PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp3515a8bd-85d5-4014-b8f8-6b5abf8a7f58-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp3515a8bd-85d5-4014-b8f8-6b5abf8a7f58-415x250-IndiaHerald.jpgపైగా వైసీపీకి ఓటు వేయ‌లేద‌ని.. ఓ మంత్రి ఆదేశాల నేప‌థ్యంలో చాలా మంది పింఛ‌న్లు క‌ట్ అయ్యాయి. అదేస‌మ‌యంలో చేయూత ప‌థ‌కాన్ని కూడాచాలా మందికి నిలిపివేశారు.. దీంతో ఆయా వ‌ర్గాలు.. మ‌ళ్లీ టీడీపీ ఉంటే బాగుండేద‌ని అంటున్నాయి. అదేస‌మ‌యంలో ఎప్పుడూ స్వ‌చ్ఛ అవార్డు గెలుచుకున్న ఒంగోలు.. ఈద‌ఫా అవార్డు క‌నుస‌న్న‌ల్లో కూడా రాలేక పోయింది. దీనికి కూడా వైసీపీ నేత‌లే కార‌ణ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. అంటే.. ఇక్క‌డ దామ‌చ‌ర్ల వ‌ర్గం.. ఎలాంటి వ్య‌తిరేక ప్ర‌చారం చేయ‌క‌పోయినా.. వారికి అనుకూలంగా ఇక్క‌డి ప‌రిణామాలు మారుతుండ‌డTDP{#}Hanu Raghavapudi;TDP;YCP;Party;Minister;Districtటైం కోసం వెయిట్ చేస్తోన్న టీడీపీ అన్న‌ద‌మ్ములు ?టైం కోసం వెయిట్ చేస్తోన్న టీడీపీ అన్న‌ద‌మ్ములు ?TDP{#}Hanu Raghavapudi;TDP;YCP;Party;Minister;DistrictFri, 23 Jul 2021 11:55:00 GMTరాజ‌కీయాలు ఎప్పుడూ.. ఒకే విధంగా ఉండ‌వు. నిన్న హీరోలుగా చ‌లామ‌ణి అయిన వారు..నేడు జీరోలు కావొచ్చు. అయినంత మాత్రాన వారి హ‌వా త‌గ్గిపోయిన‌ట్టు కాదు.. ప్ర‌జ‌ల్లో వారి ఓటు బ్యాంకు క‌రిగిపోయిన‌ట్టు కూడా కాదు. స‌మ‌యం క‌లిసి రాలేదు.. అంతే. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో ఆలోచిస్తున్నారు.. ప్ర‌కాశం జిల్లాకు చెందిన దామ‌చ‌ర్ల సోద‌రులు. ఒంగోలు నుంచి 2014లో విజ‌యం ద‌క్కించుకున్న దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్‌, ఆయ‌న సోద‌రుడు స‌త్య‌లు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. టీడీపీ అధికారంలో ఉండ‌గా.. ప్ర‌కాశం జిల్లా ఇంచార్జ్‌గా కూడా ఉన్న జ‌నార్ద‌న్‌.. పార్టీని పరుగులు పెట్టించారు.

ఈ విష‌యంలో రెండో మాట కూడా లేదు. అనేక మంది కీల‌క నేత‌ల‌ను పార్టీలో చేర్పించి ..పార్టీ అభ్యున్న‌తికి కూడా కృషి చేశారు. ఈ క్ర‌మంలోనే ఒంగోలు న‌గ‌రానికి స్వ‌చ్ఛ అవార్డులు కేంద్ర‌స్తాయిలో ద‌క్కాయి. అయితే.. 2019 ఎన్నిక‌ల్లో దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్ ఓడిపోయారు. వైసీపీ సునామీ కార‌ణంగా.. పార్టీ ఓడిపోయింది. ఈ క్ర‌మంలో అప్ప‌టి నుంచి సైలెంట్‌గా ఉంటున్నారు. అయితే.. ప్ర‌జ‌ల్లో మాత్రం ఈ సోద‌రులవిష‌యంలో ఎలాంటి వివాదం లేదు. ఎందుకంటే.. వారు అధికారంలో ఉన్న‌ప్పుడు.. నియోజ‌క‌వ‌ర్గానికి చేసిన అభివృద్ధే ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. వైసీపీ త‌ర‌ఫున ఎంత‌మంది గెలిచినా.. ఇక్క‌డ అభివృద్ధి మాత్రం ప‌ట్ట‌డం లేదనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

