BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag07cdf4c7-7970-468c-bd1d-99d0d2e1ea0b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag07cdf4c7-7970-468c-bd1d-99d0d2e1ea0b-415x250-IndiaHerald.jpg ఢిల్లీ నుంచి గ‌వ‌ర్న‌ర్‌కు ఫోన్ వ‌చ్చింది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈరోజు ఫోన్‌చేసి వ‌ర‌ద న‌ష్టం వివ‌రాలు తెలుసుకున్నారు. వర్షాలు, వరదల వల్ల మ‌హారాష్ట్రలో ప్రాణ, ఆస్తి నష్టంపై రామ్‌నాథ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వరద బాధితుల సహాయం కోసం చేప‌డుతున్న స‌హాయ కార్యక్రమాల గురించి గ‌వ‌ర్న‌ర్ కోషియారీ రాష్ట్రపతికి వివ‌రించి చెప్పారు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా, మహద్‌లో కొండచరియలు విరిగిపడిన సంగ‌తి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్ప‌టివ‌ర‌కు 44 మంది మృతదేహాలను వెలిtag{#}Koshyari;Smart phone;Maharashtra;Ministerఢిల్లీ నుంచి గ‌వ‌ర్న‌ర్‌కు ఫోన్‌?ఢిల్లీ నుంచి గ‌వ‌ర్న‌ర్‌కు ఫోన్‌?tag{#}Koshyari;Smart phone;Maharashtra;MinisterSat, 24 Jul 2021 14:33:00 GMT

ఢిల్లీ నుంచి గ‌వ‌ర్న‌ర్‌కు ఫోన్ వ‌చ్చింది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈరోజు ఫోన్‌చేసి వ‌ర‌ద న‌ష్టం వివ‌రాలు తెలుసుకున్నారు. వర్షాలు, వరదల వల్ల మ‌హారాష్ట్రలో ప్రాణ, ఆస్తి నష్టంపై రామ్‌నాథ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
వరద బాధితుల సహాయం కోసం చేప‌డుతున్న స‌హాయ కార్యక్రమాల గురించి గ‌వ‌ర్న‌ర్ కోషియారీ రాష్ట్రపతికి వివ‌రించి చెప్పారు.  మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా, మహద్‌లో కొండచరియలు విరిగిపడిన సంగ‌తి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్ప‌టివ‌ర‌కు 44 మంది మృతదేహాలను వెలికి తీయ‌గా, ఇంకా స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి. గాయపడినవారిలో 35 మందికి చికిత్స అందిస్తూ స్వ‌ల్ప‌గాయాలైన‌వారిని ఇంటికి పంపించారు. మహారాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి విజయ్ వడెటివార్ పూర్తి వివ‌రాల‌ను గ‌వ‌ర్న‌ర్‌కు, మీడియాకు వెల్ల‌డించారు. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో భారీవ‌ర్షాల‌వ‌ల్ల 136 మంది మృత్యువాత ప‌డ్డార‌ని, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో ప్రాణాలు కోల్పోయిన‌వారికి ప్ర‌భుత్వం రూ.5 లక్ష‌ల చొప్పున న‌ష్ట‌ప‌రిహారం ఇస్తున్న‌ట్లు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన సంఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.



ఢిల్లీ నుంచి గ‌వ‌ర్న‌ర్‌కు ఫోన్ వ‌చ్చింది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈరోజు ఫోన్‌చేసి వ‌ర‌ద న‌ష్టం వివ‌రాలు తెలుసుకున్నారు. వర్షాలు, వరదల వల్ల మ‌హారాష్ట్రలో ప్రాణ, ఆస్తి నష్టంపై రామ్‌నాథ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వరద బాధితుల సహాయం కోసం చేప‌డుతున్న స‌హాయ కార్యక్రమాల గురించి గ‌వ‌ర్న‌ర్ కోషియారీ రాష్ట్రపతికి వివ‌రించి చెప్పారు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా, మహద్‌లో కొండచరియలు విరిగిపడిన సంగ‌తి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్ప‌టివ‌ర‌కు 44 మంది మృతదేహాలను వెలికి తీయ‌గా, ఇంకా స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి. గాయపడినవారిలో 35 మందికి చికిత్స అందిస్తూ స్వ‌ల్ప‌గాయాలైన‌వారిని ఇంటికి పంపించారు. మహారాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి విజయ్ వడెటివార్ పూర్తి వివ‌రాల‌ను గ‌వ‌ర్న‌ర్‌కు, మీడియాకు వెల్ల‌డించారు.

ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస్‌కి అమరావతి రైతుల సెగ గ‌ట్టిగా త‌గిలింది. తాళ్లాయపాలెం శివస్వామి ఆశ్రమానికి ఈరోజు మంత్రి వ‌చ్చారు. ఈ విష‌యం తెలుసుకున్న రైతులు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. రాజ‌ధానిలో నిర్మించ‌బోతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని కుదించడంపై రైతులు మండిప‌డ్డారు. వెల్లంపల్లి శ్రీ‌నివాస్ మంత్రి అయిన త‌ర్వాతే ఏపీలోని ఆల‌యాల‌పై దాడులు పెరిగాయంటూ నినిదాలు చేశారు. ఆల‌య నిర్మాణం కుదింపుతోపాటు త‌మ స‌మ‌స్య‌ల‌పై విన‌తిప‌త్రం ఇవ్వ‌బోగా తీసుకోవడానికి ఆయ‌న నిరాక‌రించారు. దీంతో రైతులంతా మినిస్టర్ డౌన్ డౌన్, ప‌ద‌వికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. రాజ‌ధాని గ్రామాల్లో ఒక‌టైన వెంక‌ట‌పాలెంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలో గ‌త ప్ర‌భుత్వం భారీగా ఆల‌య నిర్మాణానికి పూనుకుంది. ప్ర‌భుత్వం మారిన త‌ర్వాత దాని ప‌రిధిని కుదించ‌డంతోపాటు బ‌డ్జెట్‌ను కూడా కుదించారు.

మంత్రి ప‌ద‌వికి రాజీనామా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడిపై సంగం డెయిరీ చైర్మ‌న్ ధూళిపాళ్ల న‌రేంద్ర మండిప‌డ్డారు. గ‌తంలో డెయిరీ న‌డిపిన అనుభ‌వం ఉండి కూడా సంగంపై అర్థ‌ర‌హిత‌మైన విమ‌ర్శ‌లు చేయ‌డం త‌న‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేసింద‌న్నారు. త‌న‌కున్న ప‌నికిరాని భూముల‌ను ప్ర‌భుత్వానికి రూ.18కోట్ల‌కు విక్ర‌యించ‌డం వాస్త‌వం కాదా? అని ప్ర‌శ్నించారు. ఆ భూముల‌తో స‌మీపంలోనే పొలాల‌ను కొనుగోలు చేశార‌ని, వినుకొండ బైపాస్ రోడ్డును వాటికి స‌మీపం నుంచి మ‌ళ్లించింది కూడా వాస్త‌వం కాదా? అని నిల‌దీశారు. పాడి రైతుల‌కు ఇచ్చే బోన‌స్ గురించి, ఇత‌ర ప్రోత్సాహ‌కాల గురించి అవ‌గాహ‌న లేకుండా బ్ర‌హ్మ‌నాయుడు మాట్లాడ‌టం స‌రికాద‌ని, ప‌ద‌వితోకూడా వ్యాపారం చేయ‌వ‌చ్చ‌ని నిరూపించిన వ్య‌క్తి ఆయ‌నేన‌ని ఘాటుగా స్పందించారు. తిరుమ‌ల డెయిరీ పేరుతో గ‌తంలో డెయిరీని నిర్వ‌హించిన బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు సంగం డెయిరీలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌ని, పాడి రైతుల‌కు డ‌బ్బులు చెల్లించ‌డంలేద‌ని, ఇత‌ర ప్రోత్సాహ‌కాలు కూడా లేవంటూ నిన్న విమ‌ర్శ‌లు చేశారు. దీనిపై ఈరోజు సంగం డెయిరీ చైర్మ‌న్ ధూళిపాళ్ల స్పందించారు.

