PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayalaseemaeedcf050-52b6-44dc-af60-509ee7ef70f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayalaseemaeedcf050-52b6-44dc-af60-509ee7ef70f8-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో బంధువులు ఉండటం మామూలే.. అందులోనూ కొందరు ఒక పార్టీలో ఉంటే.. ఇంకొకరు ఇంకో పార్టీలో ఉన్న సందర్భాలు కూడా ఉంటాయి. అయితే.. ఇలాంటి వారు ఒకరిని ఒకరు విమర్శించుకోవడం మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు ఏపీలో అలాంటి రాజకీయమే నడుస్తోంది. రాయలసీమలో మైసూరారెడ్డి పేరున్న నాయకుడే.. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ క్రియాశీలకంగా లేడు కానీ.. సీమ తరపున వాయిస్ వినిపిస్తున్నారు. తాజాగా కేంద్రం ఇచ్చిన నదీ జలాల గెజిట్‌ ను ఆయన తప్పుబట్టారు. మాజీ మంత్రి మైసూరారెడ్డి చాలా రోజుల తర్వాత ఈ అంశంపై మీడియాతో మాట్లాడrayalaseema{#}sudigali sudheer;Srisailam;MLA;Bojjala Venkata Sudhir Reddy;CBN;Father;Telugu Desam Party;Jagan;Hanu Raghavapudi;Reddy;Party;prema;YCP;Minister;Rayalaseema;Love;Telanganaబాబాయ్ విమర్శలపై.. అబ్బాయ్‌ నిప్పులు..?బాబాయ్ విమర్శలపై.. అబ్బాయ్‌ నిప్పులు..?rayalaseema{#}sudigali sudheer;Srisailam;MLA;Bojjala Venkata Sudhir Reddy;CBN;Father;Telugu Desam Party;Jagan;Hanu Raghavapudi;Reddy;Party;prema;YCP;Minister;Rayalaseema;Love;TelanganaFri, 23 Jul 2021 10:15:00 GMTరాజకీయాల్లో బంధువులు ఉండటం మామూలే.. అందులోనూ కొందరు ఒక పార్టీలో ఉంటే.. ఇంకొకరు ఇంకో పార్టీలో ఉన్న సందర్భాలు కూడా ఉంటాయి. అయితే.. ఇలాంటి వారు ఒకరిని ఒకరు విమర్శించుకోవడం మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు ఏపీలో అలాంటి రాజకీయమే నడుస్తోంది. రాయలసీమలో మైసూరారెడ్డి పేరున్న నాయకుడే.. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ క్రియాశీలకంగా లేడు కానీ.. సీమ తరపున వాయిస్ వినిపిస్తున్నారు. తాజాగా కేంద్రం ఇచ్చిన నదీ జలాల గెజిట్‌ ను ఆయన తప్పుబట్టారు.  


మాజీ మంత్రి మైసూరారెడ్డి చాలా రోజుల తర్వాత ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. జగన్ వైఖరితో రాయలసీమ నష్టపోతోందన్నారు. అయితే.. మైసూరా చేసిన విమర్శలపై ఆయనకు కుమారుడి వరస అయ్యే జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందించారు. బాబాయ్ కామెంట్లకు  కౌంటర్ ఇచ్చారు. సుధీర్ రెడ్డి  మైసూరా సోదరుడి కుమారుడు. ఆయన గత ఎన్నికలలో వైసీపీ తరపున గెలిచారు. అందుకే పార్టీ తరపున గట్టిగా మాట్లాడారు.


తండ్రి వరసయ్యే మైసూరాపై గట్టిగానే విమర్శలు చేశారు.  తెలుగుదేశం హయాంలో తెలంగాణ ప్రభుత్వం నదీ జలాలను తరలించుకుపోతుంటే మైసూరారెడ్డి ఏం చేశారు.. అప్పుడు నిద్రపోయారా అని సుధీర్ ప్రశ్నించారు. 2014–19 మధ్య శ్రీశైలం జలాశయం వద్ద 800 అడుగుల్లోపే నీటిమట్టం ఉన్నప్పుడు కూడా తెలంగాణ కృష్ణా జలాలను తరలించేందుకు శ్రీకారం చుట్టిందని సుధీర్ రెడ్డి గుర్తు చేశారు. ఆ విషయంపై చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మైసూరారెడ్డి ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. అప్పుడు  రాయలసీమపై ఆయనకున్న ప్రేమ ఏమైందన్నారు.


అంతే కాదు.. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు.. అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయారని సుధీర్ రెడ్డి గుర్తు చేశారు. సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని.. ప్రత్యేకించి రాయలసీమ ప్రయోజనాలను గాలికొదిలేశారన్నారు. అప్పుడు నోరెత్తని మైసూరా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై నోటికొచ్చినట్టు మాట్లాడటం విడ్డూరంగా ఉందని సుధీర్ రెడ్డి మండిపడ్డారు. అంతే కాదు.. రాయలసీమకు అన్యాయం చేసిన చంద్రబాబును 2019 ఎన్నికలకు ముందు మైసూరా ఎందుకు కలిశారో, ఏం మంతనాలు జరిపారో అందరికీ తెలుసన్నారు.





మాజీ మంత్రి మైసూరారెడ్డి చాలా రోజుల తర్వాత ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. జగన్ వైఖరితో రాయలసీమ నష్టపోతోందన్నారు. అయితే.. మైసూరా చేసిన విమర్శలపై ఆయనకు కుమారుడి వరస అయ్యే జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందించారు. బాబాయ్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు.

మోడీ..."గాడి"నడిపేది ఎలా..?

19 రాష్ట్రాల్లో పెట్రోల్@100.. మీరు ఎంత టాక్స్ కడుతున్నారో తెలుసుకోండి ఇక్కడ..?

చిరంజీవితో నటించడానికి శ్రీదేవి ఇన్ని కండిషన్స్ పెట్టిందా..!

నిరుద్యోగుల కోసం.. జగన్ కొత్త స్కీమ్?

బీజేపీ, జనసేన.. ఎడబాటు ఖాయమేనా..?

పెట్రో ... టాక్ : ప్ర‌తి చుక్కా భార‌మే

అప్పటి ఎదులపురమే.. ఇప్పటి హుజురాబాద్..!

కొత్త పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముహూర్తం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>