PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp75c8e7f3-2d84-4ebb-94e2-d48d51aaa04c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp75c8e7f3-2d84-4ebb-94e2-d48d51aaa04c-415x250-IndiaHerald.jpgక‌ర్ణాట‌క‌లో ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప నాయ‌క‌త్వాన్ని మార్చ‌లంటూ గ‌త కొన్ని రోజులుగా డిమాండ్ జ‌రుగుతోంది. ఇదే క్ర‌మంలో బీజేపీ అధిష్టానం ఆ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. య‌డ్యూర‌ప్ప త‌న కొడుకుతో పాటు ఇటీవ‌ల ఢిల్లీకి వెళ్లిన విష‌యం తెలిసిందే. దీంతో క‌ర్ణాట‌క రాజకీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ గ‌త కొంత కాలంగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదే క్ర‌మంలో ప్ర‌స్తుత క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి య‌డ్డీ రాజీనామా చేయ‌బోతున్న‌ట్టు.. దీనిపై ఆ పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వ‌చ్చిbjp{#}రాజీనామా;Amit Shah;Bharatiya Janata Party;Party;CM;Telangana Chief Minister;Prime Ministerజూలై 26 త‌రువాత య‌డ్డి రాజీనామా..?జూలై 26 త‌రువాత య‌డ్డి రాజీనామా..?bjp{#}రాజీనామా;Amit Shah;Bharatiya Janata Party;Party;CM;Telangana Chief Minister;Prime MinisterFri, 23 Jul 2021 07:07:00 GMT క‌ర్ణాట‌క‌లో ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప నాయ‌క‌త్వాన్ని మార్చ‌లంటూ గ‌త కొన్ని రోజులుగా డిమాండ్ జ‌రుగుతోంది. ఇదే క్ర‌మంలో బీజేపీ అధిష్టానం ఆ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. య‌డ్యూర‌ప్ప త‌న కొడుకుతో పాటు ఇటీవ‌ల ఢిల్లీకి వెళ్లిన విష‌యం తెలిసిందే. దీంతో క‌ర్ణాట‌క రాజకీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ గ‌త కొంత కాలంగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదే క్ర‌మంలో ప్ర‌స్తుత క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి య‌డ్డీ రాజీనామా చేయ‌బోతున్న‌ట్టు.. దీనిపై ఆ పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వ‌చ్చిన‌ట్టు ఊహాగానాలు వచ్చాయి.

   ఈ నేప‌థ్యంలో య‌డ్యూర‌ప్ప సామాజిక వ‌ర్గం అయిన లింగాయ‌త్ వ‌ర్గానికి చెందిన నేత‌లు, స‌న్యాసులు స్పందిస్తూ య‌డ్డీ రాజీనామా చేస్తే తీవ్ర‌ప‌రిణామాలు ఉంటాయ‌ని చేసిన తీవ్ర వ్యాఖ్య‌ల‌ను చూస్తే ఈ విస‌యం అర్థ‌మ‌వుతోంది. ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయ‌బోతున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌ను య‌డ్డీ ఖండిస్తూ వ‌చ్చారు. ఇప్పుడు తాజాగా జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో రాజీనామా అంశ‌పై ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చారు య‌డ్యూర‌ప్ప‌.


ఒకవేళ పార్టీ అధిష్టానం కోరుకుంటే తాను పదవి నుంచి తప్పుకుని పార్టీ కోసం పని చేస్తానని య‌డ్డీ వ్యాఖ్యానించారు. ఇదే క్ర‌మంలో ఇత‌రుల ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ఎవరి పేరును పార్టీ అధిష్టానానికి సూచించలేదని య‌డ్డీ అన్నారు. పార్టీ అధిష్టానం తనకు ఏమీ చెప్పలేదని తెలిపారు పేర్కొన్నారు. అయితే జులై 26 తరువాత ఏం జరుగ‌బోతుందో వేచి చూడాల‌ని య‌డ్డీ వ్యాఖ్యానించ‌డంతో.. ఊహాగానాల‌కు బ‌లం చేకూరింది. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాకు తన పట్ల ప్రేమ, నమ్మకం ఉంది అని  య‌డ్డీ అన్నారు.75 ఏళ్లు దాటిన వారికి  బీజేపీలో ఎలాంటి పదవి ఇవ్వరని.. కానీ తన ప‌ని తీరు న‌చ్చ‌డంతో 78 ఏళ్లు ఉన్న తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని తెలిపారు.

   పార్టీని పటిష్టం చేసి మళ్లీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చేలా చేయాలని ఆశ‌గా ఉందని యడ్డి అన్నారు. జులై 25న అధిష్టానం తనకు చేసే సూచనలను బట్టి 26 నుంచి తన పని మొదలవుతుందని యడియూరప్ప అన్నారు. ఆ రోజు తాను సీఎం పదవి చేపట్టి రెండేళ్లు పూర్తవుతుందన్నారు.  అదే రోజు ఓ ప్రత్యేక కార్యక్రమం ఉందని య‌డ్డీ తెలిపారు. ఆ కార్యక్రమం పూర్తయిన తరువాత పార్టీ జాతీయ అధ‌క్షుడు నుంచే వ‌చ్చే సూచనలకు తగ్గట్టుగా నడుచుకుంటానని ఆయ‌న స్పష్టం చేశారు.



ఈ నెల 26న మరో స్కెచ్ వేసిన కేసీఆర్?

నీట మునిగిన ఇళ్ల స్థలాలు.. జగన్ ఇప్పుడేంచేస్తారు..?

కరోనా ఫెయిల్యూర్ : వాళ్లలాగే మోడీ కూడా సారీ చెప్తారా..?

మహారాష్ట్రాను వెంటాడుతున్న వరద కష్టాలు

నిర్మల్‌ను ముంచెత్తిన వరద

షాకింగ్ న్యూస్.. ఐదేళ్లపాటు ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్ శాలరీ..

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రవికి బ్రహ్మానందరెడ్డి చెక్ పెట్టడం కష్టమేనా?

ఆ జిల్లాల్లో జగన్‌కు 2014 సీన్ రిపీట్ అవుతుందా?

ఆలీ, పోసానిలకు జగన్ సెట్ చేస్తారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>