PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/petrorates-c68b3d2b-a8c8-4f8f-881f-0d0bb2a2062d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/petrorates-c68b3d2b-a8c8-4f8f-881f-0d0bb2a2062d-415x250-IndiaHerald.jpgబండి ఆగిపోయింది పెట్రోల్ ధ‌ర‌లు మండిపోతున్నాయి..ఎగ‌సే జ్వాలలు కారణంగా ప‌నులున్నా చేయ‌లేని నిరుద్యోగులు .. ప‌ని ఉన్నా భారం త‌ప్ప‌ని స‌గ‌టు జీవులుఎంద‌రో .. సామాన్యుడికి భారం అని చెప్ప‌డం చిన్న‌మాట..ప్ర‌జ‌ల‌పై పాల‌కుల‌కు ఉన్న ప్రేమ ఇది అని చెప్ప‌డం వ్యంగ్య‌మ‌యిన మాట..వ్యంగ్య‌మ‌యినా ఇదే వాస్త‌వం..సామాన్యులంతా రోడ్డెక్క‌లేరు..సామాన్యులంతా ధ‌ర్నాలం టూ గొంతెత్త‌లేరు.. ఇదే అద‌ను.. కానీ ఇప్పుడు పెట్రో డీజిల్ ధ‌రల కార‌ణంగా ఈ భారాల‌ను మోయ‌లేక నిత్యావ‌స‌ర ధ‌ర‌లు త‌ట్టుకో లేక స‌త‌మతం అవుతున్న తీరే బాధాక‌రం.petrorates {#}un employment;Diesel;Petrol;prema;Bike;Love;Teluguపెట్రో ... టాక్ : ప్ర‌తి చుక్కా భార‌మేపెట్రో ... టాక్ : ప్ర‌తి చుక్కా భార‌మేpetrorates {#}un employment;Diesel;Petrol;prema;Bike;Love;TeluguFri, 23 Jul 2021 09:19:17 GMT
మోడీ దేశాన్ని ప్ర‌గ‌తి ప‌థంలో న‌డిపించిన తీరుకో సంకేతం ఇది..లేదా మోడీ తో స‌హా  తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు న‌డిపి స్తున్న తీరు ఇది..మూడేళ్ల కింద‌ట  ధ‌ర‌తో పోలిస్తే ఇప్ప‌టి ధ‌ర‌ను ఊహించ‌లేం..కానీ అదే ఇప్పుడు అస‌లు వివాదం. 2018 జ‌న‌వ‌రి నాటికి 74 రూపాయ‌లు..ఉన్న పెట్రోలు ధ‌ర ఇప్పుడు 100 దాటి 108 రూపాయ‌ల వ‌ర‌కూ ప‌లుకుతోంది. దేశాన్ని ప్రగ‌తి ప‌థంలో న‌డిపిస్తున్నాం అని చెప్పుకునే వారంతా శ్రామికుల క‌ష్టాన్ని దోచుకు తింటున్న వారే! వారి ఆర్థిక మూలాల ఆన‌వాళ్లు కూడా లేకుండా చేస్తున్న వారే! కానీ భార‌త్ వెలిగి పోతుంది అని చెప్తారే! అది ఈ పాల‌కుల‌కే సాధ్యం. సామాన్య స్థితిగ‌తులు అన్న‌వి వీరికి ప‌ట్ట‌న‌ప్పుడు దేశాన్ని ఎలా ప్ర‌గ‌తి పథంలోకి తీసుకుపోతార‌న్న‌ది సిస‌లు ప్ర‌శ్న.

