BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag3cda8b14-3cc2-451e-bb88-a7fae8775cfe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag3cda8b14-3cc2-451e-bb88-a7fae8775cfe-415x250-IndiaHerald.jpgక‌ర్ణాట‌క ముఖ్యమంత్రి యడ్యూర‌ప్ప రాజీనామా వెనుక ప్రత్యేక కారణాలు లేవని తేలింది. కేంద్ర పెద్దలతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే రాజీనామాకు సిద్ధ‌మ‌య్యార‌ని బీజేపీ ఎంపీ శ్రీనివాసప్రసాద్ ప్ర‌క‌టించారు. ఈయ‌న చేసిన ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నం రేకెత్తించింది. అధిష్టానం, యడ్యూర‌ప్ప‌ల మధ్య ఒప్పందం గ‌తంలోనే కుదిరింద‌ని, ఆ మేర‌కే ఆయ‌న రాజీనామా చేస్తున్నారన్నారు. సంకీర్ణ ప్రభుత్వం కూల్చి బీజేపీ ప్రభుత్వం ప్ర‌మాణ‌స్వీకారం చేసిన స‌మ‌యంలో ఇది జ‌రిగింద‌న్నారు. 75ఏళ్ళు పైబడిన వారికి బీజేపీలో కీలక పదవులు ఇవ్వ‌ర‌ని, ఒప్పందానtag{#}contract;Bharatiya Janata Party;central government;రాజీనామా;Government;Telangana Chief Ministerమోదీ-య‌డ్యూర‌ప్ప‌ మ‌ధ్య ఒప్పందం?మోదీ-య‌డ్యూర‌ప్ప‌ మ‌ధ్య ఒప్పందం?tag{#}contract;Bharatiya Janata Party;central government;రాజీనామా;Government;Telangana Chief MinisterSat, 24 Jul 2021 12:54:00 GMT

క‌ర్ణాట‌క ముఖ్యమంత్రి యడ్యూర‌ప్ప రాజీనామా వెనుక ప్రత్యేక కారణాలు లేవని తేలింది. కేంద్ర పెద్దలతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే రాజీనామాకు సిద్ధ‌మ‌య్యార‌ని బీజేపీ ఎంపీ శ్రీనివాసప్రసాద్ ప్ర‌క‌టించారు. ఈయ‌న చేసిన ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నం రేకెత్తించింది. అధిష్టానం, యడ్యూర‌ప్ప‌ల మధ్య ఒప్పందం గ‌తంలోనే కుదిరింద‌ని, ఆ మేర‌కే ఆయ‌న రాజీనామా చేస్తున్నారన్నారు. సంకీర్ణ ప్రభుత్వం కూల్చి బీజేపీ ప్రభుత్వం ప్ర‌మాణ‌స్వీకారం చేసిన స‌మ‌యంలో ఇది జ‌రిగింద‌న్నారు. 75ఏళ్ళు పైబడిన వారికి బీజేపీలో కీలక పదవులు ఇవ్వ‌ర‌ని, ఒప్పందానికి అనుగుణంగానే ముఖ్యమంత్రిగా రెండేళ్ళ ప‌ద‌వీకాలం ముగిసే రోజునే య‌డ్యూర‌ప్ప రాజీనామా చేస్తున్నారని శ్రీ‌నివాస‌ప్ర‌సాద్ వెల్ల‌డించారు. ఆయ‌న్ను ఢిల్లీకి పిలిపించ‌డానికి ప్ర‌త్యేక‌మైన కార‌ణం ఏదీ లేద‌ని, గ‌తంలో కుదిరిన ఒప్పందం మేర‌కు రాజీనామా చేయాల‌నే అంశాన్ని గుర్తుచేయ‌డానికే పిలిచార‌ని, అందుకు అనుగుణంగా ఆయ‌న కూడా సిద్ధ‌ప‌డ్డార‌న్నారు. భార‌తీయ జ‌న‌తాపార్టీ ఆధ్వ‌ర్యంలో క‌ర్ణాట‌క‌లో ఏర్ప‌డిన ప్ర‌భుత్వానికి ముఖ్య‌మంత్రులు క‌లిసిరావ‌డంలేద‌నే సెంటిమెంటు బ‌ల‌ప‌డుతోంది. మొద‌టి నుంచి క‌ర్ణాట‌క‌లో బీజేపీ త‌ర‌ఫున ఏ వ్య‌క్తి కూడా పూర్తికాలం ప‌ద‌విలో కొన‌సాగ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.






అవగాహన ఒప్పందాన్ని రద్దు చేసిన బ్రెజిల్..?

