MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kaikala-satyanarayana-birthday-097d7fd2-b80a-41b6-aefe-db7cbbf3988a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kaikala-satyanarayana-birthday-097d7fd2-b80a-41b6-aefe-db7cbbf3988a-415x250-IndiaHerald.jpgనవరస నట సార్వభౌముడు, సంపూర్ణ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టిన రోజు నేడు. గత 60 సంవత్సరాల నుండి దాదాపు ఐదు తరాలతో సినిమాల్లో నటించిన కైకాల ఏకంగా 777 సినిమాల్లో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద, హాస్య నాయక, ప్రతినాయక, సహాయక పాత్రలన్నింటినీ పోషించారు. అలాంటి ఆయనకు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు తో మంచి అనుబంధం ఉండేది. ఆ అనుబంధం ఎలా ఏర్పడింది అంటే కైకాల కెరీర్ మొదట్లో సినిమాల్లో వేషాల కోసం మద్రాసు వెళ్ళాడు. తన భారీ కాయంతో, కంచు కంఠంతో దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు. 1959లో డీ ఎల్ నారాయణ "Kaikala Satyanarayana Birthday;{#}apoorva;kaikala satyanarayana;krishna;Krishna River;Gudlavalleru;Pamarru;Yuvaraju;Darsakudu;Chennai;Director;Cinema;NTRఎన్టీఆర్ తో కైకాల అనుబంధం... ఎలా అంటే ?ఎన్టీఆర్ తో కైకాల అనుబంధం... ఎలా అంటే ?Kaikala Satyanarayana Birthday;{#}apoorva;kaikala satyanarayana;krishna;Krishna River;Gudlavalleru;Pamarru;Yuvaraju;Darsakudu;Chennai;Director;Cinema;NTRSun, 25 Jul 2021 18:00:00 GMTనవరస నట సార్వభౌముడు, సంపూర్ణ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టిన రోజు నేడు. గత 60 సంవత్సరాల నుండి దాదాపు ఐదు తరాలతో సినిమాల్లో నటించిన కైకాల ఏకంగా 777 సినిమాల్లో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద, హాస్య నాయక, ప్రతినాయక, సహాయక పాత్రలన్నింటినీ పోషించారు. అలాంటి ఆయనకు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు తో మంచి అనుబంధం ఉండేది. ఆ అనుబంధం ఎలా ఏర్పడింది అంటే కైకాల కెరీర్ మొదట్లో సినిమాల్లో వేషాల కోసం మద్రాసు వెళ్ళాడు. తన భారీ కాయంతో, కంచు కంఠంతో దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు. 1959లో డీ ఎల్ నారాయణ "సిపాయి కూతురు" అనే సినిమాలో కైకాల హీరోగా కనిపించారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో కైకాల నిరాశ పడినప్పటికీ ఆయన ప్రతిభ గురించి ఆ నోటా ఈ నోటా ఎన్టీఆర్ వరకు వెళ్ళింది. 1960లో "సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి"లో దర్శకుడు ఎస్ డి లాల్ కైకాలకు యువరాజు పాత్ర ఇచ్చాడు. 

ఇక ఎన్టీఆర్ కు కైకాల రూపు రేఖలు సరిపోవడంతో కొన్ని సినిమాల్లో ఆయనకు డూప్లికేట్ గా నటించే అవకాశం వచ్చింది. దీంతో ఎన్టీఆర్ కైకాలకు వరుసగా సినిమాల్లో అవకాశాలు కల్పించారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన "రాముడు భీముడు" చిత్రంలో సత్యనారాయణ ఆయనకు డూప్ గా నటించారు. ఆ తర్వాత కైకాలకు మంచి గుర్తింపు లభించింది. అలా అలా దాదాపు రామారావు కలిసి ఏకంగా వంద చిత్రాల్లో నటించారు. వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడడానికి మరో రీజన్ కూడా ఉంది. ఎన్టీఆర్, కైకాల ఒకే జిల్లాకు చెందిన వారు. వాళ్ళ ఊర్లు దగ్గర దగ్గర గానే ఉండేవి. ఎన్టీఆర్ ది కృష్ణ జిల్లా లోని పామర్రు మండలం, నిమ్మకూరు అయితే కైకాలది కృష్ణా జిల్లాలోనే గుడ్లవల్లేరు మండలం కైతరం గ్రామం. అలా స్థానికంగా ఒకే జిల్లాకు చెందినవారు కూడా కావడం వారి స్నేహానికి దారి తీసింది. ఎన్టీఆర్ చొరవతో సినిమాల్లో నిలదొక్కుకున్న కైకాల ఆ తర్వాత కూడా తండ్రిగా, బాబాయ్ గా, మామగా ఆఖరికి తాతగా కూడా యువతరాన్ని అలరించారు.



రష్యాలో రాళ్ళపల్లి పెద్ద కూతురు మరణం వెనక అసలు కారణం ?

యషికా ఆనంద్ హెల్త్ అప్డేట్... తాగి డ్రైవ్ చేశారా ?

ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాలో సూపర్ కామెడీ ట్రాక్..!

నారప్పపై వెంకటేష్‌ ఎమోషనల్‌ ?

హాట్ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తున్న నోరా..

చిరంజీవి ని ఫూల్ చేద్దామని చివరికి .. ?

ఛత్రపతి హిందీ రీమేక్ లో ఆ హీరోయిన్ నటించనుందా?

ఎనిమీ.. ఇలాంటి మల్టీస్టారర్ తెలుగులో పడుంటేనా..?

అంకుల్స్ తో కలిసి రచ్చ రచ్చ చేస్తున్న శ్రీముఖి..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>