BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag9a234b5a-c835-4da8-9003-8a1e2d0fadd2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag9a234b5a-c835-4da8-9003-8a1e2d0fadd2-415x250-IndiaHerald.jpg ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి నివాసం స‌మీపంలోని అమ‌రారెడ్డిన‌గ‌ర్ లో ఉంటున్న ఇళ్ల‌ను కొద్దిరోజులుగా అధికారులు కూల్చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ కూల్చివేత‌ల‌ను నిలిపేస్తూ తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అక్క‌డ నివ‌సించేవారు తాత్కాలిక నివాసాలు చూసుకోవ‌డానికి ఆగ‌స్టు ఆరోతేదీ వ‌ర‌కు స‌మ‌యం ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. వారంద‌రికీ తాత్కాలికంగా నివాసాలు క‌ల్పించే అంశాన్ని ప‌రిశీలించాల‌ని కోర్టు సూచించింది. ఆత్మ‌కూరులో వారికి ఇప్ప‌టికిప్పుడు ఇళ్లు నిర్మించి ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని పిటిtag{#}High court;courtజ‌గ‌న్‌కు షాకిచ్చిన హైకోర్టు?జ‌గ‌న్‌కు షాకిచ్చిన హైకోర్టు?tag{#}High court;courtFri, 23 Jul 2021 17:00:00 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి నివాసం స‌మీపంలోని అమ‌రారెడ్డిన‌గ‌ర్ లో ఉంటున్న ఇళ్ల‌ను కొద్దిరోజులుగా అధికారులు కూల్చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ కూల్చివేత‌ల‌ను నిలిపేస్తూ తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అక్క‌డ నివ‌సించేవారు తాత్కాలిక నివాసాలు చూసుకోవ‌డానికి ఆగ‌స్టు ఆరోతేదీ వ‌ర‌కు స‌మ‌యం ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. వారంద‌రికీ తాత్కాలికంగా నివాసాలు క‌ల్పించే అంశాన్ని ప‌రిశీలించాల‌ని కోర్టు సూచించింది. ఆత్మ‌కూరులో వారికి ఇప్ప‌టికిప్పుడు ఇళ్లు నిర్మించి ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. అక్క‌డ 44 కుటుంబాలు నివాసం ఉంటున్నాయ‌ని, వారంద‌రికీ తాత్కాలిక నివాసం ఏర్పాటుచేస్తే ఇప్ప‌టికే ఖాళీచేసిన‌వారు కూడా వ‌చ్చి అడుగుతారంటూ ప్ర‌భుత్వ న్యాయ‌వాది సుమ‌న్ వాదించారు. దీంతో ఇరువ‌ర్గాల వాద‌న‌లు విన్న కోర్టు ఆగ‌స్టు ఆరోతేదీ వ‌ర‌కు స‌మ‌యం ఇచ్చింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నివాసం స‌మీపంలో కొన్ని సంవ‌త్స‌రాల నుంచి తాము నివ‌సిస్తున్నామ‌ని, మ‌మ్మ‌ల్ని బ‌ల‌వంతంగా ఖాళీ చేయిస్తున్నారంటూ బాధితులంతా వాపోతున్నారు.

విశాఖప‌ట్నం ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడం ఖాయమని కేంద్రం స్ప‌ష్టం చేయ‌డంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు స్పందించారు. విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ నేత‌ల‌కు ఆయ‌న లేఖ‌లు రాశారు. ఉద్య‌మానికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నేతృత్వం వ‌హించాల‌ని, ఆయ‌న ముందుండి పోరాటం చేయాల‌ని కోరారు. అంద‌రూ ఐక్యంగా ఉండి పోరాడితేనే ఉక్కు క‌ర్మాగారాన్ని ప్ర‌యివేటీక‌ర‌ణ బారినుంచి ర‌క్షించుకోగ‌ల‌మ‌ని చంద్ర‌బాబు అన్నారు. విశాఖ ఉక్కు క‌ర్మాగారం పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి తెలుగుదేశం త‌ర‌ఫున సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్టు ప్ర‌క‌టించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో క‌ర్మాగారం సాధించుకున్నామ‌ని, ఎన్నెన్నో అడ్డంకులు, అవాంత‌రాల‌ను అధిగ‌మించి జాతికి అంకితం చేశామ‌న్నారు. తాము ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో 2000 సంవ‌త్స‌రంలో కేంద్రం ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు మొగ్గుచూపింద‌ని, తాను విజ్ఞ‌ప్తి చేయ‌డంతో ప్యాకేజీ ఇచ్చి ఆ ప్ర‌తిపాద‌న‌ను విర‌మించుకున్నార‌ని బాబు తెలిపారు.

విశాఖ ఉక్కు కోసం జ‌గ‌న్ పోరుబాట‌?

వీర్యం తీసిన కాసేపటికే.. భర్త ప్రాణం పోయింది?

