MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trisha0d34ff53-7e49-4b11-9784-cd1e7ca9ec88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trisha0d34ff53-7e49-4b11-9784-cd1e7ca9ec88-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో గత రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేస్తున్న హీరోయిన్ త్రిష. నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో తెలుగు తెరపై కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వర్షం సినిమాతో హిట్ అందుకని వరుస సినిమా అవకాశాలను అందుకుంది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు , పౌర్ణమి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి సినిమాలు హిట్ చేసుకుని తనకు ఎదురు లేకుండా చేసుకుంది. తమిళ సినిమాల ద్వారా సినిమాల్లోకి వచ్చి ఈమె తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో పెద్ద హీరోయిన్ గా కొన్ని సంవత్సరాలు టాలీవుడ్ నtrisha{#}prema;Kollywood;Chennai;Hero;Nijam;Varsham;vegetable market;Athadu;Tollywood;Tamil;marriage;Love;Heroine;Telugu;Cinemaఆ దర్శకుడి ప్రేమలో మునిగి తేలుతున్న త్రిష .. పెళ్లి గడియలు వచ్చాయిఆ దర్శకుడి ప్రేమలో మునిగి తేలుతున్న త్రిష .. పెళ్లి గడియలు వచ్చాయిtrisha{#}prema;Kollywood;Chennai;Hero;Nijam;Varsham;vegetable market;Athadu;Tollywood;Tamil;marriage;Love;Heroine;Telugu;CinemaSat, 24 Jul 2021 18:00:00 GMTటాలీవుడ్ లో గత రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేస్తున్న హీరోయిన్ త్రిష. నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో తెలుగు తెరపై కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వర్షం సినిమాతో హిట్ అందుకని వరుస సినిమా అవకాశాలను అందుకుంది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు , పౌర్ణమి,  ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి సినిమాలు హిట్ చేసుకుని తనకు ఎదురు లేకుండా చేసుకుంది. తమిళ సినిమాల ద్వారా సినిమాల్లోకి వచ్చి ఈమె తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో పెద్ద హీరోయిన్ గా కొన్ని సంవత్సరాలు టాలీవుడ్ ను ఏలింది.

ఆ తర్వాత ఆమెకు హీరోయిన్ గా సినిమా అవకాశాలు తగ్గుతున్న కొద్దీ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి తనను తాను నిరూపించుకుంది. హీరో స్థాయి మార్కెట్ ను ఏర్పాటు చేసుకుని ఆమె ఇప్పటికీ సినిమాల్లో కనిపిస్తు హిట్ లు సాధిస్తూ అభిమానులను అలరిస్తోంది. దక్షిణాదిన అన్ని భాషల్లో అగ్ర హీరోలందరితో నటించి మెప్పించిన ఈ చెన్నై సుందరి వయసు నలభైకి చేరువ లో ఉంది అంటే నమ్మాల్సిందే. ఈమె వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. పెళ్లి పీటల దాకా వెళ్ళిన పెళ్లి క్యాన్సిల్ కావడంతో ఒక్కసారిగా ఆమె కుంగిపోయారు.

వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడి అతనితో నిశ్చితార్థం చేసుకుంది.  కానీ కొన్ని మనస్పర్థల కారణంగా ఆమె వెంటనే తన పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఓ బిజినెస్ మెన్ తో ఆమె వివాహం చేసుకోబోతోంది పుకార్లు వినిపించాయి. అది కూడా నిజం కాదని తేలింది. ఇప్పుడు కోలీవుడ్ దర్శకుడు తో ప్రేమలో ఉందని త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఓ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడం తో త్వరలోనే పెళ్లి చేసుకొనున్నట్లు కోలీవుడ్ కోడై కూస్తోంది. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే త్రిషా నోరు విప్పాల్సిందే.




చిన‌బాబు లుక్కు మారింది.. ఎక్స్‌ప్రెష‌న్ మారింది... !

మాట తప్పిన శంకర్.. నిరాశలో చెర్రీ ఫ్యాన్స్!!

అరుదైన ఘనతను సొంతం చేసుకున్న రానా...?

4 సార్లు కాకపోతే 40 సార్లు పెళ్ళి చేసుకుంటా... మీకేంటి ?

సుకుమార్.. విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ అప్డేట్..!

చరణ్ ఇంటి ముందు ఎన్టీఆర్? మేనేజర్ క్లారిటీ!

స్ట్రైట్ బాలీవుడ్ సినిమా కోసం అల్లు అర్జున్ ప్లాన్..!

చైతులో ఈ యాంగిల్ కూడా ఉందా...?

వివాదంలో "సర్పట్ట పరంపర"



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>