PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/dowry-groom-b0561caa-d817-4a27-a6b8-a601eeccf262-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/dowry-groom-b0561caa-d817-4a27-a6b8-a601eeccf262-415x250-IndiaHerald.jpgభారత వివాహ వ్యవస్థలో చట్టం ప్రకారం కట్నం తీసుకోవడం నేరం. కానీ, ప్రస్తుతం 95 శాతం వివాహాల్లో కట్నకానుకలు, చెల్లింపులు సాధారణంగా, ఇష్టప్రకారంగానే జరుగుతున్నట్లు పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వాటిని మనం గమనించొచ్చు కూడా. కట్నం తీసుకునేవాడు గాడిద అనే ప్రకటనలు ప్రసార మాధ్యమాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఆచరణలో కట్నం కామన్ అయింది. ఈ క్రమంలోనే వరకట్నం తీసుకోవడం ఆచారంగా వస్తోంది. అయితే, చాలా ప్రాంతాల్లో అదనపు కట్నం కోసం జరిగే వేధింపులకు ఇక్కడే బీజం పడుతుందని అర్థం చేసుకోవచ్చు. కాగా, మనం ఇప్పుడు తెలుసుకోబdowry groom {#}advertisement;job;Car;Manam;Arrest;gold;policeకట్నంగా అవి అడిగిన వరుడు.. చివరికి..?కట్నంగా అవి అడిగిన వరుడు.. చివరికి..?dowry groom {#}advertisement;job;Car;Manam;Arrest;gold;policeFri, 23 Jul 2021 13:30:00 GMTభారత వివాహ వ్యవస్థలో చట్టం ప్రకారం కట్నం తీసుకోవడం నేరం. కానీ, ప్రస్తుతం 95 శాతం వివాహాల్లో కట్నకానుకలు, చెల్లింపులు సాధారణంగా, ఇష్టప్రకారంగానే జరుగుతున్నట్లు పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వాటిని మనం గమనించొచ్చు కూడా. కట్నం తీసుకునేవాడు గాడిద అనే ప్రకటనలు ప్రసార మాధ్యమాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఆచరణలో కట్నం కామన్ అయింది.
 
ఈ క్రమంలోనే వరకట్నం తీసుకోవడం ఆచారంగా వస్తోంది. అయితే, చాలా ప్రాంతాల్లో అదనపు కట్నం కోసం జరిగే వేధింపులకు ఇక్కడే బీజం పడుతుందని అర్థం చేసుకోవచ్చు. కాగా, మనం ఇప్పుడు తెలుసుకోబేయే ఈ స్టోరీలో వరుడు కట్నం కింద వింత కోరికలు కోరాడు తెలుసా? ఇంతకీ నూతన వరుడు పెట్టిన డిమాండ్స్ ఏంటి? అవి తీర్చకపోతే ఏం చేస్తా అన్నాడు? చివరికి ఆయన పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే..


మామూలుగా వరుడు కట్నంగా మనీ, ల్యాండ్, ప్రాపర్టీస్, బైక్, కారు అడుగుతుంటారు. కానీ, మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌‌కు చెందిన ఓ విరుడు వింత వరకట్నం అడిగి అడ్డంగా బుక్కై జైలు పాలయ్యాడు. వివరాల్లోకెళితే..ఔరంగాబాద్ సిటీలో ఉండే ఓ యువకుడికి ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థానికంగా ఉండే ఓ అమ్మయితో ఎంగేజ్‌మెంట్ అయింది. కట్నం కూడా కుదిరింది. ఇక ఆ నెక్స్ట్ పనుల్లో ఫుల్ బిజీ అయ్యారు వధువు పేరెంట్స్. వరుడికి రూ.2 లక్షల నగదు, తులం బంగారం కట్నంగా ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలో ఇక అంతా సవ్యంగా సాగిపోతుందనుకున్నారు. కానీ, ఈ తరుణంలోనే వరుడు వింత కోరికల చిట్టాను బయటపెట్టాడు.


డౌరీ కింద ఎక్స్‌ట్రాగా తనకు రూ.10 లక్షలు, 21 గోళ్లున్న తాబేలు, నల్ల లాబ్రడార్ జాతి కుక్క, బుద్ధుడి బొమ్మ, దీపం కుందెలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అవి ఇస్తేనే మ్యారేజ్ జరుగుతుందని, అమ్మాయికి జాబ్ వస్తుందని చెప్పాడు. వరుడి విచిత్ర కోరికలు విని వధువు తరఫు బంధువులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ కోరికలు నెరవేర్చలేమని వధువు కుటుంబీకులు తెలిపారు. అయినా వరుడి వినలేదు. ఇక చేసేదేమీలేక వధువు కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసులు వరుడిపై చీటింగ్ కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. మొత్తానికి విచిత్ర కోరికలు కోరినందుకు గాను వరుడు కటకటాల పాలయ్యాడు.



మంచిమాట : ఈ తప్పులను మీరు కూడా చేస్తున్నారా..?

హీరోగా మారిన బిగ్‌బాస్‌ విన్నర్‌..?

కి`లేడీ` గ్యాంగ్ దందా..! అప్పు తీర్చ‌కుంటే అంతే సంగతులు..

పెట్రోల్ మంటకు గత ప్రభుత్వాలే కారణమా.. ?

ప‌దుల సంఖ్య‌లో పెళ్లిళ్లు, 80 మంది సంతానం.. ఆ రాజుగారి కామక్రీడలు చూస్తే షాక్‌..!

బుల్లి పిట్ట : ఈ కారుకు ఒకసారి ఛార్జ్ చేస్తే చాలు..600 km ప్రయాణం..

మావోయిజం మరణించదు .. రూపం మార్చుకుంటుందంతే !

ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విలువ ఎంతో తెలిస్తే..?

సౌత్ సినిమా పై సూర్య ముద్ర.. అందుకే భారీ క్రేజ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>