PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-chandra-babu72d9f781-3a82-4844-bb09-fc5e4736cad3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-chandra-babu72d9f781-3a82-4844-bb09-fc5e4736cad3-415x250-IndiaHerald.jpgఅయితే.. 2019 ఎన్నిక‌ల్లో పార్టీలో ఎవ‌రు ఓడారు.. ఎవ‌రు గెలిచారు.. అనే చ‌ర్చ‌క‌న్నా కూడా .. ప‌వ‌న్ ఓడిపోవ‌డ‌మే పొలిటిక‌ల్ హాట్ టాపిక్ ? ఆ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ముందుచూపుతో రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. వీటిలో విశాఖ జిల్లా గాజువాక నియోజ‌క‌వ‌ర్గం, ప‌వ‌న్‌ సొంత జిల్లా ప‌శ్చిమ గోదావ‌రిలోని భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌వ‌న్ పోటీ చేశారు. అయితే.. రెండు నియోజ‌క‌వ ర్గాల్లోనూ ప‌వ‌న్ ఓడిపోయారు. త్రిముఖ పోరులో ఆయ‌న వైసీపీ నేత‌ల చేతుల్లో ఓడిపోవ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. అయితే.. సొంత జిల్లPawan Kalyan Chandra Babu{#}Gajuwaka;Guntur;Chiranjeevi;Hanu Raghavapudi;District;CBN;Vishakapatnam;YCP;Partyప‌వ‌న్‌ను ఎమ్మెల్యేను చేసేందుకు బాబుకు ఎంత క‌ష్టం...!ప‌వ‌న్‌ను ఎమ్మెల్యేను చేసేందుకు బాబుకు ఎంత క‌ష్టం...!Pawan Kalyan Chandra Babu{#}Gajuwaka;Guntur;Chiranjeevi;Hanu Raghavapudi;District;CBN;Vishakapatnam;YCP;PartySun, 25 Jul 2021 11:20:00 GMTజ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఎలా గెలుస్తారు ? ఏవిధంగా గెలుపు గుర్రం ఎక్కుతారు ?  ఎక్క‌డ నుంచి పోటీ చేస్తే.. ఆయ‌న విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది.. ఇవే విష‌యాలు జ‌న‌సేన వ‌ర్గాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తు న్నాయి. వాస్త‌వానికి 2014కు ముందుగానే ఆయ‌న పార్టీ పెట్టుకున్నా.. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. పార్టీని బ‌లోపేతం చేసి.. పోటీకి దిగాల‌నే సంక‌ల్పంతో 2019 వ‌రకు వెయిట్ చేశారు. అయితే.. అప్ప‌టికి రాష్ట్రంలో మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో ఒంట‌రి పోరు త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలో ఆశించిన మేర‌కు ఫ‌లితాన్ని ప‌వ‌న్ రాబ‌ట్టలేక పోయారు.

అయితే.. 2019 ఎన్నిక‌ల్లో పార్టీలో ఎవ‌రు ఓడారు.. ఎవ‌రు గెలిచారు.. అనే చ‌ర్చ‌క‌న్నా కూడా .. ప‌వ‌న్ ఓడిపోవ‌డ‌మే పొలిటిక‌ల్ హాట్ టాపిక్ ? ఆ ఎన్నిక‌ల్లో  ప‌వ‌న్ ముందుచూపుతో రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. వీటిలో విశాఖ జిల్లా గాజువాక నియోజ‌క‌వ‌ర్గం, ప‌వ‌న్‌ సొంత జిల్లా ప‌శ్చిమ గోదావ‌రిలోని భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌వ‌న్ పోటీ చేశారు. అయితే.. రెండు నియోజ‌క‌వ ర్గాల్లోనూ ప‌వ‌న్ ఓడిపోయారు. త్రిముఖ పోరులో ఆయ‌న వైసీపీ నేత‌ల చేతుల్లో ఓడిపోవ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. అయితే.. సొంత జిల్లాలోనూ ఆయ‌న గెలుపు గుర్రం ఎక్క‌క‌పోవ‌డంతో జ‌న‌సేన కేడ‌ర్ సైతం త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లో మునిగిపోయింది.