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ప‌ర్య‌వేక్షిస్తున్న అధికారిని సీబీఐ మార్చేసింది. ప్రస్తుతం డీఐజీ కేడ‌ర్‌లో ఉన్న సుధా సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఏడువారాలుగా పులివెందులలో మకాం వేసిన సీబీఐ బృందం త‌మ ద‌ర్యాప్తులో భాగంగా ప‌నిమ‌నుషుల్ని, వాచ్‌మెన్‌ని, డ్రైవ‌ర్‌ని, ఇంటిప‌క్క‌వారిని, ప‌క్క పొలం వారిని ప్ర‌శ్నించిన‌ట్లు ప్ర‌శ్నిస్తూనే ఉన్నారు. ఒక‌ర‌కంగా కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను ప‌ట్టే రీతిలో ద‌ర్యాప్తు సాగుతోందంటూ ఇప్ప‌టికే సీబీఐపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వివేకానంద‌రెడ్డి ఇంటిని ఇప్ప‌టికే ఒక‌టికి ప‌దిసార్లు పూర్తిగా ప‌రిశీలించారు. ఇంత‌వ‌ర‌కు ఏం తేల్చారో తెలియ‌దుకానీ ద‌ర్యాప్తులో మాత్రం ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.

డీజీపీ వ‌ల్ల కానిది.. ఎస్పీవ‌ల్ల అవుతుందా?

సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా ఈ మధ్య తరచుగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్నారు. యూఏఈలో గ‌తేడాది జరిగిన ఐపీఎల్ నుంచి అర్ధంతరంగా తప్పుకుని రైనా భార‌త్‌కు తిరిగిరావ‌డం సంచ‌ల‌నం రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్ నుంచి త‌ప్పుకోవ‌డానికి అనేక కార‌ణాలు వినిపించిన‌ప్ప‌టికీ అది స‌మ‌సిపోయింది. ఈ సంవ‌త్స‌రం ఐపీఎల్‌లో మ‌ళ్లీ అత‌ను చెన్నై జ‌ట్టుకు ఆడిన సంగ‌తి తెలిసిందే.

చెన్నైలో బ్రాహ్మ‌ణులు మాత్ర‌మే ఉంటారా?

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి నివాసం స‌మీపంలోని అమ‌రారెడ్డిన‌గ‌ర్ లో ఉంటున్న ఇళ్ల‌ను కొద్దిరోజులుగా అధికారులు కూల్చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ కూల్చివేత‌ల‌ను నిలిపేస్తూ తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అక్క‌డ నివ‌సించేవారు తాత్కాలిక నివాసాలు చూసుకోవ‌డానికి ఆగ‌స్టు ఆరోతేదీ వ‌ర‌కు స‌మ‌యం ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. వారంద‌రికీ తాత్కాలికంగా నివాసాలు క‌ల్పించే అంశాన్ని ప‌రిశీలించాల‌ని కోర్టు సూచించింది. ఆత్మ‌కూరులో వారికి ఇప్ప‌టికిప్పుడు ఇళ్లు నిర్మించి ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. అక్క‌డ 44 కుటుంబాలు నివాసం ఉంటున్నాయ‌ని, వారంద‌రికీ తాత్కాలిక నివాసం ఏర్పాటుచేస్తే ఇప్ప‌టికే ఖాళీచేసిన‌వారు కూడా వ‌చ్చి అడుగుతారంటూ ప్ర‌భుత్వ న్యాయ‌వాది సుమ‌న్ వాదించారు. దీంతో ఇరువ‌ర్గాల వాద‌న‌లు విన్న కోర్టు ఆగ‌స్టు ఆరోతేదీ వ‌ర‌కు స‌మ‌యం ఇచ్చింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నివాసం స‌మీపంలో కొన్ని సంవ‌త్స‌రాల నుంచి తాము నివ‌సిస్తున్నామ‌ని, మ‌మ్మ‌ల్ని బ‌ల‌వంతంగా ఖాళీ చేయిస్తున్నారంటూ బాధితులంతా వాపోతున్నారు.

క‌నీసం మీడియా స‌మావేశం నిర్వ‌హిద్దామ‌న్నా స్వేచ్ఛ లేకుండా పోతోంద‌ని ఆ పార్టీ నేత‌లు వాపోతున్నారు. అందుకే పార్టీని వీడి త‌మ‌కు ఎక్క‌డైతే స్వేచ్ఛ ఉంటుంద‌ని భావిస్తున్నారో ఆ పార్టీలోకి వ‌ల‌స‌పోతున్నారు. సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు భార‌తీయ జ‌న‌తాపార్టీని వీడి కారెక్కిన సంగ‌తి తెలిసిందే. మ‌రికొంద‌రు నేత‌లు కూడా అదే బాట‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. బోడ జ‌నార్ద‌న్‌, చాడ సురేష్‌రెడ్డి, పెద్దిరెడ్డి, విక్ర‌మ్‌గౌడ్ త‌దిత‌ర సీనియ‌ర్ నేత‌లు బీజేపీని వీడాల‌నే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరంద‌రినీ తెలంగాణ రాష్ట్ర‌స‌మితిలోకి ఆహ్వానించేలా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. గ‌తంలో ప‌లువురు నేత‌లు తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వ‌ల‌స వెళ్లారు. క‌నీసం గౌర‌వం ద‌క్కే సంగ‌తి దేవుడెరుగు.. త‌మ అనుభావాన్ని కూడా బీజేపీ నేత‌లు ఉప‌యోగించుకోవ‌డంలేద‌ని వీరంతా అసంతృప్తికి గుర‌వుతున్నారు. ఆ పార్టీ ఎదుగుద‌ల‌కు సాయం చేద్దామ‌నుకుంటుంటే త‌మ‌ను బంధించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వారినుంచి వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఈటెల రాజేంద‌ర్ చేరిక‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. వీరంతా దాదాపు టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>