మా ఆయ‌న అమాయ‌కుడు – కానీ 48 టీబీ పోర్న్ ఫోటోలు

దేశంలో సంచ‌ల‌నం సృష్టించిన ఫోర్న‌గ్ర‌ఫీ కేసు రోజుకో మ‌లుపు తిరుగుతుంది. ఇప్ప‌టికే పోలీస్ క‌స్ట‌డీలో ఉన్నా శిల్పాశెట్టి భ‌ర్త రాజ్‌కుంద్రా విచార‌ణ సాగుతోంది. ఈ కేసులో భాగంగానే శిల్పాశెట్టిని పోలీసులు విచారించారు. ఆమె స్టేట్‌ మెంట్‌ను రికార్డు చేశారు. విచారణ సందర్భంగా ఆమె తన భర్తను వెనకేసుకొచ్చినట్లు సమాచారం. రాజ్‌కుంద్రా అమాయకుడని, ‘ఎరోటికా’కు ‘పోర్న్‌’కు తేడా ఉందని, ‘ఎరోటికా’..‘పోర్న్‌’ కాదని ఆమె అన్నట్లు తెలుస్తోంది. యాప్‌ నిర్వహణ లండన్‌లో ఉన్న రాజ్‌కుంద్రా బావమరిది ప్రదీప్‌ భక్సిదని ఆమె చెప్పినట్లు సమాచారం. కాగా, ముంబై మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం రాజ్‌కుంద్రా కస్టడీని ఈ నెల 27 వరకు పొడిగించింది. దాదాపు 48 టెరాబైట్‌(టీబీ)ల అశ్లీల ఫొటోలు, వీడియోలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుంద్రా పేర రిజిస్ట్రర్‌ అయిన యస్‌ బ్యాంకు, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఆఫ్రికా ఖాతాల లావాదేవీలను రికార్డు చేశామని వెల్లడించారు. పోర్నోగ్రఫీ కంటెంట్‌ ద్వారా వచ్చిన డబ్బులను ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. దాదాపు 7.5 కోట్ల రూపాయలను సీజ్‌ చేశారు.