PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/telangana-politics53513d28-fd84-4844-917e-21d63cf7f9a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/telangana-politics53513d28-fd84-4844-917e-21d63cf7f9a7-415x250-IndiaHerald.jpgదేశంలో ఎక్క‌డా లేని సంక్షేమ ప‌థ‌కాల‌ను తెలంగాణ‌లో అమ‌లు చేస్తున్నామ‌ని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వ‌స్తోంది. అదే క్ర‌మంలో ఇటీవ‌ల మ‌రో ప‌థ‌కానికి తెలంగాణ సీఎం శ్రీ‌కారం చుట్టారు. అదే ద‌ళిత బంధు.. ద‌ళితుల‌కు మేలు చేయాల‌నే ఉద్ధేశంతో ఈ ప‌థ‌కాన్ని ప్రవేశ‌ప‌ట్టిన‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది. దీని ద్వారా ప్రతీ నియోజకవర్గంలో 100 మంది దళితులను ఎంపిక చేసి వారికి రూ. 10 లక్షలను అందించాలని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇదే క్ర‌మంలో ఆ ప‌థ‌కం అములు కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ఓ ప్ర‌త్యేక యాప్‌ను కూడా రdaltha bandhu{#}KCR;Bhuma Akhila Priya;Karimnagar;Government;Assembly;Telangana;CM`ద‌ళిత బంధు` ధ‌ర‌ఖాస్తుకు ప్ర‌త్యేక యాప్‌.. వివ‌రాలివే..!`ద‌ళిత బంధు` ధ‌ర‌ఖాస్తుకు ప్ర‌త్యేక యాప్‌.. వివ‌రాలివే..!daltha bandhu{#}KCR;Bhuma Akhila Priya;Karimnagar;Government;Assembly;Telangana;CMSat, 24 Jul 2021 09:02:00 GMT దేశంలో ఎక్క‌డా లేని సంక్షేమ ప‌థ‌కాల‌ను తెలంగాణ‌లో అమ‌లు చేస్తున్నామ‌ని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వ‌స్తోంది. అదే క్ర‌మంలో ఇటీవ‌ల మ‌రో ప‌థ‌కానికి తెలంగాణ సీఎం శ్రీ‌కారం చుట్టారు. అదే ద‌ళిత బంధు.. ద‌ళితుల‌కు మేలు చేయాల‌నే ఉద్ధేశంతో ఈ ప‌థ‌కాన్ని ప్రవేశ‌ప‌ట్టిన‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది. దీని ద్వారా ప్రతీ నియోజకవర్గంలో 100 మంది దళితులను ఎంపిక చేసి వారికి రూ. 10 లక్షలను అందించాలని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇదే క్ర‌మంలో ఆ ప‌థ‌కం అములు కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ఓ ప్ర‌త్యేక యాప్‌ను కూడా రూపొందిస్తోంది.

     ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు ప్ర‌భుత్వం సన్నాహాలు చేస్తోంది. నియోజవర్గంలో రూ. 2 వేల కోట్లను ఈ పథకం కింద ఖర్చు చేయాలని స‌ర్కార్ నిర్ణయించింది. ఈ నెల 26న సీఎం కేసీఆర్ సారథ్యంలో దళిత బంధు అవగాహన కార్యక్రమం నిర్వహించ‌నున్న‌ట్టు తెలిసిందే. ఈ సమావేశంలో పథకం అమలుకు మార్గదర్శకాలను ప్రకటించే అవకాశం ఉంది.

    ఈ ప‌థ‌కంలో ఇత‌ర ప్ర‌యోజ‌నాలు పొంద‌ని కుటుంబాల‌ను మాత్ర‌మే లెక్క‌లోకి తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది.  ఈ పథాకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజవర్గంలో అమ‌లు చేసిన తర్వాత దీన్ని రాష్ట్రమంతటా అమలు చేయనున్నట్లు ప్ర‌భుత్వం వివ‌రించింది. ఈ పథ‌కం కోసం రూ.1200 కోట్లను కేటాయించినట్లు ఇటీవల జరిగిన అఖిల పక్ష సమావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. మొద‌టి విడుత‌లో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున‌, రాష్ట్ర‌వ్యాప్తంగా 11,900 కుటుంబాల‌కు ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ది చేకూర్చేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్టు తెలిసింది. రైతుబంధు ప‌థ‌కం లాగానే నేరుగా ల‌బ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను ప్ర‌భుత్వం జమ చేయనుంది.


హుజూరాబాద్ ఎన్కిక‌ల వేళ ప్ర‌వేశపెట్ట‌నున్న ఈ ప‌థ‌కాన్ని అత్యంత పార‌ద‌ర్శంగా అమలు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ మేర‌కు ప‌థ‌కం ద‌ర‌ఖాస్తు కోసం ప్ర‌త్యేక యాప్‌ను రూపొందించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణయించింది. అప్లికేష‌న్ రూపొందించ‌డానికి  ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(CGG) కి అప్ప‌జెప్పింది. యాప్ తో పాటు, వెబ్ పోర్టల్ ను ఈ నెల చివరిలోగా రూపొందించి అందుబాటులోకి తీసుకురావాలని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.





టిఆర్ఎస్ కు షాక్..? మరో కీలక నేత గుడ్ బై చెప్పనున్నారా..?

టోక్యో ఒలింపిక్స్: నిరాశ పరిచిన మహిళా షూటర్లు ...

​ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బ‌దిలీలు?

బ‌ర్త్ డే స్పెషల్ : యువ రాజు ఎలా ఉన్నాడు

కాబోయే ప్రధాని జగన్..? వైసీపీ స్ట్రాటజీ ఏంటి..?

తండ్రికి తగ్గ తనయుడు.. తారక రాముడు ?

ఆ సంఘటనతోనే జబర్దస్త్ వేణు తను ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోలేదు ?

సీఎం జగన్‌ ఎందుకు..? అకౌంటెంట్‌ చాలు.. ప్రొ. కె.నాగేశ్వర్‌ షాకింగ్‌ వీడియో..?

వైసీపీతో కలసి పనిచేసేందుకు రెడీ -చంద్రబాబు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>