MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mohanlal-special-chicken-receipe-41d8be30-8574-460d-b99b-0615b129b997-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mohanlal-special-chicken-receipe-41d8be30-8574-460d-b99b-0615b129b997-415x250-IndiaHerald.jpgదక్షిణ చలన చిత్ర పరిశ్రమలో మోహన్ లాల్ అత్యంత ప్రజాదరణ పొందిన పెద్ద నటులలో ఒకరు. ఆయనను మలయాళ సినిమా ఇండస్ట్రీ సూపర్ స్టార్ గా అభిమానులు పిలుస్తారు. టాలీవుడ్ కు కూడా సుపరిచితుడే అయిన ఈ సూపర్ స్టార్ తన లేటెస్ట్ వీడియోతో ఇంటర్నెట్ లో తుఫాన్ సృష్టిస్తున్నాడు. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి తాజాగా గరిటె పట్టడం విశేషం. ఆయన ఈ వీడియోలో అభిమానుల కోసం స్పెషల్ డిష్ ను వండారు. ప్రత్యేకంగా చికెన్ ను వండి మంచి చెఫ్ గా తన అభిమానులను ఆకట్టుకున్నారు. తనదైన రుచికరమైన చికెన్ ను ఎలా వండాలో సలహాలు, సూచనలతో పాటు ప్రతి పదార్థానిMohanlal Special Chicken Receipe;{#}Mohanlal;Priyadarshan;Rajani kanth;koratala siva;Chicken;NTR;Darsakudu;Director;Tollywood;Cinema;Wifeగరిటె పట్టిన సూపర్ స్టార్... ఆ డిష్ రుచి చూడాల్సిందే మరి...!!గరిటె పట్టిన సూపర్ స్టార్... ఆ డిష్ రుచి చూడాల్సిందే మరి...!!Mohanlal Special Chicken Receipe;{#}Mohanlal;Priyadarshan;Rajani kanth;koratala siva;Chicken;NTR;Darsakudu;Director;Tollywood;Cinema;WifeSun, 25 Jul 2021 10:00:00 GMTదక్షిణ చలన చిత్ర పరిశ్రమలో మోహన్ లాల్ అత్యంత ప్రజాదరణ పొందిన పెద్ద నటులలో ఒకరు. ఆయనను మలయాళ సినిమా ఇండస్ట్రీ సూపర్ స్టార్ గా అభిమానులు పిలుస్తారు. టాలీవుడ్ కు కూడా సుపరిచితుడే అయిన ఈ సూపర్ స్టార్ తన లేటెస్ట్ వీడియోతో ఇంటర్నెట్ లో తుఫాన్ సృష్టిస్తున్నాడు. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి తాజాగా గరిటె పట్టడం విశేషం. ఆయన ఈ వీడియోలో అభిమానుల కోసం స్పెషల్ డిష్ ను వండారు. ప్రత్యేకంగా చికెన్ ను వండి మంచి చెఫ్ గా తన అభిమానులను ఆకట్టుకున్నారు. తనదైన రుచికరమైన చికెన్ ను ఎలా వండాలో సలహాలు, సూచనలతో పాటు ప్రతి పదార్థానికి సంబంధించిన కొలతలను కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ చికెన్ రుచి చూసిన ఆయన భార్య సుచిత్ర బాగుందంటూ కితాబునిచ్చింది.

ఇక వీడియో చూసిన నెటిజన్లు మలయాళ సూపర్ స్టార్ స్టైల్ చికెన్ రుచి చూడాల్సిందేనని అనుకుంటున్నారు. అనుకున్నదే తడవుగా వంట కార్యక్రమం కూడా మొదలు పెట్టారు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో భారీ సంఖ్యలో షేర్ అవుతోంది. మోహన్ లాల్ వంట చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఆయన ఒక వంటకాన్ని వండారు. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే... దర్శకుడు బి. ఉన్నికృష్ణన్ తో "ఆరట్టు",  ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్న "మరక్కర్ అరబికడలింటే సింహామ్‌" చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్న "బ్రో డాడీ" అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. "ట్వల్త్  మ్యాన్" అనే సినిమా కోసం దృశ్యం 2 తర్వాత జీతు జోసెఫ్‌తో కలిసి మరోసారి పని చేయబోతున్నారు. ఇక మోహన్ లాల్ తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన "మన్యం పులి" వంటి కొన్ని చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి ఆదరణను దక్కించుకున్నాయి. కొరటాల దర్శకత్వంలో వచ్చిన "జనతా గ్యారేజ్" చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసి మోహన్ లాల్ కీలకపాత్రలో కన్పించారు.