బండి ఆగిపోయింది పెట్రోల్ ధ‌ర‌లు మండిపోతున్నాయి..ఎగ‌సే జ్వాలలు  కారణంగా ప‌నులున్నా చేయ‌లేని నిరుద్యోగులు .. ప‌ని ఉన్నా భారం త‌ప్ప‌ని స‌గ‌టు జీవులుఎంద‌రో .. సామాన్యుడికి భారం అని చెప్ప‌డం చిన్న‌మాట..ప్ర‌జ‌ల‌పై పాల‌కుల‌కు ఉన్న ప్రేమ ఇది అని చెప్ప‌డం వ్యంగ్య‌మ‌యిన మాట..వ్యంగ్య‌మ‌యినా ఇదే వాస్త‌వం..సామాన్యులంతా రోడ్డెక్క‌లేరు..సామాన్యులంతా ధ‌ర్నాలం టూ గొంతెత్త‌లేరు.. ఇదే అద‌ను.. కానీ ఇప్పుడు పెట్రో డీజిల్ ధ‌రల కార‌ణంగా ఈ భారాల‌ను మోయ‌లేక నిత్యావ‌స‌ర ధ‌ర‌లు త‌ట్టుకో లేక స‌త‌మతం అవుతున్న తీరే బాధాక‌రం. దేశాన్ని న‌డ‌ప‌డం అంటే ధ‌ర‌లు పెంచి అభివృద్ధి చూప‌డం అని అనుకోవ‌డంలో ఉన్నంత అవివేకం మ‌రొక‌టి లేదు. రైతు శ్రామిక వ‌ర్గాలు ఇవాళ త‌మ క‌ష్టం తీర్చుకోలేక పొందుతున్న అవ‌స్థ‌లు వ‌ర్ణ‌నాతీతంగా ఉన్నాయి. కానీ పాల‌కులు ఇదంతా అభివృద్ధి కోసమే అని చెబుతున్నారు. వాస్త‌వానికి 2018 లో డీజిల్ ద‌ర‌లు కూడా పెద్ద‌గా ఆందోళ‌న‌క‌ర రీతిలో లేవు.. ఆనాడు 66 రూపాయ‌లున్న లీట‌రు డీజిల్ ధ‌ర ఇప్పుడు 99 కి చేరిపోయింది. ఒక సాధార‌ణ  ఉద్యోగి రోజుకు అర లీట‌రు కొట్టించాడే అనుకుందాం నెల‌కు ఆయ‌న బైక్ ఎల‌వెన్స్ 1650 రూపాయ‌లు అయ్యే అవ‌కాశం ఉంది. అది ఓ చిన్న ప‌ట్ట‌ణంలో ఉన్న ఉద్యోగికి సంబంధించి ఉన్న ఖ‌ర్చు..ఇంటి ఖ‌ర్చులు అద్దె రూపేణ చెల్లించాల్సింది  4000 అనుకుంటే ... ఇప్పుడాయ‌న జీతం 9000లో ఎవ్వ‌రికి ఎంత ఇచ్చి ఎంత అప్పు  చేసి ఈ భారాన్ని దింపుకోవాలో తోచ‌ని స్థితి. క‌రోనా కార‌ణంగా అర జీతం మాత్ర‌మే చెల్లిస్తున్న నేప‌థ్యంలో ధ‌రలు రెట్టింపు అయిన నేప‌థ్యంలో ఇప్పుడీ స‌గటు జీవి భారం తీరేదెలా?






చిరంజీవితో నటించడానికి శ్రీదేవి ఇన్ని కండిషన్స్ పెట్టిందా..!

అప్పటి ఎదులపురమే.. ఇప్పటి హుజురాబాద్..!

ప్రమాదంలో రకుల్ కాపాడండి అంటూ అరుపులు..!

అర్ధరాత్రి 2 వరకూ ఆ డైరెక్టర్ ఏం చేసేవాడో తెలుసా ?

ఆకట్టుకుంటున్న హీరో మాస్ట్రో ఎడ్జ్ 125..

టీవీ : బిగ్ బాస్ షో ని వదలని ప్రేమజంటలు..

రాముడే గెలిచాడు : తెలుగు యువ‌తకు ద‌ళ‌ప‌తి అత‌డే...

మరో రికార్డ్ బద్దలు కొట్టిన మహేష్ సినిమా.. 2020 లో టాప్ ఇదే..?

బీజేపీ బీజియ‌మ్ : పోల‌వ‌రంపై ప్రేమ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>