కోవిడ్-19 టీకా గడువుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిప‌డ్డారు. మోదీ ప్రభుత్వానికి సత్తా లేదని ప్ర‌జ‌ల‌కు తెల‌వ‌డానికి, వెన్నెముక లేదనడానికి ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఏం కావాల‌ని రాహుల్ ప్ర‌శ్నించారు. దేశంలో టీకా కార్యక్రమం పూర్తికావడానికి పార్లమెంటులో కేంద్రం స్పందించిన తీరు దారుణ‌మ‌న్నారు. ప్ర‌జ‌ల జీవితాలు ప్ర‌మాద‌క‌ర స్థితికి చేరాయ‌ని, ప్ర‌జ‌ల‌కు టీకాలివ్వ‌డానికి గ‌డువేమీ లేద‌ని ప్ర‌భుత్వం చెబుతోంద‌ని, టీకాలు ఎక్క‌డున్నాయ‌ని, స‌రిప‌డా అందుబాటులో ఉన్నాయా? అని రాహుల్ ప్ర‌శ్నించారు. దేశ‌వ్యాప్తంగా కొవిడ్ టీకా కార్య‌క్ర‌మం పూర్తికావ‌డానికి ఒక నిర్దిష్ట‌మైన గ‌డువు కూడా ఏమీ లేద‌న‌డం ప్ర‌భుత్వ బాధ్య‌తారాహిత్యాన్ని గుర్తుచేస్తోంద‌న్నారు. కోవిడ్-19 టీకా కార్య‌క్ర‌మానికి సంబంధించిన వివ‌రాలను న‌రేంద్ర‌మోదీ స‌ర్కార్ శుక్ర‌వారం లోక్‌స‌భ‌కు తెలిపిన సంగ‌తి తెలిసిందే.

మోదీకి వెన్నెముక లేదు?

క‌ర్ణాట‌క క‌మల ద‌ళంలో కుర్చీలాట‌..! ఎవ‌రికి వారే పోటీ..

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు రోజుకో మ‌లుపు తిరుగుతోంది. వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగ‌య్య చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఎర్ర గంగిరెడ్డి స్పందించారు. వివేకా ప్ర‌ధాన అనుచ‌రుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి త‌న‌ను బెదిరించార‌ని, ఎవ‌రికైనా త‌న పేరు చెబితో న‌రుకుతాన‌న్నాడ‌ని రంగ‌య్య చెప్పిన సంగ‌తి తెలిసిందే. రంగ‌య్య ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని, ఆయ‌న‌తో త‌న‌కు ప‌రిచ‌య‌మే లేద‌ని, తాను ఎవ‌రినీ బెదిరించ‌లేద‌ని గంగిరెడ్డి స్ప‌ష్టం చేశారు. క‌డ‌ప‌లోకానీ, పులివెందుల‌లోకానీ తాను బెదిరించిన‌ట్లు ఎక్క‌డా ఒక్క కేసు కూడా న‌మోదుకాలేద‌ని, తాను వివేకాకు ద్రోహం చేసే వ్య‌క్తిని కాన‌ని, ఆయ‌న హ‌త్య‌కేసులో త‌న‌కు ప్ర‌మేయం లేద‌న్నారు. త‌న‌పై ఈగ కూడా వాల‌నీయ‌బోమ‌ని సీబీఐ అధికారులు భ‌రోసా ఇచ్చార‌ని, ఆ భ‌రోసాతోనే తాను జ‌మ్మ‌ల‌మ‌డుగు న్యాయ‌స్థానంలో వాంగ్మూలం ఇచ్చాన‌ని రంగ‌య్య చెప్పారు. పులివెందుల చేరుకున్న రంగ‌య్య‌ను స్థానికులు, విలేక‌రులు ప్ర‌శ్నిస్తున్న వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఎవ‌రికైనా నాపేరు చెబితే న‌రుకుతా?

విశాఖ ఉక్కుపై టీడీపీ స్టాండ్ ఏంటి ?

బుల్లి పిట్ట: రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త..

క‌ర్ణాట‌క ముఖ్యమంత్రి యడ్యూర‌ప్ప రాజీనామా వెనుక ప్రత్యేక కారణాలు లేవని తేలింది. కేంద్ర పెద్దలతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే రాజీనామాకు సిద్ధ‌మ‌య్యార‌ని బీజేపీ ఎంపీ శ్రీనివాసప్రసాద్ ప్ర‌క‌టించారు. ఈయ‌న చేసిన ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నం రేకెత్తించింది. అధిష్టానం, యడ్యూర‌ప్ప‌ల మధ్య ఒప్పందం గ‌తంలోనే కుదిరింద‌ని, ఆ మేర‌కే ఆయ‌న రాజీనామా చేస్తున్నారన్నారు. సంకీర్ణ ప్రభుత్వం కూల్చి బీజేపీ ప్రభుత్వం ప్ర‌మాణ‌స్వీకారం చేసిన స‌మ‌యంలో ఇది జ‌రిగింద‌న్నారు. 75ఏళ్ళు పైబడిన వారికి బీజేపీలో కీలక పదవులు ఇవ్వ‌ర‌ని, ఒప్పందానికి అనుగుణంగానే ముఖ్యమంత్రిగా రెండేళ్ళ ప‌ద‌వీకాలం ముగిసే రోజునే య‌డ్యూర‌ప్ప రాజీనామా చేస్తున్నారని శ్రీ‌నివాస‌ప్ర‌సాద్ వెల్ల‌డించారు. ఆయ‌న్ను ఢిల్లీకి పిలిపించ‌డానికి ప్ర‌త్యేక‌మైన కార‌ణం ఏదీ లేద‌ని, గ‌తంలో కుదిరిన ఒప్పందం మేర‌కు రాజీనామా చేయాల‌నే అంశాన్ని గుర్తుచేయ‌డానికే పిలిచార‌ని, అందుకు అనుగుణంగా ఆయ‌న కూడా సిద్ధ‌ప‌డ్డార‌న్నారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>