PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/petrol-dieselc8ad0f96-47f1-4691-b230-69f13c7821d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/petrol-dieselc8ad0f96-47f1-4691-b230-69f13c7821d4-415x250-IndiaHerald.jpgకొంత‌కాలం నుంచి ఆకాశమే హ‌ద్దుగా పెరుగుతున్న‌ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లపై దేశంలో ఆందోళ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ప్ర‌స్తుతం దేశంలో ఎక్క‌డ చూసినా ఇంధ‌న మంట ఎక్కువ‌వుతూనే ఉంది. పెరుగుత‌న్న ఇంధ‌న ధ‌ర‌లు సామాన్యుని గుదిబండ‌గా మారింది. ఈ నెప‌థ్యంలో కేంద్రం, రాష్ట్రాల్లోని ప్ర‌తిప‌క్షాలు అధికార ప‌క్షంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది. పెట్రోల్‌, డీజిల్ పై ప‌న్నులు త‌గ్గించాల‌ని త‌ద్వారా ఇంధ‌న ధ‌ర‌లు అదుపులో ఉంటాయ‌ని ప్ర‌తిప‌క్షాలు అంటున్నాయి. ఇదే క్ర‌మంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను తగ్గించడానికి ఇంధpetrol-diesel{#}June;Bank;2020;India;Diesel;Petrol;central governmentప్ర‌భుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌పై ప‌న్నులు త‌గ్గించక‌పోవ‌డానికి కార‌ణాలు ఇవేనా..?ప్ర‌భుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌పై ప‌న్నులు త‌గ్గించక‌పోవ‌డానికి కార‌ణాలు ఇవేనా..?petrol-diesel{#}June;Bank;2020;India;Diesel;Petrol;central governmentFri, 23 Jul 2021 09:52:41 GMT కొంత‌కాలం నుంచి ఆకాశమే హ‌ద్దుగా పెరుగుతున్న‌ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లపై దేశంలో ఆందోళ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ప్ర‌స్తుతం దేశంలో ఎక్క‌డ చూసినా ఇంధ‌న మంట ఎక్కువ‌వుతూనే ఉంది. పెరుగుత‌న్న ఇంధ‌న ధ‌ర‌లు సామాన్యుని గుదిబండ‌గా మారింది. ఈ నెప‌థ్యంలో కేంద్రం, రాష్ట్రాల్లోని ప్ర‌తిప‌క్షాలు అధికార ప‌క్షంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది. పెట్రోల్‌, డీజిల్ పై ప‌న్నులు త‌గ్గించాల‌ని త‌ద్వారా ఇంధ‌న ధ‌ర‌లు అదుపులో ఉంటాయ‌ని ప్ర‌తిప‌క్షాలు అంటున్నాయి.


 ఇదే క్ర‌మంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను తగ్గించడానికి ఇంధనంపై పన్నులను తగ్గిస్తాయనే సూచనలు మాత్రం చేయ‌డం లేదు.  జూలై 14న న్యూ ఢిల్లీలో లీటరు పెట్రోల్‌కు 101.19 రూపాయలు ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ .89.72 గా ఉంది. ఒక సంవత్సరం క్రితం 2020 మార్చిలో, భారతదేశంలో కోవిడ్ -19 మహమ్మారి ప్రారంభంలో, పెట్రోల్ ధర ఢిల్లీలో లీటరుకు 70 రూపాయలు, డీజిల్ 63 రూపాయలు మాత్ర‌మే.. అంటే పెట్రోల్ ధరలు 15 నెలల్లో దాదాపు రూ .30 కు పైగా, డీజిల్ ధరలు రూ. 27 పెరిగాయి. ఈ పెరుగుద‌ల‌ను చూస్తే సంవ‌త్స‌ర కాలంటో ఎంత తేడా ఉందో క‌న‌బ‌డుతోంది.

  అధికంగా ఇంధ‌న ధ‌ర‌లు ద్ర‌వ్యోల్భానాన్ని రేకెత్తించాయి. మే, జూన్ నెల‌ల్లో రిటైల్ ద్ర‌వ్యోల్భ‌ణం రేటును 6.3 శాతం మ‌రియు 6.26 శాతంగా రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంచింది. అయితే ఇంత‌గా పెట్రోల్, డీజీల్ ధ‌ర‌లు ప్ర‌భావాన్ని చూపుతున్నా..పెట్రోల్ రిటైల్ ధరలో 55 శాతం, డీజిల్ దాదాపు 50 శాతం ఉన్న పన్నులు తగ్గించాలని కేంద్రంలో మరియు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఇష్టపడకపోవడానికి అవి ప్ర‌ధాన‌మైన ఆదాయంగా ఉండ‌డ‌మే దీనికి కార‌ణం అని తెలుస్తోంది.

జూలై 1 వివ‌రాల ప్ర‌కారం.. ఢిల్లీలో పెట్రోల్‌పై కేంద్ర పన్ను (ఎక్సైజ్) రూ .32.90, డీజిల్‌పై రూ .11.80 ఉండ‌గా.. రాష్ట్రం విధించిన సుంకం (విలువ ఆధారిత పన్ను, లేదా వ్యాట్) పెట్రోల్‌కు 22.82 రూపాయలు, డీజిల్‌కు 13.05 రూపాయలు ఉంది.  2020-21 సంవత్సరానికి గాను ఇంధనంపై ఎక్సైజ్ ద్వారా కేంద్రం రూ .3.7 లక్షల కోట్లు సంపాదించగా, రాష్ట్రాలు రూ.2 లక్షల కోట్లు సంపాదించాయి. కొవిడ్ మహమ్మారి రెండవ వేవ్ కారణంగా వస్తు మరియు సేవల పన్ను (జిఎస్టి) వసూళ్లు అంచనాలకు తగ్గట్టు లేనందునా.. ఆదాయ వ‌న‌రులు మ‌రింత త‌గ్గిపోయాయి. ఇంధనం జీఎస్టీ పరిధిలోకి తీసుకురాక‌వ‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఏంటంటే.. వ్యాట్ రేట్లు రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లను సర్దుబాటు చేయడంలో కొంత సౌలభ్యాన్ని క‌లిగి ఉంటాయి. జీఎస్టీ కింద ఇంధనాన్ని తీసుకురావడానికి వారు ఇష్టపడకపోవడానికి ఇది ఒక కారణం.





రజినీ కబాలి మూవీకి.. ఎన్ని కోట్ల లాస్ వచ్చిందో తెలుసా..?

19 రాష్ట్రాల్లో పెట్రోల్@100.. మీరు ఎంత టాక్స్ కడుతున్నారో తెలుసుకోండి ఇక్కడ..?

పెట్రో ఎఫెక్ట్ : మోడీ మంచి వాడే నా స‌ర్ ...

ప్రపంచంలో అతి తక్కువగా పెట్రోల్ ధరలు ఉన్న దేశాలు ఇవే ?

బీజేపీ, జనసేన.. ఎడబాటు ఖాయమేనా..?

పెట్రో ... టాక్ : ప్ర‌తి చుక్కా భార‌మే

ఇలా అయితే పుష్ప రిలీజ్ ఈ ఏడాది కష్టమే?

ఇండియాలో వ్యాపారం చేయడం సవాళ్లతో కూడుకున్నది: అమెరికా

నేటి నుంచే ఆటల పండుగ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>