PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag6a712ce8-3259-4536-9df5-7c8f0de72f4c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag6a712ce8-3259-4536-9df5-7c8f0de72f4c-415x250-IndiaHerald.jpgసీనియర్ క్రికెటర్ సురేష్ రైనా ఈ మధ్య తరచుగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్నారు. యూఏఈలో గ‌తేడాది జరిగిన ఐపీఎల్ నుంచి అర్ధంతరంగా తప్పుకుని రైనా భార‌త్‌కు తిరిగిరావ‌డం సంచ‌ల‌నం రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్ నుంచి త‌ప్పుకోవ‌డానికి అనేక కార‌ణాలు వినిపించిన‌ప్ప‌టికీ అది స‌మ‌సిపోయింది. ఈ సంవ‌త్స‌రం ఐపీఎల్‌లో మ‌ళ్లీ అత‌ను చెన్నై జ‌ట్టుకు ఆడిన సంగ‌తి తెలిసిందే. tag{#}ranina;Cricket;Suresh Raina;Whistle;Tamilnadu;Chennaiచెన్నైలో బ్రాహ్మ‌ణులు మాత్ర‌మే ఉంటారా?చెన్నైలో బ్రాహ్మ‌ణులు మాత్ర‌మే ఉంటారా?tag{#}ranina;Cricket;Suresh Raina;Whistle;Tamilnadu;ChennaiFri, 23 Jul 2021 17:13:39 GMT
సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా ఈ మధ్య తరచుగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్నారు. యూఏఈలో గ‌తేడాది జరిగిన ఐపీఎల్ నుంచి అర్ధంతరంగా తప్పుకుని రైనా భార‌త్‌కు తిరిగిరావ‌డం సంచ‌ల‌నం రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్ నుంచి త‌ప్పుకోవ‌డానికి అనేక కార‌ణాలు వినిపించిన‌ప్ప‌టికీ అది స‌మ‌సిపోయింది. ఈ సంవ‌త్స‌రం ఐపీఎల్‌లో మ‌ళ్లీ అత‌ను చెన్నై జ‌ట్టుకు ఆడిన సంగ‌తి తెలిసిందే.

నేను కూడా బ్రాహ్మ‌ణుడినే అనుకుంటున్నా
తాజాగా తమిళనాడు ప్రిమియర్ లీగ్ క్రికెట్ టోర్నీకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సురేష్ రైనా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.  చెన్నైలో జరుగుతున్న ఈ టోర్నీకి అత‌ను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న స‌మ‌యంలో సహచర కామెంటేటర్ ఒకరు ఒక ప్ర‌శ్న‌ను సంధించారు. ధోతీ ధరించి, విజిల్ వేస్తూ.. నృత్యం చేస్తూ చెన్నై సంస్కృతిలో మీరు ఎలా కలిసిపోయారంటూ అడిగారు. దీనికి రైనా బదులిచ్చారు. ‘‘నేను కూడా బ్రాహ్మణుడినే అనుకుంటున్నాను. ఎందుకంటే 2004 నుంచి చెన్నై జట్టుకు ఆడుతున్నాను. నేను నా సహచరుల‌ను ఇష్ట‌ప‌డిన‌ట్లుగానే ఇక్కడి సంస్కృతిని కూడా బాగా ఇష్టపడతాను’’ అని బ‌దులిచ్చాడు. దీంతో ఒక్క‌సారిగా ఈ వ్యాఖ్య‌ల‌పై దుమారం రేగింది. చెన్నై అంటే బ్రాహ్మణులు మాత్ర‌మే ఉంటారా? ఇంకెవ‌రూ ఉండ‌రా?  బ్రాహ్మణులు మాత్రమే ధోతీ ధ‌రిస్తారా? సంప్రదాయబద్ధంగా ఉంటారా? చెన్నైకి ఆడుతూ ఇక్కడి సంస్కృతిని అర్థం చేసుకుంది ఇదేనా? అంటూ సురేష్‌రైనా మీద నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు.

