BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/who-is-the-reason-for-petrol-desil-rates-hikeb235dddf-a8bc-4a07-bee0-0cd83eeaf529-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/who-is-the-reason-for-petrol-desil-rates-hikeb235dddf-a8bc-4a07-bee0-0cd83eeaf529-415x250-IndiaHerald.jpgమన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. పెట్రోల్ ధరల తో పాటు డీజిల్ ధరలు కూడా సెంచరీ దాటేశాయి. ధరలు పెరగటంతో మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. పెరిగిన ధరలను అదుపు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ పెరిగిన ధరలను తగ్గించే ప్రయత్నం చేయకుండా ఈ దుస్థితికి కారణం గత ప్రభుత్వాలే అని ఆరోపిస్తోంది. ప్రధాని మోడీ తమిళ నాడు చమురు గ్యాస్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ఏర్పాటు చేసిన వర్చువల్ కార్యక్రమంలో మాట్లPetrol-diesel{#}Manmohan Singh;Prime Minister;Petrol;Diesel;central government;vehicles;Tamil;India;Manamపెట్రోల్ మంటకు గత ప్రభుత్వాలే కారణమా.. ?పెట్రోల్ మంటకు గత ప్రభుత్వాలే కారణమా.. ?Petrol-diesel{#}Manmohan Singh;Prime Minister;Petrol;Diesel;central government;vehicles;Tamil;India;ManamFri, 23 Jul 2021 13:19:00 GMTమన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. పెట్రోల్ ధరల తో పాటు డీజిల్ ధరలు కూడా సెంచరీ దాటేశాయి. ధరలు పెరగటంతో మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. పెరిగిన ధరలను అదుపు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ పెరిగిన ధరలను తగ్గించే ప్రయత్నం చేయకుండా ఈ దుస్థితికి కారణం గత ప్రభుత్వాలే అని ఆరోపిస్తోంది.

ప్రధాని మోడీ తమిళ నాడు చమురు గ్యాస్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ఏర్పాటు చేసిన వర్చువల్ కార్యక్రమంలో మాట్లాడుతూ... గత ప్రభుత్వాల వైఫల్యం వల్లే ఇలా ధరలు పెరిగాయని వ్యాఖ్యానించారు. భారత్ లాంటి దేశం ఇంధన దిగుమతులపై ఆధారపడలా అని అని ప్రశ్నించారు. తాను ఎవరినీ విమర్శించడం లేదని కానీ మనం ఈ అంశంపై దృష్టి పెట్టి ఉంటే మధ్యతరగతి ప్రజలు భారాన్ని మోయాల్సి వచ్చేది కాదని అన్నారు. అయితే దేశంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడేళ్ళు అవుతోంది. చమురు ఉత్పత్తిని పెంచాలంటే ఆరేళ్ల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

కానీ ఇప్పటివరకు దేశంలో లో  ఆ దిశగా అడుగులు వేయలేదంటున్నారు. మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు అధికంగా పన్నులు వేయడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. 2013 వరకు పెట్రోల్ పై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు దాని అసలు ధరలో 44 శాతం వరకు పన్నులను విదించేవి...కానీ అది ఇప్పుడు 100 నుండి 110 శాతం వరకు పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సమయంలో అంతర్జాతీయంగా చమురు బ్యారెల్ ధర 120 కానీ ఇప్పుడు అది 60కి పడిపోయింది. కానీ పెట్రోల్ ధర మాత్రం అమాంతం వందకు చేరుకుంది. కాబట్టి ప్రస్తుతం పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరగడానికి గత ప్రభుత్వాలు కారణం అని ఎలా చెబుతారాన్న ప్రశ్న వస్తోంది.

కేవలం ప్రభుత్వ ఖజనా పెంచుకోవడానికి మోడీ సర్కార్ ప్రజలపై భారం వేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా పెట్రోల్, డీజిల్ పై ధరలు పెంచినా వాడకాన్ని తగ్గించలేరు కాబట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కచ్చితంగా వచ్చి తీరుతుంది. కానీ కేంద్రం ఆదాయం కోసం చూసుకుంటే పేద, మధ్య తరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే వాహనాలు వాడుతున్న వారిపైనే ప్రభావం పడకుండా... రవాణా చార్జీలు పెరుగుతాయి దాంతో నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతారు కాబట్టి పేదవాడు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ పెట్రోల్ డీజిల్ ధరల ప్రభావం ఉన్నొడి పై పెద్దగా ఉండదు. కాబట్టి ధరలు తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేయాలని ప్రజలు భావిస్తున్నారు.



కట్నంగా అవి అడిగిన వరుడు.. చివరికి..?

ప‌దుల సంఖ్య‌లో పెళ్లిళ్లు, 80 మంది సంతానం.. ఆ రాజుగారి కామక్రీడలు చూస్తే షాక్‌..!

బుల్లి పిట్ట : ఈ కారుకు ఒకసారి ఛార్జ్ చేస్తే చాలు..600 km ప్రయాణం..

ఈ విల‌న్ల‌కు స్టార్ హీరోల‌ను మించిన క్రేజ్ ఎందుకు ?

హుజూరాబాద్ ప్రచారానికి షా ని రమ్మంటున్న ఈటెల...?

ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విలువ ఎంతో తెలిస్తే..?

సౌత్ సినిమా పై సూర్య ముద్ర.. అందుకే భారీ క్రేజ్!!

వారిపై పెగాసస్ టార్గెట్..?

కరివేపాకుతో చికెన్ కర్రీ ఎప్పుడన్నా ట్రై చేశారా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>