసే పథకం కాదన్నారు.  ఈ పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలను వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని ప్రకటించారు. ముందుగా హుజూరాబాద్‌లోని ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు పంచుతామన్నారు. ఇందుకోసం దాదాపు 2 వేల కోట్ల రూపాయలు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిబాటలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా సంక్షేమ పథకాల కోసం అప్పులు చేస్తూ ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం తనకు వ్యతిరేకంగా ఉందన్న అనుమానం కేసీఆర్‌లో ఏర్పడటం వల్లనే ఆందోళన చెందుతున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఒక్క హుజూరాబాద్‌లో గెలవడం కోసం ప్రభుత్వ సొమ్ముతో దళితుల పేరిట ఓట్ల కొనుగోలుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. మరి హుజురాబాద్‌లో గెలుపు కోసం కేసీఆర్‌ ప్రకటించిన దళిత బంధు పథకం.. గులాబీ పార్టీకి ఏ మేరకు ఓట్లు సాధించి పెడుతుందో చూడాలి.



హస్తం పార్టీలో చేరాలంటే షరతులు వర్తిస్తాయి!

ఎటూ పాలుపోని పరిస్థితుల్లో యడ్యూరప్ప

టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ టార్గెట్‌ బీజేపీ!

రామానాయుడు స్టూడియో నిర్మాణం వెనక బయట ప్రపంచానికి తెలియని కష్టాలు

ఎస్టీలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారు - సోయం

కాంగ్రెస్ లోకి కత్తి కార్తీక!

మేకప్ మ్యాన్ భార్యను పెళ్లాడిన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్

ఆగస్ట్ 9న దళిత దండోరా యాత్ర ప్రారంభం ?

తెలంగాణ వాసులకి పవన్ బోనాలు శుభాకాంక్షలు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>