MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bala0f667147-f10e-44b4-a10f-bbfbd6a39593-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bala0f667147-f10e-44b4-a10f-bbfbd6a39593-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఆర్టిస్టులకు ఒక ఆలయం లాంటిది మా. దానికి వారు ఎంతో అభిమానంతో ప్రేమతో స్థాపించుకున్నారు. తమకూ ఒక సంఘం ఉండాలి అన్న కోరిక నుంచి పుట్టిందే మా. దీనికి వ్యవస్థాపక ప్రెసిడెంట్ గా చిరంజీవి ఉన్నారు. ఆ తరువాత ఎంతో మంది హీరోలు పనిచేశారు. bala{#}NTRబాలయ్య మా ప్రెసిడెంట్ ఎందుకు కాలేదు... ?బాలయ్య మా ప్రెసిడెంట్ ఎందుకు కాలేదు... ?bala{#}NTRFri, 23 Jul 2021 19:01:04 GMTటాలీవుడ్ ఆర్టిస్టులకు ఒక ఆలయం లాంటిది మా. దానికి వారు ఎంతో అభిమానంతో ప్రేమతో స్థాపించుకున్నారు. తమకూ ఒక సంఘం ఉండాలి అన్న కోరిక నుంచి పుట్టిందే మా. దీనికి వ్యవస్థాపక ప్రెసిడెంట్ గా చిరంజీవి ఉన్నారు. ఆ తరువాత ఎంతో మంది హీరోలు పనిచేశారు.

ఇక అక్కినేని నాగార్జున, మోహన్ బాబు లాంటి వారు కూడా మాకు సేవలు అందించారు. అయితే ఎపుడూ మా ప్రెసిడెంట్ ఎన్నికల జోలికి బాలయ్య మాత్రం పోలేదు. దాని వెనక కారణాలు తెలియవు కానీ మా ఆవిర్భావం సందర్భంగా కూడా బాలయ్య ఎక్కడా కనిపించలేదు. నాటి సీఎం చంద్రబాబు మాను ప్రారంభించారు. సీనియర్ నటులు అక్కినేని నాగేశ్వరరావు, క్రిష్ణం రాజు, క్రిష్ణ వంటి పెద్దలు వచ్చి ఆశీర్వదించారు. ఇక దాసరి లాంటి వారు నాటి సభలో ముఖ్యులుగా ఉన్నారు.

మా ఏర్పాటు వేళ చిరంజీవి, నాగార్జున, సీనియర్ నరేష్ వంటి వారే ఎక్కువగా సందడి చేశారు. తరువాత రోజుల్లో వీరే ప్రెసిడెంట్లుగా రావడం విశేషం. ఇక టాలీవుడ్ టాప్ హీరోలలో చూసుకుంటే వెంకటేష్, బాలయ్య మాత్రమే ప్రెసిడెంట్ కాలేదు. ఇపుడు ఇదంతా ఎందుకంటే మంచు విష్ణు నాటి జనరేషన్ హీరోలలో బాలయ్య ప్రెసిడెంట్ కాలేదని మీడియా ద్వారా అందరి దృష్టికి తీసుకువచ్చారు.

అయితే బాలయ్య సీనియర్ ఎన్టీయార్ నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చినా కూడా ఎపుడూ నాయకత్వం వహించాలని, పెత్తనం చేయాలని భావించలేదు అంటారు. తన పని ఏంటో, తన సినిమాలు ఏంటో అన్నట్లుగానే బాలయ్య ఉంటారు. ఇక మాలో కూడా వర్గాలు మొదట్లో లేకపోయినా తరువాత కాలంలో బయటపడడంతో బాలయ్య  ఈ మధ్య తరచూ తన గొంతు విప్పుతున్నారు. అయితే బాలయ్య మా ప్రెసిడెంట్ అవుతారా. ఆయనకు ఆ పదవి మీద మోజు ఉందా అంటే లేదనే చెప్పాలి. పైగా మాలో ఒక బలమైన వర్గం ఉంది. ఇక్కడ పోటీ కూడా తీవ్రంగా ఉంటుంది. దాంతో ఎవరు అవునన్నా కాదన్న ఆ బలమైన వర్గమే గెలిచి తీరుతుంది అంటున్నారు అంతా.





గుర్తుపట్టకుండా మారిపోయిన తారక్ హీరోయిన్.. ఏ సినిమాలో నటించింది.. ?

మన హీరో లకు బాలీవుడ్ అంటే ఎందుకంత మోజు!!

తొలిచూపులోనే ఆ హీరోయిన్‌కు ప‌డిపోయిన రాఘ‌వేంద్ర‌రావు ?

జలవిలయంలో ఉమ్మడి ఆదిలాబాద్.. !

సీనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాలో మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ?

ఒకే టైటిల్ కోసం ఇద్దరు స్టార్స్ మధ్య గొడవ..!

సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు ఆ హీరోయిన్‌తో ఎఫైర్ నిజ‌మేనా ?

ఒలంపిక్స్ ప్లేయర్ల కోసం ఆర్ ఆర్ ఆర్ టీం అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ?

ఈ తెలుగు సినిమా లు వస్తే కానీ పని కాదు!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>