పైగా వైసీపీకి ఓటు వేయ‌లేద‌ని.. ఓ మంత్రి ఆదేశాల నేప‌థ్యంలో చాలా మంది పింఛ‌న్లు క‌ట్ అయ్యాయి. అదేస‌మ‌యంలో చేయూత ప‌థ‌కాన్ని కూడాచాలా మందికి నిలిపివేశారు.. దీంతో ఆయా వ‌ర్గాలు.. మ‌ళ్లీ టీడీపీ ఉంటే బాగుండేద‌ని అంటున్నాయి. అదేస‌మ‌యంలో ఎప్పుడూ స్వ‌చ్ఛ అవార్డు గెలుచుకున్న ఒంగోలు.. ఈద‌ఫా అవార్డు క‌నుస‌న్న‌ల్లో కూడా రాలేక పోయింది. దీనికి కూడా వైసీపీ నేత‌లే కార‌ణ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. అంటే.. ఇక్క‌డ దామ‌చ‌ర్ల వ‌ర్గం.. ఎలాంటి వ్య‌తిరేక ప్ర‌చారం చేయ‌క‌పోయినా.. వారికి అనుకూలంగా ఇక్క‌డి ప‌రిణామాలు మారుతుండ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. పార్టీలో మాత్రం స్త‌బ్ద‌త కొనసాగుతోంది. కేడ‌ర్‌లో ఒకింత ధైర్యం నింపితే.. పుంజుకోవ‌డం పెద్ద క‌ష్టం కాద‌ని.. అంటున్నారు. పార్టీ అదినేత చంద్ర‌బాబు ఇస్తున్న పిలుపుతో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం ద్వారామ‌ళ్లీ అవ‌కాశం ద‌క్కించుకునే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. అయితే.. ఎన్నిక‌ల‌కుముందు కాకుండా.. ఇప్ప‌టి నుంచే పార్టీని లైన్‌లో పెట్టుకుంటే మంచి ద‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి.

అదేస‌మ‌యంలో యూత్‌ను కూడా గ‌తంలో మాదిరిగానే.. త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు చేయాల‌ని అంటున్నారు. మ‌రీ ముఖ్యంగా వైసీపీలో వినిపిస్తున్న ఆధిప‌త్య రాజ‌కీయాలు టీడీపీకి మేలు చేస్తాయ‌ని... దీనిని అందిపుచ్చుకోవాల‌ని సూచ‌న‌లు వ‌స్తున్నాయి. కానీ, వీటిని మాత్రం దామ‌చ‌ర్ల సోద‌రులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. స‌మ‌యం కోసం వేచి చూస్తున్నార‌ని టాక్ ప్ర‌బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.





వారిపై పెగాసస్ టార్గెట్..?

ప్రజలపై మోదీ 'పెట్రో' భారం తగ్గేనా ?

ప్ర‌కాశం టీడీపీలో దామ‌చ‌ర్ల సోద‌రుల సైలెంట్ ?

వివేకా మర్డర్ కేసులో ఏం జరుగుతుంది...?

ఢిల్లీ: నేడు పార్ల‌మెంట్‌లో కొన‌సాగ‌నున్న వైసీపీ ఎంపీల ఆందోళ‌న‌. లోక్‌స‌భ‌లో పోల‌వ‌రంపై వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిన వంగా గీత‌. పోల‌వ‌రం ప్రాజెక్టుకు స‌వ‌రించిన అంచ‌నాల మేర‌కు ఆమోదం తెల‌పాల‌ని రాజ్య‌స‌భ‌లో వాయిదా తీర్మానానికి నోటీసులు ఇచ్చిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.

బలిపీఠంపై యడ్డీ బ్రతుకు చిత్రం!

కూలిన శిథిలాలపై రాజకీయ పునాదులు!

బాబాయ్ విమర్శలపై.. అబ్బాయ్‌ నిప్పులు..?

నిరుద్యోగుల కోసం.. జగన్ కొత్త స్కీమ్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>