ప‌నికిరాని భూమిని ప్ర‌భుత్వానికి అమ్మిన ఎమ్మెల్యే?

కోవిడ్-19 టీకా గడువుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిప‌డ్డారు. మోదీ ప్రభుత్వానికి సత్తా లేదని ప్ర‌జ‌ల‌కు తెల‌వ‌డానికి, వెన్నెముక లేదనడానికి ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఏం కావాల‌ని రాహుల్ ప్ర‌శ్నించారు. దేశంలో టీకా కార్యక్రమం పూర్తికావడానికి పార్లమెంటులో కేంద్రం స్పందించిన తీరు దారుణ‌మ‌న్నారు. ప్ర‌జ‌ల జీవితాలు ప్ర‌మాద‌క‌ర స్థితికి చేరాయ‌ని, ప్ర‌జ‌ల‌కు టీకాలివ్వ‌డానికి గ‌డువేమీ లేద‌ని ప్ర‌భుత్వం చెబుతోంద‌ని, టీకాలు ఎక్క‌డున్నాయ‌ని, స‌రిప‌డా అందుబాటులో ఉన్నాయా? అని రాహుల్ ప్ర‌శ్నించారు. దేశ‌వ్యాప్తంగా కొవిడ్ టీకా కార్య‌క్ర‌మం పూర్తికావ‌డానికి ఒక నిర్దిష్ట‌మైన గ‌డువు కూడా ఏమీ లేద‌న‌డం ప్ర‌భుత్వ బాధ్య‌తారాహిత్యాన్ని గుర్తుచేస్తోంద‌న్నారు. కోవిడ్-19 టీకా కార్య‌క్ర‌మానికి సంబంధించిన వివ‌రాలను న‌రేంద్ర‌మోదీ స‌ర్కార్ శుక్ర‌వారం లోక్‌స‌భ‌కు తెలిపిన సంగ‌తి తెలిసిందే.

మోదీకి వెన్నెముక లేదు?

జుజ్జులూరులో ఉద్రిక్త‌త‌...టీడీపీ నేత‌ల అరెస్ట్‌

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు రోజుకో మ‌లుపు తిరుగుతోంది. వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగ‌య్య చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఎర్ర గంగిరెడ్డి స్పందించారు. వివేకా ప్ర‌ధాన అనుచ‌రుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి త‌న‌ను బెదిరించార‌ని, ఎవ‌రికైనా త‌న పేరు చెబితో న‌రుకుతాన‌న్నాడ‌ని రంగ‌య్య చెప్పిన సంగ‌తి తెలిసిందే. రంగ‌య్య ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని, ఆయ‌న‌తో త‌న‌కు ప‌రిచ‌య‌మే లేద‌ని, తాను ఎవ‌రినీ బెదిరించ‌లేద‌ని గంగిరెడ్డి స్ప‌ష్టం చేశారు. క‌డ‌ప‌లోకానీ, పులివెందుల‌లోకానీ తాను బెదిరించిన‌ట్లు ఎక్క‌డా ఒక్క కేసు కూడా న‌మోదుకాలేద‌ని, తాను వివేకాకు ద్రోహం చేసే వ్య‌క్తిని కాన‌ని, ఆయ‌న హ‌త్య‌కేసులో త‌న‌కు ప్ర‌మేయం లేద‌న్నారు. త‌న‌పై ఈగ కూడా వాల‌నీయ‌బోమ‌ని సీబీఐ అధికారులు భ‌రోసా ఇచ్చార‌ని, ఆ భ‌రోసాతోనే తాను జ‌మ్మ‌ల‌మ‌డుగు న్యాయ‌స్థానంలో వాంగ్మూలం ఇచ్చాన‌ని రంగ‌య్య చెప్పారు. పులివెందుల చేరుకున్న రంగ‌య్య‌ను స్థానికులు, విలేక‌రులు ప్ర‌శ్నిస్తున్న వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>