CookingSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/cooking/81/india-herald-special-curry388fb5da-1af1-4d7e-8c18-d73dff5469cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/cooking/81/india-herald-special-curry388fb5da-1af1-4d7e-8c18-d73dff5469cd-415x250-IndiaHerald.jpgవాతావరణం చల్లగా ఉంది కదా ఎంచక్కా వేడి వేడిగా చికెన్ కర్రీ వండుకుని తింటే భలే ఉంటుంది. అయితే ప్రతి రోజు వండేలాగా కాకుండా ఈసారి కొత్తగా కరివేపాకుతో చికెన్ కర్రీ వండుకుని చూడండి చాలా రుచికరంగా ఉంటుంది. అందుకే ఇండియా హెరాల్డ్ వారు చెప్పే కరివేపాకు చికెన్ కర్రీను ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా కావలిసిన పదార్ధాలు ఏంటో ఒకసారి చూద్దామా కావలిసిన పదార్ధాలు : 15 కరివేపాకు రెమ్మలు ¼ కప్ కొత్తిమీర తరుగు ¼ కప్ జీడిపప్పు 1 tbsp ధనియాలు 3 tsp నూనె 3 లవంగాలు 3 యాలుకలు ½ అంగుళం దాల్చినచెక్క 750 గ్రామindia herald -special curry{#}Chicken;India;Curry leaf;Curry leaves;Coriander.;Ginger;Gas Stove;oil;Mixie;Onion;Chilli;Masalaకరివేపాకుతో చికెన్ కర్రీ ఎప్పుడన్నా ట్రై చేశారా...?కరివేపాకుతో చికెన్ కర్రీ ఎప్పుడన్నా ట్రై చేశారా...?india herald -special curry{#}Chicken;India;Curry leaf;Curry leaves;Coriander.;Ginger;Gas Stove;oil;Mixie;Onion;Chilli;MasalaFri, 23 Jul 2021 12:00:00 GMTచికెన్ కర్రీ వండుకుని తింటే భలే ఉంటుంది. అయితే ప్రతి రోజు వండేలాగా కాకుండా ఈసారి కొత్తగా కరివేపాకుతో చికెన్ కర్రీ వండుకుని చూడండి చాలా రుచికరంగా ఉంటుంది. అందుకే ఇండియా హెరాల్డ్ వారు చెప్పే కరివేపాకు చికెన్ కర్రీను ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా కావలిసిన పదార్ధాలు ఏంటో ఒకసారి చూద్దామా

కావలిసిన పదార్ధాలు :

15 కరివేపాకు రెమ్మలు

¼ కప్ కొత్తిమీర తరుగు

¼ కప్ జీడిపప్పు

1 tbsp ధనియాలు

3 tsp నూనె

3 లవంగాలు

3 యాలుకలు

½ అంగుళం దాల్చినచెక్క

750 గ్రాములు చికెన్

2  ఉల్లిపాయలు

1 tsp అల్లం వెల్లుల్లి ముద్ద

ఉప్పు తగినంత

¼ tsp పసుపు

1 ½ tsp ధనియాల పొడి

½ tsp గరం మసాలా

¼ కప్ కొబ్బరి పాలు

3 tbsp నూనె

¼ కొత్తిమీర తరుగు
 
తయారీ విధానం :

ముందుగా కరివేపాకు పేస్ట్ ను తయారు చేసుకోవడానికి
ఒక గిన్నెలోకి కరివేపాకుని తీసుకుని శుభ్రంగా కడిగి, ఆకులు తీసేసి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి అందులో నూనె పోసి వేడి చేసి అందులో జీడిపప్పు, ధనియాలు, లవంగాలు,చెక్క, యాలుక్కాయ వేసి లైట్ గా వేయించి పక్కన పెట్టుకోవాలి.తర్వాత అదే బాండీలో కరివేపాకు, కొత్తిమీర వేసి 2 నుండి 3 నిమిషాల పాటు వేయించండి. వీటన్నిటిని మిక్సీ జారులోకి తీసుకొని, కొద్ది కొద్దిగా నీరు పోస్తూ మెత్తని పేస్టులా రుబ్బుకొండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బాండీలో నూనె వేడి చేసి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేపాలి.అవి వేగిన తరువాత  అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాలి.ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి ఐదు నిముషాలు పాటు ఉడికించండి తరువాత అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి.కూర అంతా కలిపి మూత పెట్టి  మీడియం మంట మీద ఉడికించాలి. ఒక 10 నిముషాలు అయ్యాక  ఒకసారి కలిపి కొబ్బరి పాలు,ముందుగా తయారు చేసుకున్న కరివేపాకు పేస్ట్ వేసి కలపండి. కొబ్బరి పాలతో పాటు కొద్దిగా నీళ్లు కూడా పోసి మూత పెట్టండి. నూనె పైకి కనిపించే అంత వరకు పొయ్యి మీద ఉంచి  తరువాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోండి.







వారిపై పెగాసస్ టార్గెట్..?

ప్రజలపై మోదీ 'పెట్రో' భారం తగ్గేనా ?

కరివేపాకుతో చికెన్ కర్రీ ఎలా చేయాలో ఇండియా హెరాల్డ్. కామ్ లో చూడండి

నెట్ ఫ్లిక్స్‌ తో పోరాడండి.. ఆ హీరో పిలుపు..! ఎందుకంటే..?

రజినీ కబాలి మూవీకి.. ఎన్ని కోట్ల లాస్ వచ్చిందో తెలుసా..?

ప్ర‌భుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌పై ప‌న్నులు త‌గ్గించక‌పోవ‌డానికి కార‌ణాలు ఇవేనా..?

ప్రపంచంలో అతి తక్కువగా పెట్రోల్ ధరలు ఉన్న దేశాలు ఇవే ?

ఇలా అయితే పుష్ప రిలీజ్ ఈ ఏడాది కష్టమే?

ఇండియాలో వ్యాపారం చేయడం సవాళ్లతో కూడుకున్నది: అమెరికా



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>