PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/no-one-is-tempted-do-it-like-this9cfe068a-e885-4751-abe2-1cf7b943135c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/no-one-is-tempted-do-it-like-this9cfe068a-e885-4751-abe2-1cf7b943135c-415x250-IndiaHerald.jpgఇపుడు జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చాలా చల్లగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా లేనిపోని కోరికలు కలుగుతూ ఉంటాయి. వేడివేడిగా అవి తినాలి.. ఇవి తాగాలి అనే ఆశతో ఉంటారు. అలాంటి వారు సరిగా తెలుసుకోకుండా ఏవి పడితే అవి తింటే.. ఇవి తాగితే ప్రమాదాలు కొనితెచ్చుకున్నట్టే. No one is tempted do it like thisఎవరూ టెంప్ట్ కావొద్దు.. ఇలా చేయండి..!ఎవరూ టెంప్ట్ కావొద్దు.. ఇలా చేయండి..!No one is tempted do it like thisFri, 23 Jul 2021 11:53:17 GMTవానాకాలంలో నీరు కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిల్టర్ నీళ్లు అయినా సరే గోరువెచ్చగా చేసుకొని తాగడం మేలు. దీని వల్ల చాలా రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు. జ్వరాలు , జలుబు, దగ్గుతో ఇబ్బందిపడేవారు నీళ్లలో కాస్త తేనె, నిమ్మరసం కలుపుకొని తాగితే ఉపశమనం కలుగుతుంది. అలాగే శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. మలవిసర్జన సులభంగా జరుగుతుంది.

వర్షాకాలంలో వాతావరణం చల్లబడగానే.. చాలామంది వేడి సమోసాలు, పకోడీలు తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇక రోడ్డు పక్కన లభించే టీ, స్నాక్స్ ఎక్కువగా తినేస్తుంటారు. అయితే ఈ సీజన్ లో బయట లభించే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాద ముంది. అంతేకాదు ఫ్లూ, జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కాలంలో శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండే ఫుడ్ తీసుకోవాలని .. వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక వర్షాకాలంలో చర్మ సమస్యలు అధికంగా వస్తుంటాయి. ముఖ్యంగా ఎక్కువగా నీళ్లలో నానుతుంటాయి కాబట్టి పాదాలకు ఎక్కువ సమస్యలు వస్తాయి. పాదాలు పగలడం, దుర్వాసన రావడం, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఈ సీజన్ లో అధికంగా వస్తాయి. కాబట్టి.. కర్పూరాన్ని పొడిచేసి పౌడర్ కలుపుకొని పాదాలకు పట్టించి సాక్స్ వేసుకోవాలి. అలాగే పాదాలు తరచూ గోరు వెచ్చని నీటిలో నానబెట్టండి. ఉల్లిపాయల రసాన్ని తీసుకొని దాంతో పాదాలు మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలాంటి ఇంటి చిట్కాలతో పాదాలు సురక్షితంగా ఉంటాయి.


చాలామందికి కోరికలు బాగానే ఉంటాయి. ఈ వర్షాకాలంలో చల్లని వాతావరణంలో వేడివేడిగా లాగించేద్దామని ఆశపడుతుంటారు. కొందరు రోడ్ల పక్కన ఆగి ఏదిపడితే అది తినేస్తుంటారు. ఏది పడితే అది తాగేస్తుంటారు. దాని వల్ల అప్పటికప్పుడు హాయిగా ఉండొచ్చు. కానీ అలా చేయడం వల్ల చాలా దుష్పరిణామాలు ఎదురయ్యే ప్రమాదముంది. కాబట్టి ఈ సీజన్ లో తినే విషయంలో.. తాగే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.







 





సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>