MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja5d4de98e-c339-49d9-ae0e-a465b0fe6801-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja5d4de98e-c339-49d9-ae0e-a465b0fe6801-415x250-IndiaHerald.jpgమాస్ రాజా రవితేజ క్రాక్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత చేస్తున్న చిత్రం ఖిలాడీ. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వీర అనే సినిమా రాగా ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతో నిరాశ పరిచింది. దాంతో ఈ సారి చేసే సినిమాతో హిట్ కొట్టాలని చాలా రోజులు ఈ స్క్రిప్ట్ పై పని చేయగా మాస్ మహారాజా ఈ చిత్రం కథ విని ఎటువంటి ఆలోచనలు లేకుండా చిత్రాన్ని ఓకే చేశాడు. దాన్ని బట్టి ఈ సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. సాలిడ్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రవితేజ తన కెరీరRaviteja{#}Ravi;raja;ramesh varma;ravi teja;Posters;Krack;Chitram;Mass;Cinema;Heroineజూలై 26 నుంచి ఖిలాడి దుమ్ము రేపుతుందట!!జూలై 26 నుంచి ఖిలాడి దుమ్ము రేపుతుందట!!Raviteja{#}Ravi;raja;ramesh varma;ravi teja;Posters;Krack;Chitram;Mass;Cinema;HeroineSat, 24 Jul 2021 16:07:34 GMTమాస్ రాజా రవితేజ క్రాక్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత చేస్తున్న చిత్రం ఖిలాడీ. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వీర అనే సినిమా రాగా ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతో నిరాశ పరిచింది. దాంతో ఈ సారి చేసే సినిమాతో హిట్ కొట్టాలని చాలా రోజులు ఈ స్క్రిప్ట్ పై పని చేయగా మాస్ మహారాజా ఈ చిత్రం కథ విని ఎటువంటి ఆలోచనలు లేకుండా చిత్రాన్ని ఓకే చేశాడు. దాన్ని బట్టి ఈ సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. సాలిడ్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రవితేజ తన కెరీర్ లోనే హై యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతుంది.

మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్ లు గా నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా అవుతుంది. అన్ని కరెక్ట్ గా ఉండి ఉంటే ఈ సినిమా మే లోనే థియేటర్లకు వచ్చి ఉండేది. కానీ కాలేదు.  ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అధికారికంగా ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రం యొక్క కొత్త షెడ్యూల్ ఈ నెల 26 నుంచి హైదరాబాదులో మొదలు కానుంది. ఈ కొత్త షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలు తెరకెక్కించబోతున్నారట. దీన్ని అనౌన్స్ చేస్తూ ఒక అదిరిపోయే పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇక ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపిస్తుండటం విశేషం. పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఓ వైపు ఈ సినిమా చేస్తూనే రవితేజ శరత్ మండవ అనే దర్శకుడుతో రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా చేస్తున్నాడు. రవితేజ తన కెరీర్లో 68వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేసకుంది. ఇవే కాకుండా మరికొన్ని సినిమాల కథలు కూడా రవితేజ వింటున్నాడట. అవి ఓకే అయితే త్వరలోనే మరికొన్ని సినిమాలను కూడా ఓకే చేసి ఆ సినిమాలు కూడా చేయాలని చూస్తున్నాడు. 



స్ట్రైట్ బాలీవుడ్ సినిమా కోసం అల్లు అర్జున్ ప్లాన్..!

చైతులో ఈ యాంగిల్ కూడా ఉందా...?

వివాదంలో "సర్పట్ట పరంపర"

సినిమాలు, వెబ్ సిరీసులతో బిజీగా ఉన్న స్టార్ హీరో..?

రికార్డు సృష్టించిన రెబల్ స్టార్ ప్రభాస్.. ఎవరికీ సాధ్యం కాదు ఇది!!

చిన్నారి గంగోత్రి మరి ఇంత హాట్ గానా ?

సినిమా ఇండస్ట్రీని వదిలేసి రైతుగా వ్యవసాయం చేస్తున్న ప్రముఖ నటుడు..?

రాజమౌళి.. మెగాస్టార్ చిరంజీవి కాంబో.. మెగా ఫ్యాన్స్ వెయిటింగ్..!

నెట్టింట వైరల్ అవుతున్న మహేష్ న్యూ లుక్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>