MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/e-v-v-satyanarayana-hard-workb21a7a70-ed34-4bca-b30c-f9720e02b9b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/e-v-v-satyanarayana-hard-workb21a7a70-ed34-4bca-b30c-f9720e02b9b7-415x250-IndiaHerald.jpgఈ వి వి సత్యనారాయణ తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప దర్శకుడు మరియు నిర్మాత. ఈయన్ని అందరూ పని రాక్షసుడు అని పిలిచేవారు. ఇందుకు కారణం లేకపోలేదు నిజంగానే ఈయనకు పనంటే ప్రాణం అనుకున్న సమయానికి అనుకున్న పని జరిగిపోవాలి లేదంటే అసలు నిద్రపోడు, ఎవరినీ నిద్ర పోనివ్వడుE V V SATYANARAYANA HARD WORK{#}aryan;Rakshasudu;Darsakudu;Tollywood;V;Allari;Director;Cinema;Teluguఅర్ధరాత్రి 2 వరకూ ఆ డైరెక్టర్ ఏం చేసేవాడో తెలుసా ?అర్ధరాత్రి 2 వరకూ ఆ డైరెక్టర్ ఏం చేసేవాడో తెలుసా ?E V V SATYANARAYANA HARD WORK{#}aryan;Rakshasudu;Darsakudu;Tollywood;V;Allari;Director;Cinema;TeluguFri, 23 Jul 2021 09:00:00 GMTవి వి సత్యనారాయణ తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప దర్శకుడు మరియు నిర్మాత. ఈయన్ని అందరూ పని రాక్షసుడు అని పిలిచేవారు. ఇందుకు కారణం లేకపోలేదు నిజంగానే ఈయనకు పనంటే ప్రాణం అనుకున్న సమయానికి అనుకున్న పని జరిగిపోవాలి లేదంటే అసలు నిద్రపోడు, ఎవరినీ నిద్ర పోనివ్వడు. అందుకే ఈయనను పని రాక్షడుడు అని పిలుచుకునే వారు. ఈయన ఒక శ్రమజీవి, సినీ ఇండస్ట్రీలో వందలమందికి పని కల్పించి వారికి జీవితాన్ని అందించిన మహనీయుడు. ఈవీవీ అంటే టాలీవుడ్ లో ఒక బ్రాండ్. ఈయన ఏమి చేసినా అందులో ఏదో ఒక అంతరార్థం  ఉంటుంది. ఈయన సినిమా అంటే తాను ఎంచుకున్న వృత్తి. అందుకే తన వృత్తి ని తాను సక్రమంగా చేయాలని ఏనాడూ వృత్తి ధర్మాన్ని తప్పకూడదని అనుకునేవారు. 

అందుకే అనుకున్న వర్క్ పూర్తి చేయడానికి అర్థరాత్రి రెండు వరకు మేల్కొనే వారు. పూర్తి కానిదే అప్పటికైనా నిద్రపోయే వారు కాదు. రాత్రి రెండు దాకా స్క్రిప్ట్ ను రాయడానికి సమయాన్ని కేటాయించే వారు. తను రాయడమే కాకుండా తాను చేసే ప్రతి చిత్రానికి నాలుగురు రైటర్లను పెట్టుకునే వారు. ఎందుకంటే అది ఆయన స్క్రిప్ట్ కి ఇచ్చే ప్రాముఖ్యత. నలుగురి రైటర్ల దగ్గర అనుకున్న సమయానికి స్క్రిప్ట్ రాయించి చివరికి ప్రేక్షకుడి పాత్రలో నిలబడి ఎవరిది బాగుందో చూసుకొని ఎంచుకునే వారు. అలాగే ఆ నలుగురు రైటర్లకు మంచి పారితోషకం ఇచ్చి పంపేవారు. అందుకే ఈవీవీ రమ్మన్నారు అంటే రైటర్లు పరుగులు తీస్తారు.  అలా స్క్రిప్ట్ తీసుకోవడం ఆలస్యం ఇలా సినిమా అయిపోయేది. అంత పక్కాగా కథను సిద్దం చేసుకుంటారు. స్క్రిప్ట్ రెడీ అవడం మొదలు తిండి...నిద్రలు మానేసి సీన్ ను ఫిక్స్ చేసుకుని రంగంలోకి దిగిపోతారు. ఈయన ఎంతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయినప్పటికీ ఒక చిన్న నూతన దర్శకుడిగా ప్రతి సినిమాకీ శ్రమించేవారు.

అందుకే ఆయనకు ఇండస్ట్రీలో అంత ప్రత్యేకమైన స్థానం. ఒకసారి మైక్ పట్టుకుని యాక్షన్ అని స్టార్ట్ చేశారంటే ఇక సమయాన్నే మరచిపోతారు ఎన్నో సార్లు అర్థ రాత్రి దాటిన తర్వాత ప్యాకప్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అప్పటికి అది కష్టం అనిపించినా, సినిమా రిలీజ్ అయ్యాక ఆ కష్టాన్నంతా ఆనందంగా మరచిపోయే వారు టీమ్ మెంబర్స్. ఆరోజు ఆయన అలా చేయబట్టే ఈరోజు ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చిందంటూ ఈవీవీ ని కొనియాడేవారట. ఆయనకు శిష్యులుగా మారిపోయేవారట. ఇలా టాలీవుడ్ లో ఆయనకు ఎంతో శ్రమజీవి అని పేరుంది. ఈయన కుమారులు అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ లు కూడా అదే శ్రమను నమ్ముకుని, తండ్రిని ఆదర్శంగా తీసుకొని జీవించడం నిజంగా ఎంతో గొప్పతనం.



అప్పటి ఎదులపురమే.. ఇప్పటి హుజురాబాద్..!

ప్రమాదంలో రకుల్ కాపాడండి అంటూ అరుపులు..!

నగ్న చిత్రాలు షేర్ చేసిన హీరోయిన్.. అవి చూస్తే..?

ఆర్ ఆర్ ఆర్ వేస్ట్ కంటెంట్ తో బిజినెస్ చేస్తున్న రాజమౌళి !

బన్నీ ని వదలని భార్య భర్తలు..?

'కలియుగం' అంతం ఎప్పుడో తెలుసా ?

స్మరణ : పొట్టి రాంబాబు జీవిత విశేషాలు..

రాముడే గెలిచాడు : తెలుగు యువ‌తకు ద‌ళ‌ప‌తి అత‌డే...

శ్రీకాంత్ అడ్డాల మరో క్రేజీ మల్టీస్టారర్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>