PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-announced-one-crore-to-3a0dd6db-56ce-4782-90b9-9e3de476dd83-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-announced-one-crore-to-3a0dd6db-56ce-4782-90b9-9e3de476dd83-415x250-IndiaHerald.jpgఎన్నికలకు ఏడాది ముందున ఆయన తన పొత్తుల ఎత్తులను ముందుకు తెస్తారు. టీడీపీ, జనసేన కలిస్తే ఏపీలో వైసీపీని ఎంతవరకూ నిలువరించగలరో తెలియదు. ఒకవేళ గెలిచినా కూడా టీడీపీ నుంచి చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ముఖ్యమంత్రులుగా ఉంటారు తప్ప పవన్ కి అసలు చాన్స్ ఉండదు. మరి టీడీపీతో పొత్తు పెట్టుకుని పవన్ సాధించేది ఏముంటుంది అంటే ఆయన తానోడి చంద్రబాబుని గెలిపించడం తప్ప కొత్తగా వచ్చే లాభం ఏదీ లేదని అంటున్నారు. Janasena{#}Lokesh;Lokesh Kanagaraj;Bharatiya Janata Party;TDP;Janasena;Elections;Telugu Desam Party;NTR;kalyan;Hanu Raghavapudi;CBNప‌వ‌న్ ఆ ప‌ని చేస్తే జ‌న‌సేన‌ ఖేల్ ఖతమేనా.. ?ప‌వ‌న్ ఆ ప‌ని చేస్తే జ‌న‌సేన‌ ఖేల్ ఖతమేనా.. ?Janasena{#}Lokesh;Lokesh Kanagaraj;Bharatiya Janata Party;TDP;Janasena;Elections;Telugu Desam Party;NTR;kalyan;Hanu Raghavapudi;CBNSun, 25 Jul 2021 08:55:00 GMTపవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం ఏంటి అన్నది ఇపుడు చర్చగా ఉంది. పవన్ ఏడేళ్ళ క్రితం జనసేనను స్థాపించినపుడు ఆయనలో ఒక ఎన్టీఆర్ ని జనాలు చూశారు. ఆ ఆవేశంతో యువత వెల్లువలా వెంట నిలిచింది. తొలి ఎన్నికల్లో పోటీ చేయకుండా పవన్ అవకాశాన్ని జారవిడుచుకున్నారు. మరో వైపు చూస్తే పవన్ ఆ అయిదేళ్లలో చేసిన రాజకీయం కూడా ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది. పవన్ ప్రశ్నిస్తాను అంటూ అక్కడ బీజేపీని కానీ ఇక్కడ తెలుగుదేశాన్ని కానీ పెద్దగా ఏమీ అనకుండా కాలాన్నిఅలా  నెట్టేశారు. ఇక 2019 ఎన్నికలలో ఆయన ఓడిపోవడానికి అదే కారణం అని కూడా చెబుతారు.

ఇదిలా ఉంటే పవన్ పొత్తు పెట్టుకునేందుకు ఇపుడు ఏపీలో పార్టీలు కొత్తగా అయితే లేవు. ఆయన తెలుగుదేశం బీజేపీతో మొదలుపెట్టి వామపక్షాలు, యూపీకి చెందిన బీఎస్పీ దాకా అన్నింటినీ టచ్ చేసేశారు. 2019 ఎన్నికల తరువాత మరో మారు బీజేపీతో కూడా జట్టుకట్టారు ఇపుడు ఆయన బీజేపీ నుంచి విడిపోవాలని చూస్తున్నారు. అదే సమయంలో ఆయనకు ఏపీలో ఉన్న ఏకైక ఆప్షన్ టీడీపీయేనని అంటున్నారు. మరి టీడీపీతో పొత్తు అన్నది ఆయన మనసులో ఉన్నప్పటికీ ఇపుడే బయటపడరు అంటున్నారు.

ఎన్నికలకు ఏడాది ముందున ఆయన తన పొత్తుల ఎత్తులను ముందుకు తెస్తారు. టీడీపీ, జనసేన కలిస్తే ఏపీలో వైసీపీని ఎంతవరకూ నిలువరించగలరో తెలియదు. ఒకవేళ గెలిచినా కూడా టీడీపీ నుంచి చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ముఖ్యమంత్రులుగా ఉంటారు తప్ప పవన్ కి అసలు చాన్స్ ఉండదు. మరి టీడీపీతో పొత్తు పెట్టుకుని పవన్ సాధించేది ఏముంటుంది అంటే ఆయన తానోడి చంద్రబాబుని గెలిపించడం తప్ప కొత్తగా వచ్చే లాభం ఏదీ లేదని అంటున్నారు.

మరి పవన్ ఒంటరిగా పోటీ చేస్తే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది, పార్టీకి లాంగ్ లైఫ్ ఉంటుందని తెలుస్తున్నా కూడా ఆయన మాత్రం రాజకీయాల్లో ఫుల్ టైమ్ రావడానికి ఇష్టపడడంలేదు. దాంతో పవన్ 2024 ఎన్నికల్లో తన లక్ ని టీడీపీతో ముడిపెట్టి పరీక్షించుకుంటారని అంటున్నారు. రిజల్ట్ ఎలా ఉన్నా కూడా పవన్ పాలిటిక్స్ కి మాత్రం అవే దాదాపుగా చివరి ఎన్నికలు కావచ్చు అంటున్నారు. చూడాలి మరి.





సమంత ఆ స్టార్ డైరెక్టర్ సినిమా మిస్ చేసుకుందా?

పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

అన్నాడీఎంకేకి బీజేపీ షాక్ ట్రీట్ మెంట్..

టీడీపీతో పొత్తు వ‌ద్ద‌ని ప‌వ‌న్‌కు జ‌న‌సైనికుల స‌ల‌హా..!

పెద్దిరెడ్డిని ఎప్ప‌ట‌కైనా ఈ అనీషారెడ్డే ఓడిస్తుందా ?

నవీన్ పొలిశెట్టి ట్వీట్ పై దారుణమైన ట్రోలింగ్ ?

స్మరణ: ప్రముఖ సాహితీకారుడు గుర్తింపు పొందిన గిరీష్ కర్నాడ్..

ఏలూరు కింగ్‌ ఎవరో తేలేది నేడే..!

టీడీపీ సై అంది.. వైసీపీ నై అంది.. వెటకారం మిగిలింది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>