MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shipa-settyec692b90-cd1d-4b74-a3bd-5f21208d86aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shipa-settyec692b90-cd1d-4b74-a3bd-5f21208d86aa-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, బ్రిటిష్ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల చిత్రీకరణ విషయంలో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. జూలై 19న రాజ్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. పోర్న్ ప్రొడక్షన్ కేసులో అతను కీలక నిందితుడు అని పోలీసులు ఆరోపించారు. రాజ్‌ను మంగళవారం కోర్టుకు హాజరుపరిచారు. ఇప్పుడు జూలై 23 వరకు పోలీసు కస్టడీకి పంపారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. కాగా ఇప్పుడు శిల్పా-రాజ్ ల ఆస్తులు తదితర విషయాలపై ఆసక్తి నెలకొంది. శిల్పా, రాజ్ మొత్తం ఆస్తుల విలువ మిమ్మల్ని తప్పకుండా షRaj kundra and Shilpa Shetty;{#}Episode;Reality Show;tuesday;shilpa;Shilpa Shetty;Mumbai;Arrest;police;raj;Silver;Heroine;Rajasthanరాజ్ కుంద్రా-శిల్పాశెట్టి ఆస్తుల విలువ తెలిస్తే షాకే...!!!రాజ్ కుంద్రా-శిల్పాశెట్టి ఆస్తుల విలువ తెలిస్తే షాకే...!!!Raj kundra and Shilpa Shetty;{#}Episode;Reality Show;tuesday;shilpa;Shilpa Shetty;Mumbai;Arrest;police;raj;Silver;Heroine;RajasthanFri, 23 Jul 2021 11:00:00 GMTబాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, బ్రిటిష్ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల చిత్రీకరణ విషయంలో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. జూలై 19న రాజ్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. పోర్న్ ప్రొడక్షన్ కేసులో అతను కీలక నిందితుడు అని పోలీసులు ఆరోపించారు. రాజ్‌ను మంగళవారం కోర్టుకు హాజరుపరిచారు. ఇప్పుడు జూలై 23 వరకు పోలీసు కస్టడీకి పంపారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. కాగా ఇప్పుడు శిల్పా-రాజ్ ల ఆస్తులు తదితర విషయాలపై ఆసక్తి నెలకొంది. శిల్పా, రాజ్ మొత్తం ఆస్తుల విలువ మిమ్మల్ని తప్పకుండా షాక్‌కు గురి చేస్తుంది! గ్రూప్కో డెవలపర్స్, టిఎంటి గ్లోబల్, వివాన్ ఇండస్ట్రీస్, జెఎల్ స్ట్రీమ్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి మరెన్నో విజయవంతమైన వ్యాపార సంస్థలను రాజ్ నిర్వహిస్తున్నాడు. ఈ జంట ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ సహ భాగస్వాములు. నివేదికల ప్రకారం రాజ్ మొత్తం ఆస్తుల విలువ సుమారు 350 మిలియన్ డాలర్లు. అంటే సుమారు 2600 కోట్ల రూపాయలు అన్నమాట. అతను ప్రతి సంవత్సరం సుమారు 120 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు.

బాలీవుడ్ నటి శిల్పా విషయానికొస్తే  ఆమె రూ.134 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం శిల్పా డాన్స్ రియాలిటీ షో - 'సూపర్ డాన్సర్ చాప్టర్ 4' కు జడ్జిగా వ్యవహరిస్తోంది. రాజ్ కేసు విషయమై తాజా ఎపిసోడ్ లో హీరోయిన్ మలైకా అరోరా కన్పించింది. అది పూర్తిగా వేరే విషయం అనుకోండి. ఇక ఈ అందమైన నటి బ్రాండ్ ఎండార్స్‌మెంట్, సినిమాల ద్వారా భారీగానే డబ్బు సంపాదిస్తుంది. నివేదికల ప్రకారం ఆమె ఒక సినిమాకు 1 నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం ఈ నటి సుమారు 1 నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అంతేకాక శిల్పాకు దేశవ్యాప్తంగా అనేక ఆస్తులు ఉన్నాయి. శిల్పా, రాజ్ దంపతులకు ముంబైలోని జుహులో విశాలమైన, విలాసవంతమైన 'కినారా' అనే విల్లా ఉంది. కాగా శిల్పాశెట్టి ప్రస్తుతం "హంగమా 2" చిత్రంతో తిరిగి వెండి తెరపై మెరవడానికి సిద్ధంగా ఉంది.



సిల్క్ స్మిత సంస్కారం పై బాలయ్య కామెంట్స్ !

ఈ నాలుగు భాషల రీమేక్ సినిమా ఎన్నాళ్ళు చేస్తారు?

సూర్య నటించిన టాప్ 8 తెలుగు సినిమాలు ఇవే..!

సచిన్ జోషి పోరాటం ఫలించిందా. ? అందుకే రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యాడా ?

తెల్లదొరకు గర్జించే సింహస్వప్నం చంద్రశేఖర్ ఆజాద్..!

కూలిన శిథిలాలపై రాజకీయ పునాదులు!

మరోసారి కలిసి నటించనున్న తండ్రీ కూతుళ్ళు..!

రాజ్ కుంద్రా కేసు : మొదటి స్టేట్మెంట్ ఈ హీరోయిన్ దేనట... !

19 రాష్ట్రాల్లో పెట్రోల్@100.. మీరు ఎంత టాక్స్ కడుతున్నారో తెలుసుకోండి ఇక్కడ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>