PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_tvnews/pregnant-5019628b-3015-45e4-96c8-ac19d5ce6b60-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_tvnews/pregnant-5019628b-3015-45e4-96c8-ac19d5ce6b60-415x250-IndiaHerald.jpgమూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వ‌ర్షానికి వాగులు వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఎక్క‌డ చూసినా జ‌ల‌మ‌యం అయిపోయింది. రోడ్లు, బ్రిడ్జీలు కొట్ట‌కుపోవ‌డంతో రాక పోక‌ల‌కు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. ఇక మారుమూల గ్రామాల ప్ర‌జ‌ల గురించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు.. మాములు రోజుల్లోనే వారికి స‌రైన ర‌వాణా స‌దుపాయ‌లు ఉండ‌వు, రోడ్లు స‌రిగ్గా ఉండ‌వు.. అలాంటిది ఇంత భారీ వ‌ర్షాల‌తో వారి ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. ఇదే క్ర‌మంలో ఓ గ‌ర్భిణీకి పురిటినోప్పులు వ‌చ్చాయి.. ఆసుప‌త్రులేమో ఆమ‌డ దూరం.. ర‌వాణా వpregnant{#}Adilabad;Pregnant;thursday;mandalam;Smart phoneఅయ్యో ఆ త‌ల్లికి ఎంత క‌ష్టమొచ్చింది..! ఎండ్ల బండిపై గ‌ర్భిణీ..అయ్యో ఆ త‌ల్లికి ఎంత క‌ష్టమొచ్చింది..! ఎండ్ల బండిపై గ‌ర్భిణీ..pregnant{#}Adilabad;Pregnant;thursday;mandalam;Smart phoneFri, 23 Jul 2021 07:56:00 GMT
ఇదే క్ర‌మంలో ఓ గ‌ర్భిణీకి పురిటినోప్పులు వ‌చ్చాయి.. ఆసుప‌త్రులేమో ఆమ‌డ దూరం.. ర‌వాణా వ‌స‌తి స‌రిగ్గాలేదు అందులో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షం..ఆమె వెళ్తున్న ఆటో వ‌ర‌దలో చిక్కుకుపోయింది. ఇక ఎడ్డ బండే శ‌ర‌ణ్య‌మ‌యింది.

  ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలం రాజుల తండా గ్రామానికి చెందిన ఓ గ‌ర్భిణీ వ‌ర్షాల‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంది. గ్రామానికి చెందిన గర్భిణీ అనితకు గురువారం మధ్యాహ్నం సమయంలో పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించాలి. ఆస్ప‌త్రి ఏమో నేరడిగొండ మండల కేంద్రంలో ఉంది. అస‌లే అంతంత‌గానే ఉన్న దారి అందులో భారీ వ‌ర్షం..పోంగుతున్న వాగులు అయినా గ‌ర్భ‌ణీని ఆసుప‌త్రికి తీసుకెళ్లేందుకు దిక్కుతోచ‌ని ప‌రిస్థితి.

    గ‌ర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఎడ్ల బండిని సిద్దం చేశారు. కానీ మ‌ధ్య‌లో వాగు ఉండ‌డంతో ఎండ‌బండిపై వాగు దాట‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌ని భావించి  తెలిసిన వారి ఆటోను సంప్ర‌దించారు. వెంట‌నే వ‌చ్చిన ఆటోలో వాగును దాటేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ వ‌ర‌ద ప్ర‌వాహానికి ఆటో గ‌ల్లంత‌యింది. అతి క‌ష్టం మీద ఆటోను ఒడ్డుకు చేర్చిన స్థానికులు.. అదే విధంగా గ‌ర్భిణీని కూడా ఒడ్డుకు చేర్చారు. అంత‌కు ముందే  108కు ఫోన్ చేసిన కుటుంబ స‌భ్యులు త్వ‌ర‌గా వెళ్లాల‌నే ఆలోచ‌న‌తో ఎడ్ల బండిపై తీసుకెళ్లారు.

కాసేప‌టికే 108 అంబులెన్స్ రావ‌డంతో హుటాహుటినా గ‌ర్భిణీని నేర‌డిగొండ మండ‌ల కేంద్రంలోని ఆరోగ్య ఉప‌కేంద్రానికి త‌ర‌లించారు. అప్ప‌టికే సిద్దంగా ఉన్న డాక్ట‌ర్లు ఆమెను ప‌రిశీలించారు. ప్ర‌స్తుతం గ‌ర్భిణీ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని, నొప్పులు త‌గ్గాయ‌ని ప్ర‌స‌వానికి ఇంకా స‌మ‌యం ఉంద‌ని వైద్యులు తెలిపారు. స‌మ‌యానికి అంబులెన్స్ రావ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింద‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు.


అసలు వీడు మనిషేనా.. డబ్బుల కోసం ఇంత కక్కుర్తా?

గుడ్ న్యూస్ : ఇక ఆధార్ మార్పులు ఫోన్లోనే?

స‌మస్య‌లుంటే నా నంబ‌ర్ కు ఫోన్ చేయండి : మేయ‌ర్

అతనికి వ్యతిరేకంగా మాట్లాడితే రేప్, డెత్ బెదిరింపులు !

ఒక్క విష‌యం గుర్తు పెట్ట‌కో సిన్న‌ప్పా అంటున్న సైబ‌రాబాద్ పోలీస్.. !

ఈ దెబ్బకు జగన్ కు పిల్లలు పాలాభిషేకమే...?

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జ‌ల‌ విలయంలో చిక్కుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల తో మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కొమురం భీం జిల్లాల‌లో భారీగా వరద నీరు చేరింది. ఈ వ‌ర్షాల‌తో జిల్లా లోని లోతట్టు ప్రాంతాలన్ని పూర్తిగా జలమయమయ్యాయి. దాంతో అప్రమత్తమైన స్థానిక అధికారులు, మున్సిపాలిటీ సిబ్బంది పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాలతో మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. దాంతో స్థానికంగా ఉన్న రామ్ న‌గ‌ర్, ఎన్టీఆర్ న‌గ‌ర్ కాల‌నీల‌లోని ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరింది. దాంతో స్థానిక ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జలవిలయంలో ఉమ్మడి ఆదిలాబాద్.. !

ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విలువ ఎంతో తెలిస్తే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>