SignaturesPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/signatures/132/sompu-grainsa8627412-82bc-4307-be10-7e627d8fe00f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/signatures/132/sompu-grainsa8627412-82bc-4307-be10-7e627d8fe00f-415x250-IndiaHerald.jpg సాధారణంగా సోంపును చిన్న చూపు చూస్తాం. తక్కువ ధరలోనే దొరుకుంతుంది కదా అని దానిని పెద్దగా పట్టించుకోం. ఎప్పుడైనా ఫంక్షన్లలో భోజనం తరువాత అందిస్తేనే తింటాం. రెస్టారెంట్లలో చికెన్ బిర్యాని తిన్న తర్వాత సర్వర్ బిల్ తో పాటు అందించే, ట్రేలో ఉంటే తినేస్తాం. కానీ స్పెషల్గా ఎప్పుడూ సోంపును కొనుక్కోం. ఏదో అజీర్తిగా అనిపించిన సమయంలో మాత్రం షాప్లో కొనుక్కొని తింటాం. అజీర్తి సమస్యకు చెక్.. భోజన ప్రియులను బాధించే అతి పెద్ద సమస్య అజీర్తి. ఎన్ని డబ్బులు సంపాదించినా తృప్తిగా భోజనం చేయలేకపోతే ఆ బాధ వర్ణణాతీsompu grains{#}Chicken Biriyani;FENNEL;Sugar;Ayurveda;Shakti;Chequeతిన`సోంపు`గా.. దీనితో ఇన్ని ఉప‌యోగాలా..!తిన`సోంపు`గా.. దీనితో ఇన్ని ఉప‌యోగాలా..!sompu grains{#}Chicken Biriyani;FENNEL;Sugar;Ayurveda;Shakti;ChequeSun, 25 Jul 2021 13:39:19 GMT
     సాధారణంగా సోంపును చిన్న చూపు చూస్తాం. తక్కువ ధరలోనే దొరుకుంతుంది కదా అని దానిని పెద్దగా పట్టించుకోం. ఎప్పుడైనా ఫంక్షన్లలో భోజనం తరువాత అందిస్తేనే తింటాం. రెస్టారెంట్లలో చికెన్ బిర్యాని తిన్న తర్వాత సర్వర్ బిల్ తో పాటు అందించే, ట్రేలో ఉంటే తినేస్తాం. కానీ స్పెషల్గా ఎప్పుడూ సోంపును కొనుక్కోం. ఏదో అజీర్తిగా అనిపించిన సమయంలో మాత్రం షాప్లో కొనుక్కొని తింటాం.

అజీర్తి సమస్యకు చెక్..
భోజన ప్రియులను బాధించే అతి పెద్ద సమస్య అజీర్తి. ఎన్ని డబ్బులు సంపాదించినా తృప్తిగా భోజనం చేయలేకపోతే ఆ బాధ వర్ణణాతీతం. సంతృప్తిగా భోజనం చేసి అరిగించుకొనే శక్తి ఉన్నవాడే అసలైన సిరిమంతుడు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అంతటి ప్రాధాన్యత ఉంటుంది జీర్ణక్రియకు. జీర్ణక్రియ సక్రమంగా ఉంటే అన్ని సాఫీగా సాగిపోతాయి. అయితే అజీర్తి సమస్యకు సోంపుతో చెక్ పెట్టవచ్చు. సోంపు గింజలతో టీ చేసుకొని తాగడం వల్ల అజీర్తి సమస్య దాదాపుగా తగ్గిపోతుందని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.  

క్యాన్సర్ల నుంచి రక్షణ..
వివిధ రకాల క్యాన్సర్ల నుంచి సోంపు ద్వారా రక్షణ లభిస్తుంది. సోంపుతో తయారు చేసే ఫెన్నెల్ టీ తాగాలని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. రెగ్యులర్ ఈ టీ తాగడం వల్ల చర్మ, రొమ్ము ఇతర క్యాన్సర్ల రక్షణ లభిస్తుంది అని తెలుపుతున్నారు.