ఈ క్ర‌మంలో వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఎక్క‌డ నుంచి పోటీ చేయాల‌నే విష‌యం ఆస‌క్తికరంగా మారింది. ఇదే విష‌యంలో పార్టీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌స్తుతం జ‌న‌సేన బీజేపీతో పొత్తులో ఉంది. ఈ క్ర‌మంలో బీజేపీకి బ‌లం ఉన్న‌చోట అదేస‌మ‌యంలో త‌న సామాజిక వ‌ర్గం ఓట్లు ఎక్కువ‌గా ఉన్న నియోజ క‌వ‌ర్గం నుంచి ప‌వ‌న్ పోటీ చేస్తే బెట‌ర్ అనే సూచ‌న‌లు వ‌స్తున్నాయి. అయితే.. ఈ ద‌ఫా ఆయ‌న ప‌శ్చిమం వైపు క‌న్నెత్తి చూసే ప్ర‌స‌క్తి లేద‌ని అంటున్నారు. గ‌తంలో మెగాస్టార్ చిరంజీవి పోటీ చేసినా.. గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌, నాగ‌బాబు పోటీ చేసినా.. ఇక్క‌డి ప్ర‌జ‌లు గెలిపించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో ప‌శ్చిమ కాకుండా.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌వ‌న్ పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీతో క‌లిసి పోటీ చేస్తే.. బెట‌ర్ అనే వాద‌న ఉన్న‌ప్ప‌టికీ.. ఇది సాధ్యం కాక‌పోయినా.. చంద్ర‌బాబు.. ప‌వ‌న్ విష‌యంలో స‌హ‌క‌రించే అవ‌కాశం ఉంద‌ని  తెలుస్తోంది. అంటే.. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి  పోటీ చేసిన లోక్‌స‌త్తా నాయ‌కుడు జేపీని గెలిపించుకునేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు. డ‌మ్మీ కాండిడేట్ల‌ను నిల‌బెట్టి.. జేపీని అసెంబ్లీకి పంపారు.

అదేవిధంగా  ఇప్పుడు బ‌ల‌మైన గ‌ళం వినిపించే ప‌వ‌న్ ను అసెంబ్లీకి పంపాల‌ని చంద్ర‌బాబు సైతం ఆలో చిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ నిల‌బ‌డిన నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న సామాజిక వ‌ర్గంతో పాటు.. క‌మ్మ వ‌ర్గం కూడా క‌లిసి వ‌చ్చేలా చేసి.. ప‌వ‌న్‌ను గెలిపించే వ్యూహం సిద్ధం చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. అంటే.. ప‌వ‌న్ నిల‌బ‌డే నియోజ‌క‌వ‌ర్గంలో డ‌మ్మీ అభ్య‌ర్థిని నిల‌బెట్టి.. ప‌వ‌న్ గెలుపునకు దోహ‌ద‌ప‌డ‌డం ద్వారా బాబు సైతం వ్యూహం అమ‌లు చేయొచ్చ‌ని అంటున్నారు. మొత్తానికి ప‌వ‌న్ ఎమ్మెల్యేగా గెలిచేందుకు బీజేపీ, బాబు కూడా ఇన్ని క‌ష్టాలు ప‌డాల‌న్న మాట‌..!





తెలంగాణ రాజకీయమంతా హుజురాబాద్ చుట్టూనే తిరుగుతోందా..?

ప్రభుత్వాన్ని కాపాడుకోలేక పోతున్న సీఎం...? కూలిపోయినట్టే...?

10 లక్షలు పూర్తి ఉచితం.. కెసిఆర్ క్లారిటీ?

బెజ‌వాడ టీడీపీలో ఎవ‌రు ఎవ‌రికి టార్గెట్‌... ఈ కొత్త ట్విస్టులేంటి ?

ఓవ‌ర్ టు హైకోర్ట్ : ఆ నియామ‌కాలు చెల్ల‌వు ?

గోదారి ఉగ్రరూపం.. మొదటి ప్రమాద హెచ్చరిక!

ముస్లింలకే కాదు.. తిరుపతి వెళ్లే హిందువులకు నిధులు ఇవ్వాల్సిందే ?

బీజేపీని టార్గెట్ చేసేందుకు వైసీపీ బిగ్ స్కెచ్ ?

మహేష్,అల్లు అర్జున్ లకు మళ్లీ తప్పదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>