PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagane568b5a8-0a33-4fc7-81b7-b7b245912fcc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagane568b5a8-0a33-4fc7-81b7-b7b245912fcc-415x250-IndiaHerald.jpgపేరుకు వైసీపీకి చాలామంది ఎమ్మెల్యేల బలం ఉంది...కానీ అంతమంది ఎమ్మెల్యేల్లో జగన్‌కు ఇమేజ్ పెంచేలా ఎంతమంది ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారంటే చెప్పడం కష్టమే. వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల్లో చాలామంది జగన్ ఇమేజ్ పెంచేలా పనిచేయడం గురించి పక్కనబెడితే, వారు జగన్ ఇమేజ్ ఆధారపడే బండి లాగిస్తున్నారు. వైసీపీలో పలువురు ఎమ్మెల్యేలు మెరుగైన పనితీరు కనబర్చడంలో పూర్తిగా వెనుకబడి ఉన్నారని చెప్పొచ్చు. jagan{#}Jagan;TDP;YCP;CMజగన్ షాక్: ఆ ఎమ్మెల్యేల సీటుకు ఎర్త్?జగన్ షాక్: ఆ ఎమ్మెల్యేల సీటుకు ఎర్త్?jagan{#}Jagan;TDP;YCP;CMSun, 25 Jul 2021 01:00:00 GMTపేరుకు వైసీపీకి చాలామంది ఎమ్మెల్యేల బలం ఉంది...కానీ అంతమంది ఎమ్మెల్యేల్లో జగన్‌కు ఇమేజ్ పెంచేలా ఎంతమంది ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారంటే చెప్పడం కష్టమే. వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల్లో చాలామంది జగన్ ఇమేజ్ పెంచేలా పనిచేయడం గురించి పక్కనబెడితే, వారు జగన్ ఇమేజ్ ఆధారపడే బండి లాగిస్తున్నారు. వైసీపీలో పలువురు ఎమ్మెల్యేలు మెరుగైన పనితీరు కనబర్చడంలో పూర్తిగా వెనుకబడి ఉన్నారని చెప్పొచ్చు.

పైగా కొందరు ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండటం తక్కువ, అవినీతి, అక్రమాలు చేయడం ఎక్కువని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేల టార్గెట్‌గా ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఆయా నియోజకవర్గాల్లో ఇసుకలో, ఇళ్ల స్థలాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ ఆరోపిస్తుంది.

ఇలా ఆరోపణలు ఉండటం, ఎమ్మెల్యేలుగా మెరుగైన పనితీరు కనబర్చని ఎమ్మెల్యేలకు జగన్ షాక్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో అలాంటి ఎమ్మెల్యేలకు జగన్ సీటు ఇవ్వడం కష్టమని తెలుస్తోంది. 2014లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేల్లో కొందరికి 2019లో సీటు ఇవ్వలేదు. దీని బట్టి చూస్తే వైసీపీకి ఇప్పుడు 151 ఎమ్మెల్యేల బలం ఉంది. ఇందులో సీఎం జగన్‌ని పక్కనబెడితే 150 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమందికి నెక్స్ట్ సీటు వస్తుందంటే? చెప్పడం కష్టం.

ఇప్పుడున్న అందరు ఎమ్మెల్యేలకు నెక్స్ట్ టికెట్ దక్కడం కష్టమని తెలుస్తోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటుతున్న కూడా ఇంకా ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయడం లేదని, ఇక రానున్న రోజుల్లో మంచిగా పనిచేస్తే వారి సీట్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, లేదంటే వారి సీట్లకు జగన్ ఎర్త్ పెట్టడం ఖాయమని తెలుస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ, నియోజకవర్గంలో మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, సంక్షేమ పథకాలని ఎలాంటి లోటు లేకుండా అందిస్తే చాలు, ఎమ్మెల్యేలకు ప్లస్ అవుతుంది. కానీ కొందరు ఎమ్మెల్యేలు అలా పని చేయడం లేదు. ఇక అలాంటివారికి జగన్ షాక్ తప్పదు.  



బాలయ్యని కాపాడుకుంటున్న జగన్...?

ఒలింపిక్ విజేత మీరాబాయి చానుకు బహుమతులే బహుమతులు..!

ప్రభుత్వ సలహాదారుల అ'రాజకీయం'!

సాధారణంగా తెలుగుదేశం పార్టీలో కమ్మ నేతల హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే తెలుగుదేశంలో ఉండే కమ్మ నేతలకు చెక్ పెట్టడానికి గత ఎన్నికల్లో జగన్ సైతం అదే వర్గానికి చెందిన నాయకులని ఎమ్మెల్యేలుగా నిలబెట్టారు. ఈ క్రమంలోనే వినుకొండలో టీడీపీ నేత జి‌వి ఆంజనేయులుపై, బొల్లా బ్రహ్మనాయుడుని నిలబెట్టారు. జగన్ వేవ్‌లో టీడీపీ బలంగా ఉన్న వినుకొండలో బొల్లా ఎమ్మెల్యేగా గెలిచారు.

రాయలసీమ జిల్లాల్లో అధికార వైసీపీ హవా స్పష్టంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి సీమలో ఉన్న జిల్లాల్లో వైసీపీ సత్తా చాటుతూనే ఉంది. 2014 ఎన్నికల్లో అధికారం రాకపోయినా సరే సీమలో వైసీపీకే మెజారిటీ సీట్లు వచ్చాయి. ఇక 2019 ఎన్నికల్లో అయితే చెప్పాల్సిన పని లేదు. దాదాపు క్లీన్‌స్వీప్ చేసేసింది. సీమలో ఉన్న నాలుగు జిల్లాలో కలిపి 52 అసెంబ్లీ సీట్లు ఉంటే, వైసీపీ ఏకంగా 49 గెలుచుకుంటే, టీడీపీకి కేవలం 3 సీట్లే దక్కాయి. ఇక ఉన్న 8 పార్లమెంట్ సీట్లు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి.

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం...ఈ పేరు చెబితే మొదటి గుర్తొచ్చేది నందమూరి ఫ్యామిలీనే. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి హిందూపురంలో మరో పార్టీ ఇంతవరకు గెలవలేదు. వరుసగా ఇక్కడ టీడీపీదే విజయం కాగా, వరుసగా ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణలు హిందూపురంలో సత్తా చాటారు. గత రెండు పర్యాయాల నుంచి ఇక్కడ బాలకృష్ణ మంచి మెజారిటీలతో ఎమ్మెల్యేగా గెలిచారు.

ప్రధాని అభ్యర్థి ఎవరు? ప్రతిపక్షాల్లో ప్రతిష్టంభన!

జూలై 26 ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ .. షూట్ సీబీఐ కోర్టులో

ఏది రియ‌ల్ ఏది డూపు ఓ సాయిరెడ్డీ తేల్చ‌వ‌య్యా !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>