MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sarpatta-parambarai--dancing-rose-347ee3d5-5d02-462b-851b-4ec779931a41-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sarpatta-parambarai--dancing-rose-347ee3d5-5d02-462b-851b-4ec779931a41-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్పోర్ట్స్ డ్రామా "సర్పట్ట పరంబరై"పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తమిళ స్టార్ ఆర్య హీరోగా నటించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని సోషల్ మీడియా పేజీలలో ట్రెండింగ్‌లో ఉంది. సినిమా ఆన్లైన్ లో లీక్ అయినప్పటికీ మంచి స్పందన వస్తోంది. సినిమాను చూసిన వాళ్ళు ఆర్య కెరీర్ లోనే ఈ చిత్రం ఓ మైలు రాయి అని అంటున్నారు. ప్రేక్షకులను అంతగా మెప్పించిన ఈ చిత్రంలో ప్రతి నటుడి అద్భుతమైన నటనకు విమర్శకులు సైతం ఫిSarpatta Parambarai - Dancing Rose;{#}Parents;Fidaa;Varsham;Aryaa;arya;Tamil;Chitram;News;Director;media;Cinema;Hero"సర్పట్ట పెరంబర్తె"లో ఈ ఫేమస్ బాక్సర్ స్పూర్తితో డాన్సింగ్ రోజ్ పాత్ర...!"సర్పట్ట పెరంబర్తె"లో ఈ ఫేమస్ బాక్సర్ స్పూర్తితో డాన్సింగ్ రోజ్ పాత్ర...!Sarpatta Parambarai - Dancing Rose;{#}Parents;Fidaa;Varsham;Aryaa;arya;Tamil;Chitram;News;Director;media;Cinema;HeroSat, 24 Jul 2021 11:00:00 GMTకోలీవుడ్ స్పోర్ట్స్ డ్రామా "సర్పట్ట పరంబరై"పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తమిళ స్టార్ ఆర్య హీరోగా నటించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని సోషల్ మీడియా పేజీలలో ట్రెండింగ్‌లో ఉంది. సినిమా ఆన్లైన్ లో లీక్ అయినప్పటికీ మంచి స్పందన వస్తోంది. సినిమాను చూసిన వాళ్ళు ఆర్య కెరీర్ లోనే ఈ చిత్రం ఓ మైలు రాయి అని అంటున్నారు. ప్రేక్షకులను అంతగా మెప్పించిన ఈ చిత్రంలో ప్రతి నటుడి అద్భుతమైన నటనకు విమర్శకులు సైతం ఫిదా అయిపోయారు. రెండు కుటుంబాల మధ్య పగను స్పోర్ట్స్ డ్రామాతో ముడిపెట్టాడు దర్శకుడు. ఇలా సరికొత్త పాయింట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్న ఈ చిత్రంలో ప్రధాన హీరో కబీలాన్ (ఆర్య), వెంబులి (జాన్ కొక్కెన్) పాత్రలతో పాటు, షబ్బీర్ కల్లారక్కల్ పోషించిన 'డ్యాన్సింగ్ రోజ్' పాత్ర కూడా సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమాతో షబ్బీర్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. సినిమా చూశాక అంతా ఆయన నటన గురించే మాట్లాడుతున్నారు. ఈ సినిమాతో అతని క్రేజ్ ఎంతగా పెరిగిపోయిందంటే డ్యాన్స్ రోజ్ హీరోగా ప్రత్యేక సినిమా చేయాలంటూ అభిమానులు డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఇంతకుముందు ఈ యంగ్ యాక్టర్ అడాంగా మారు, పేటా, టెడ్డీ వంటి సినిమాల్లో సహాయక పాత్రల్లో కనిపించాడు. 

అసలు విషయంలోకి వస్తే... "సర్పట్ట పరంబరై"లో షబ్బీర్ పోషించిన పాత్రకు స్ఫూర్తిగా ఓ ఫేమస్ బాక్సర్ ను తీసుకున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం డ్యాన్సింగ్ రోజ్ పాత్ర యూకేకి చెందిన పాపులర్ బాక్సర్ నసీమ్ హమీద్ నుండి ప్రేరణ పొందింది. అతను బాక్సింగ్ రింగ్ లో తన ప్రత్యేకమైన శైలిలో కన్పిస్తాడు. దాదాపు డ్యాన్స్ చేస్తున్నట్టుగానే బాక్సింగ్ చేస్తాడు. ఈయనను స్ఫూర్తిగా తీసుకునే మేకర్స్ ఈ బాక్సింగ్ స్పోర్ట్స్ డ్రామాలో 'డ్యాన్సింగ్ రోజ్' పాత్రను రూపొందించారని తెలుసుకున్న వారు ఆశ్చర్యపోతున్నారు. కాగా తాజాగా ఆర్య, సాయేషా దంపతులు పండంటి ఆడబిడ్డకు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే.




డిస్క‌ష‌న్ పాయింట్ : అంత భ‌యం ఎందుకు వెంకీ?

ఖ‌డ్గంలో సంగీత‌ను వాడుకునే సీన్‌... ఆ టాలీవుడ్ టాప్ డైరెక్ట‌రే కృష్ణ వంశీ టార్గెట్ ?

చైనాపై పగ తీర్చుకుంటున్న ప్రకృతి.. ఇదే సాక్ష్యం?

ఆ టాప్ హీరోయిన్‌తో ఉపేంద్ర పెళ్లి ఎందుకు జ‌ర‌గ‌లేదు ?

అనిరుధ్ ఎందుకు.. ఫ్యూచర్ లో అతనేనా!!

గాడిదపై సర్పంచ్ ఊరేగింపు.. దేనికో తెలిస్తే షాకే?

తారక్ కొత్త కారు చూసారా.. అదిరిపోయింది

'పుష్ప'లో పవన్ అత్త కీలక పాత్ర ... ?

కేటిఆర్ కు షర్మిల పుట్టిన రోజు విష్, మళ్ళీ అలాగే...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>