PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/covid40a082fe-dc8d-42e5-9aaa-fc36303e9a5e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/covid40a082fe-dc8d-42e5-9aaa-fc36303e9a5e-415x250-IndiaHerald.jpgక‌రోనా రోజుకో కీల‌క విష‌యం ప‌య‌ట ప‌డుతోంది. క‌రోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే త‌గ్గుతున్న క్ర‌మంలో క‌రోనా మూడో వేవ్ కూడా వ‌స్తుంద‌ని ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న నెల‌కొంది. వ్యాక్సిన్ తీసుకున్నప్ప‌టికీ కొవిడ్ ప్ర‌భావం ఉంటుంద‌ని ప‌లు అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. ఈ క్ర‌మంలో కొవిడ్-19 టీకా తీసుకున్న వృద్ధులకు సంబంధించి యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కీలక విష‌యం బ‌య‌ట పెట్టింది. వ‌య‌సు పైబ‌డిన వారంత వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన సురక్షితంగా ఉన్నట్టు కాదని, వ్యాక్సిన్ తీసుకొని covid{#}Coronavirusటీకా తీసుకున్నా వాళ్లు సేఫ్ కాదు.. షాకింగ్ విష‌యాల‌ను బ‌య‌ట పెట్టిన సీడీసీ..!టీకా తీసుకున్నా వాళ్లు సేఫ్ కాదు.. షాకింగ్ విష‌యాల‌ను బ‌య‌ట పెట్టిన సీడీసీ..!covid{#}CoronavirusSun, 25 Jul 2021 07:33:00 GMT క‌రోనా రోజుకో కీల‌క విష‌యం ప‌య‌ట ప‌డుతోంది. క‌రోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే త‌గ్గుతున్న క్ర‌మంలో క‌రోనా మూడో వేవ్ కూడా వ‌స్తుంద‌ని ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న నెల‌కొంది. వ్యాక్సిన్ తీసుకున్నప్ప‌టికీ కొవిడ్ ప్ర‌భావం ఉంటుంద‌ని ప‌లు అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. ఈ క్ర‌మంలో కొవిడ్-19 టీకా తీసుకున్న వృద్ధులకు సంబంధించి యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కీలక విష‌యం బ‌య‌ట పెట్టింది. వ‌య‌సు పైబ‌డిన వారంత వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన సురక్షితంగా ఉన్నట్టు కాదని, వ్యాక్సిన్ తీసుకొని వారు వృద్ధుల చుట్టూ ఉంటే వృద్ధులు ప్ర‌మాదంలో ఉన్న‌ట్టేన‌ని సీడీసీ తెలిపింది.

వృద్ధులకు క‌రోనా సోకితే ఆరోగ్యం విషమించే అవకాశం ఎక్కువ‌గా ఉంద‌ని అలాగే చనిపోయే ప్రమాదం కూడా వృద్ధుల్లోనే ఎక్కువ ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. సీడీసీ వెల్ల‌డించిన‌ గణాంకాల ప్రకారం.. కోవిడ్-19 సోకి చనిపోయిన వారిలో దాదాపు 80 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వారేన‌ని తెలిసింది. కొవిడ్‌తో మ‌ర‌ణించిన వారిలో 95 శాతం 45 ఏళ్లు పైబడిన వారేనని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కొవిడ్ వల్ల ఎక్కువ రిస్క్ ఉండేవారిలో వృద్ధులను చేర్చి వారికి వ్యాక్సిన్ ఇచ్చాయని, అయితే వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన వాళ్లు సుర‌క్షితం కాద‌ని పేర్కొంది. వృద్ధుల చుట్టూ ఉండే వాళ్లు కూడా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడే వారికి కరోనా ముప్పు త‌క్కువ‌గా ఉంటుంద‌ని సీడీసీ తెలిపింది.


   కరోనా కొత్త వేరియంట్లు వృద్ధులపైనే విరుచుకుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సీడీసీ వెల్ల‌డించింది. వృద్దుల‌కు వ్యాక్సిన్ ఆవ‌శ్య‌క‌త‌ను తెలుసుకుని వృద్ధులంద‌రికీ టీకా ఇప్పిచ్చేలా అవగాహన కల్పించాలని సీడీసీ సూచించింది. ఈ అధ్యయనానికి సంబంధించిన ప‌లు వివరాలను ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్’లో ప్ర‌చూరించారు. ఈ అధ్యయనంలో వృద్ధులలో SARS-CoV-2ను ఎదుర్కొనే యాంటీబాడీస్ తక్కువగా ఏర్పడుతున్నాయని తేలింది. వైరస్, బ్యాక్టీరియాలను ఎదుర్కొనేందుకు మాన‌వ‌ శరీరం స్వతహాగా తయారుచేసుకునే బ్లడ్ ప్రొటీన్స్‌నే యాంటీ‌బాడీస్ అంటారు.
 

  వృద్దుల్లో క‌రోనా కొత్త వేరియంట్ల ప్ర‌భావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో తేలింది. 70 నుంచి 82 సంవత్సరాల వయసున్న వృద్ధులతో పోల్చుకుంటే 20 ఏళ్ల వయసున్న యువతలో యాంటీబాడీస్ 7 రెట్లు ఎక్కువగా ఏర్పడ్డాయని అధ్యయనంలో తేలింది. కోవిడ్ వ్యాప్తిని అరికట్టాలంటే ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడమే మార్గ‌మ‌ని.. దీని వల్లనే వైరస్ వ్యాప్తిని తగ్గించే అవకాశం ఉంటుందని సీడీసీ తెలిపింది.



నవీన్ పొలిశెట్టి ట్వీట్ పై దారుణమైన ట్రోలింగ్ ?

కరోనా రీ ఇన్ ఫెక్షన్ ముప్పు.. భారత్ లో కలకలం..

ఆ వైసీపీ కమ్మ ఎమ్మెల్యేకు జగన్ మార్క్ షాక్?

బ్రిటన్ కొంప ముంచుతున్న డెల్టా వైరస్..?

ఆఫర్లు లేక అందాలు ఆరబోస్తున్న మిస్ వరల్డ్.. పిక్స్ వైరల్..

టీఎస్‌ఆర్టీసీకి బ్యాంకులు ఝలక్‌!

పుష్ప సినిమాకు మళ్ళీ బ్రేక్ పడిందా

గుడ్ న్యూస్.. పిల్లలకు కూడా కరోనా టీకా?

సినిమా ఇండస్ట్రీని వదిలేసి రైతుగా వ్యవసాయం చేస్తున్న ప్రముఖ నటుడు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>