అన‌వ‌స‌రంగా కులం గురించి మాట్లాడ‌టం ఎందుకు?
మ‌న‌కు అవ‌స‌రం లేనిచోట అన‌వ‌స‌రంగా కులం గురించి మాట్లాడ‌టం ఎందుక‌ని.. అలాగే బ్రాహ్మ‌ణుడిని అని చెప్పుకోవ‌డం కూడా ఎంత‌వ‌ర‌కు స‌రి అని మ‌రికొంద‌రు నిల‌దీస్తున్నారు. అయితే రైనా య‌థాలాపంగా చేసిన వ్యాఖ్య ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పెద్ద దుమార‌మే రేపింది. నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో రైనాను ల‌క్ష్యంగా ఎంచుకుంటున్నారు. వారికి ధీటుగా సురేష్‌రైనా అభిమానులు బ‌దులిస్తున్నారు. త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు త‌మ ప్రాంతీయ‌త‌కు, భాష‌కు ఎక్కువ ప్రాధాన్య‌మిస్తారు. అవ‌స‌ర‌మైతే అంద‌రూ క‌లిసి ఐక‌మ‌త్యంగా త‌మ హ‌క్కులు సాధించుకోవ‌డానికి పోరాటం చేస్తారు. ఇవ‌న్నీ తెలిసి కూడా ఎవ‌రూ మాట్లాడ‌ర‌ని, కాక‌పోతే రైనా య‌థాలాపంగా మాట్లాడివుంటారంటూ అభిమానులు స‌మ‌ర్థిస్తున్నారు.





సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా ఈ మధ్య తరచుగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్నారు. యూఏఈలో గ‌తేడాది జరిగిన ఐపీఎల్ నుంచి అర్ధంతరంగా తప్పుకుని రైనా భార‌త్‌కు తిరిగిరావ‌డం సంచ‌ల‌నం రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్ నుంచి త‌ప్పుకోవ‌డానికి అనేక కార‌ణాలు వినిపించిన‌ప్ప‌టికీ అది స‌మ‌సిపోయింది. ఈ సంవ‌త్స‌రం ఐపీఎల్‌లో మ‌ళ్లీ అత‌ను చెన్నై జ‌ట్టుకు ఆడిన సంగ‌తి తెలిసిందే.

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి నివాసం స‌మీపంలోని అమ‌రారెడ్డిన‌గ‌ర్ లో ఉంటున్న ఇళ్ల‌ను కొద్దిరోజులుగా అధికారులు కూల్చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ కూల్చివేత‌ల‌ను నిలిపేస్తూ తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అక్క‌డ నివ‌సించేవారు తాత్కాలిక నివాసాలు చూసుకోవ‌డానికి ఆగ‌స్టు ఆరోతేదీ వ‌ర‌కు స‌మ‌యం ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. వారంద‌రికీ తాత్కాలికంగా నివాసాలు క‌ల్పించే అంశాన్ని ప‌రిశీలించాల‌ని కోర్టు సూచించింది. ఆత్మ‌కూరులో వారికి ఇప్ప‌టికిప్పుడు ఇళ్లు నిర్మించి ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. అక్క‌డ 44 కుటుంబాలు నివాసం ఉంటున్నాయ‌ని, వారంద‌రికీ తాత్కాలిక నివాసం ఏర్పాటుచేస్తే ఇప్ప‌టికే ఖాళీచేసిన‌వారు కూడా వ‌చ్చి అడుగుతారంటూ ప్ర‌భుత్వ న్యాయ‌వాది సుమ‌న్ వాదించారు. దీంతో ఇరువ‌ర్గాల వాద‌న‌లు విన్న కోర్టు ఆగ‌స్టు ఆరోతేదీ వ‌ర‌కు స‌మ‌యం ఇచ్చింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నివాసం స‌మీపంలో కొన్ని సంవ‌త్స‌రాల నుంచి తాము నివ‌సిస్తున్నామ‌ని, మ‌మ్మ‌ల్ని బ‌ల‌వంతంగా ఖాళీ చేయిస్తున్నారంటూ బాధితులంతా వాపోతున్నారు.

జ‌గ‌న్‌కు షాకిచ్చిన హైకోర్టు?