శ్వాస కోశ సమస్యలకు చెక్..
చలికాలం వచ్చినప్పుడు లేదా చల్లటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు పెద్ద వారిని ఇబ్బంది పెట్టె సమస్య శ్వాస కోశ సమస్య. ముఖ్యంగా ఆస్తమా పేషెంట్లు ఇలాంటి సమయంలో చాలా ఇబ్బంది పడతారు. అలాంటి వారికి కూడా సోంపు రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు. రెగ్యులర్గా సోంపు తినడం వల్ల శ్వాస కోశ సమస్యలు అదుపులో ఉంటాయి.

కంటి చూపు మెరుగుపడటానికి..
కంటి చూపు మెరుగుపడటానికి సోంపు ఉపయోగపడుతుందట. సోంపు రెగ్యులర్గా తినడం వల్ల కంటి చూపు సరిగా ఉండటంతో పాటు ఇతర కంటి సమస్యలు కూడా తగ్గిపోతాయట.

బరువు నియంత్రణలో ఉంచడంలో..
శరీర బరువును అదుపులో ఉంచడంలో సోంపు సహకరిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన వెంటనే సోంపు తినడం వల్ల అజీర్తి సమస్య దూరం కావడంతో పాటు బరువు కూడా నియంత్రణలో ఉంటుందని తెలుపుతున్నారు.

షుగర్ లెవెల్స్ను కంట్రోల్ ఉంచుతుంది..
ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్య షుగర్. చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని రకాల వయసుల వారికి ఈ మధ్య షుగర్ వస్తోంది. కొందరికి వంశపార్యపరంగా వస్తే మరి కొందరికి ఆహారపు అలవాట్ల వల్ల వస్తోంది. శరీరక శ్రమ లేకుండా జీవించే వారికి కూడా షుగర్ వ్యాధి సంభవిస్తోంది. అయితే ఇలాంటి షుగర్ సమస్యను కూడా సోంపు అదుపులో ఉంచుతోందట.  

ఫెన్నెల్ టీతో చాలా ఉపయోగాలు..
సోంపుతో తయారు చేసుకునే ఫెన్నెల్ తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ఈ టీ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. రెండు కప్పుల నీళ్లలో కొంత సోంపు వేయాలి. తరువాత స్టవ్పై పెట్టి మరిగించాలి. దీంతో మీ ఫ్లేవర్ని బట్టి పుధీనా ఆకులు, లేదా మీకు ఇష్టమైన తేనే కూడా వేసుకోవచ్చు. ఇలా మీకు ఇష్టమైన విధంగా ఫెన్నెల్ టీ తయారు చేసుకొని రెగ్యులర్గా తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మీరు కూడా ఇక నుంచి ఫెన్నెల్ టీ తాగుతారు కదా..





నెల రోజులు సరిగ్గా నిద్ర లేకపోతే.. ఏమౌతుందో తెలుసా..?

ప‌దిమంది కేడ‌ర్ లేని ఈ మ‌హిళా నేత చంద్ర‌బాబును ఏం అడిగిందో తెలుసా...!

ఆ వైసీపీ కమ్మ ఎమ్మెల్యేకు జగన్ మార్క్ షాక్?

ఆల్కహాల్ తో ఇవి అస్సలు తినకండి

ఈ పదార్థంతో దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులను అతికించవచ్చా..?

ఇంస్టాగ్రామ్ లో సెగరేపుతున్న విష్ణుప్రియ..!

గుడ్ న్యూస్.. పిల్లలకు కూడా కరోనా టీకా?

బిగ్ బ్రేకింగ్ : దేశంలో సెప్టెంబ‌ర్ నుండి పిల్ల‌ల‌కు వ్యాక్సిన్.. !

కటకటాల్లోకి శిల్పా కూడా వెళ్లనుందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>