PoliticsLAXMANeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/area-wise-bjp-committees-for-strength03692ebe-49ae-4e21-af05-0ba368d56fd8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/area-wise-bjp-committees-for-strength03692ebe-49ae-4e21-af05-0ba368d56fd8-415x250-IndiaHerald.jpgఏపీలో బీజేపీ పట్టుకోసం అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకుపోతుంది. గళాన్ని గట్టిగా వినిపించేందుకు, సామాజిక సమీకరణలలో భాగంగా గతంలో రాష్ట్రాధ్యక్షుడు కొనసాగుతున్న కన్నా లక్ష్మీనారాయణను పక్కనపెట్టి మరి సోము వీర్రాజుకు రాష్ట్ర పార్టీ పగ్గాలను అందించింది అధిష్టానం. రాష్ట్రాధ్యక్షుడి హోదాలో సోము రాష్ట్ర కమిటీని సామాజిక వర్గాలవారీగా సభ్యులకు ప్రాధాన్యత ఇస్తూ కమిటీని తీర్చారు. ఈ కమిటీలో అన్ని జిల్లాలో చురుగ్గా పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు సముచిత స్ధానం కల్పించారు సోము. పదవులు తీసుకున్న నాయకుArea Wise BJP Committees for Strength{#}srihari;Uttarandhra;Parliament;dr rajasekhar;Doctor;MLA;Venkatesh;Parliment;Andhra Pradesh;Kanna Lakshminarayana;Minister;Bharatiya Janata Party;Party;central governmentపట్టుకోసం ప్రాంతాల వారీగా బీజేపీ కమిటీలుపట్టుకోసం ప్రాంతాల వారీగా బీజేపీ కమిటీలుArea Wise BJP Committees for Strength{#}srihari;Uttarandhra;Parliament;dr rajasekhar;Doctor;MLA;Venkatesh;Parliment;Andhra Pradesh;Kanna Lakshminarayana;Minister;Bharatiya Janata Party;Party;central governmentFri, 23 Jul 2021 19:19:37 GMTఏపీలో బీజేపీ పట్టుకోసం అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకుపోతుంది. గళాన్ని గట్టిగా వినిపించేందుకు, సామాజిక సమీకరణలలో భాగంగా గతంలో రాష్ట్రాధ్యక్షుడు కొనసాగుతున్న కన్నా లక్ష్మీనారాయణను పక్కనపెట్టి మరి సోము వీర్రాజుకు రాష్ట్ర పార్టీ పగ్గాలను అందించింది అధిష్టానం. రాష్ట్రాధ్యక్షుడి హోదాలో సోము రాష్ట్ర కమిటీని సామాజిక వర్గాలవారీగా సభ్యులకు ప్రాధాన్యత ఇస్తూ కమిటీని తీర్చారు. ఈ కమిటీలో అన్ని జిల్లాలో చురుగ్గా పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు సముచిత స్ధానం కల్పించారు సోము. పదవులు తీసుకున్న నాయకులతో నిత్యం పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ .. అధికార పార్టీపై తన శైలిలో విమర్శలు బాణాలను ఎక్కుపెట్టడంలో సోము తన మార్క్ ను చూపిస్తునే ముందుకు సాగుతున్నారు.

ఇప్పటికే జిల్లాలను పార్లమెంట్ జిల్లాలుగా విభజించి అధ్యక్ష పదవులను అప్పగించి నాయకులను బాధ్యులను చేశారు. నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోయి, అధికారపార్టీ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు కార్యచరణను సిద్ధం చేశారు. పార్లమెంటు వారీగా అధ్యక్ష పదవులను పంచడం మూలంగా పార్టీ కార్యక్రమాలు గ్రౌండ్ లెవల్లో వెళ్లడమేకాక, కేంద్ర నిధులు ఏ స్థాయిలో రాష్ట్రానికి అందుతున్నాయో వివరించేందుకు కమిటీలు తమదైన పాత్ర పోషిస్తున్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. ఈ నేపధ్యంలో ప్రాంతాల అభివృద్ధి కమిటీని కూడా ప్రకటించి, గ్రౌండ్ లెవల్ పార్టీని నిర్మించాలని రాష్ట్ర అధిష్టానం ప్రణాళికలను సిద్ధం చేసింది. నేతకు బాధ్యతలను అప్పగిస్తూ .. పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పార్టీ పూర్తిస్థాయిలో పటిష్టం కోసం ఏపి ని మూడు ప్రాంతాలు విభజించి ప్రాంతాల వారీగా కమిటీ ఫాం చేసింది అధిష్టానం. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీయ గా మూడు ప్రాంతాలగా విభజించి కన్వీనర్స్ ను, కో - కన్వీనర్లును నియమించింది. ఉత్తరాంధ్ర పార్టీ అభివృద్ధి కమిటీ కన్వీనర్ గా మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు, కో-కన్వీనర్ గా డాక్టర్ గొర్లె సత్యనారాయణ లు నియమితులు కాగా .. కోస్తాంధ్ర కు కన్వీనర్ గా మాజీ మంత్రి శనక్కాయల అరుణ, కో- కన్వీనర్లుగా మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, తాళ్ల వెంకటేష్ యాదవ్, రామసీమకు కన్వీనర్ గా మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కో - కన్వీనర్లుగా మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారధి,డాక్టర్ శ్రీహరి లు పార్టీ అభివృద్ధి కమిటీలో చోటు దక్కింది. ఇలా ప్రాంతాల వారీగా పార్టీ అభివృద్ధికి బాసటగా నిలిచేలా సీనియర్లు కమిటీలో భాగస్వాములను చేస్తూ .. అధిక ప్రాధన్యత కల్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.





పట్టుకోసం ప్రాంతాల వారీగా బీజేపీ కమిటీలు

కేంద్రం గుడ్ న్యూస్.. రైతులు 3 లక్షలు పొందే అవకాశం?

అవుట్ ఆఫ్ లా ఒక్కటే మార్గం అంటున్న స్పీకర్

అమిత్‌ షా రాజీనామా చేయాల్సిందే ?

మాట నిలబెట్టుకున్న సోనుసూద్?

ఢిల్లీ గేట్ : క‌మ్యూనిస్టుల‌పై ప్రేమ సాయిరెడ్డికి ఎందుకు?

సీఎం జగన్ తోనే సామాజిక న్యాయం - మంత్రి కన్నబాబు

వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.. దీనికోసమో తెలుసా?

మళ్లీ మోడీకి లేఖ రాసిన రఘురామ.. దేనికోసమంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - LAXMAN]]>