క‌నీసం మీడియా స‌మావేశం నిర్వ‌హిద్దామ‌న్నా స్వేచ్ఛ లేకుండా పోతోంద‌ని ఆ పార్టీ నేత‌లు వాపోతున్నారు. అందుకే పార్టీని వీడి త‌మ‌కు ఎక్క‌డైతే స్వేచ్ఛ ఉంటుంద‌ని భావిస్తున్నారో ఆ పార్టీలోకి వ‌ల‌స‌పోతున్నారు. సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు భార‌తీయ జ‌న‌తాపార్టీని వీడి కారెక్కిన సంగ‌తి తెలిసిందే. మ‌రికొంద‌రు నేత‌లు కూడా అదే బాట‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. బోడ జ‌నార్ద‌న్‌, చాడ సురేష్‌రెడ్డి, పెద్దిరెడ్డి, విక్ర‌మ్‌గౌడ్ త‌దిత‌ర సీనియ‌ర్ నేత‌లు బీజేపీని వీడాల‌నే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరంద‌రినీ తెలంగాణ రాష్ట్ర‌స‌మితిలోకి ఆహ్వానించేలా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. గ‌తంలో ప‌లువురు నేత‌లు తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వ‌ల‌స వెళ్లారు. క‌నీసం గౌర‌వం ద‌క్కే సంగ‌తి దేవుడెరుగు.. త‌మ అనుభావాన్ని కూడా బీజేపీ నేత‌లు ఉప‌యోగించుకోవ‌డంలేద‌ని వీరంతా అసంతృప్తికి గుర‌వుతున్నారు. ఆ పార్టీ ఎదుగుద‌ల‌కు సాయం చేద్దామ‌నుకుంటుంటే త‌మ‌ను బంధించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వారినుంచి వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఈటెల రాజేంద‌ర్ చేరిక‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. వీరంతా దాదాపు టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఆ పార్టీలో స్వేచ్ఛ లేదు..? అందుకే..!!

భారీ బ‌డ్జెట్‌తో తీసే కొన్ని హాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఊహించ‌నిరీతిలో క్రేజ్ వస్తుంటుంది. స్థానికంగా ఉండే సూప‌ర్ హీరోల సినిమాల‌కు ధీటుగా అవి ధియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతుంటాయి. క‌లెక్ష‌న్లు కూడా దుమ్మురేపేలా ఉంటాయి. రెండు సంవ‌త్స‌రాల కింద‌ట ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ మ‌న‌దేశంలో ఎంత కొల్ల‌గొట్టిందో అంద‌రికీ తెలిసిందే. దీని తర్వాత అంత క్రేజ్ సంపాదించుకున్న హాలీవుడ్ మూవీ ఏదంటే.. ‘గాడ్జిల్లా వెర్సస్ కాంగ్’.

అమెజాన్ ప్రైమ్‌లో మీరు ఊహించ‌ని సినిమా?

కొలంబో : టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా. కొలంబో వేదికగా శ్రీలంక, భారత్‌ ల మధ్య మూడో వన్డే.

భారతదేశంలో టీకాలు తీసుకున్న త‌ర్వాత న‌మోద‌వుతున్న ప్ర‌తికూల సంఘ‌ట‌న‌ల‌కు కార‌ణం ఆందోళ‌న అని ప్ర‌భుత్వ నివేదిక ఒక‌టి వెల్ల‌డించింది. టీకా తీసుకున్న త‌ర్వాత వ‌స్తున్న దుష్ప‌రిణామాల‌పై అధ్య‌య‌నం చేసేందుకు ప్ర‌భుత్వం ఒక క‌మిటీని నియ‌మించింది. 88 కేసుల‌ను అధ్య‌య‌నం చేసిన ఈ క‌మిటీ అందుకు కార‌ణాలేంట‌నే విష‌యాన్ని వెల్ల‌డించాయి. టీకా తీసుకునేట‌ప్పుడు సూది అంటే ఉండే భ‌యంవ‌ల్ల పురుషుల‌కంటే మ‌హిళ‌లే ఎక్కువ ఆందోళ‌న‌కు గుర‌వుతున్న‌ట్లు తేలింది. మొత్తం 88 కేసుల్లో 22 కేసులు ఆందోళ‌న‌కు సంబంధించిన‌వేన‌ని, ఈ 22లో 16 కేసులు కొవిషీల్డ్‌ టీకాలు తీసుకున్న త‌ర్వాత అని, మిగిలిన‌వి కొవాగ్జిన్ తీసుకున్న త‌ర్వాత త‌లెత్తిన‌వ‌ని క‌మిటీ నివేదించింది. ఇవ‌న్నీ ఆందోళ‌న‌కు సంబంధించిన‌వేన‌ని, టీకా తీసుకుంటే శారీర‌క రుగ్మ‌త క‌లుగుతుంద‌ని, కండ‌రాలు బ‌ల‌హీన‌ప‌డ‌తాయ‌ని, లేదంటే ఇంకేదైనా స‌మ‌స్య‌లు వ‌స్తాయేమోన‌నే మాన‌సిక ఆందోళ‌నే వారిని బ‌ల‌హీన‌ప‌రిచింద‌ని, అలాగే టీకా తీసుకున్న త‌ర్వాత బ‌ల‌హీనంగా మారతారంటూ వ‌స్తున్న పుకార్లు కూడా వీరిలో ఆందోళ‌న రేకెత్తించ‌డానికి కార‌ణ‌మ‌య్యాయ‌ని క‌మిటీ నివేదించింది.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>