PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/atm-blastb42e6148-5978-4715-9b4a-7813de5f4d89-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/atm-blastb42e6148-5978-4715-9b4a-7813de5f4d89-415x250-IndiaHerald.jpgదొంగ‌లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. మాములుగా అయితే దొంగ‌లు ఏటిఎంల‌న రాడ్‌ల‌తోనో ప‌గుల‌గొడుతారు లేకుంటే ఎత్తుకెళ్తారు.. కానీ మ‌హార‌ష్ట్ర పుణేలోని ఓ ఏటిఎం ఏకంగా బాంబులు పెట్టి పేల్చేసారు. అందులోని రూ.25 ల‌క్ష‌ల‌కు పైగా న‌గ‌దును ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బుధ‌వారం తెల్ల‌వారు జామున చ‌కాన్ ప్రాంతంలోని ఏటీఎం ద‌గ్గ‌ర పేలుళ్ల‌కు పాల్ప‌డ్డారు ఇద్ద‌రు దొంగ‌లు. ఏటిఎం మెషిన్‌ను పేల్చి దాదాపు 28 నుంచి 30 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు న‌గ‌దును ఎత్తుకెళ్లార‌ని పింప్రీ చించ్వాడ్ పోలీసులు వివ‌రatm blast{#}Traffic police;policeరెచ్చిపోయిన దొంగ‌లు.. ఏకంగా ఏటీఎంను పేల్చేసి మ‌రి..?రెచ్చిపోయిన దొంగ‌లు.. ఏకంగా ఏటీఎంను పేల్చేసి మ‌రి..?atm blast{#}Traffic police;policeFri, 23 Jul 2021 08:57:30 GMT దొంగ‌లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. మాములుగా అయితే దొంగ‌లు ఏటిఎంల‌న రాడ్‌ల‌తోనో ప‌గుల‌గొడుతారు లేకుంటే ఎత్తుకెళ్తారు.. కానీ మ‌హార‌ష్ట్ర పుణేలోని ఓ ఏటిఎం ఏకంగా బాంబులు పెట్టి పేల్చేసారు. అందులోని రూ.25 ల‌క్ష‌ల‌కు పైగా న‌గ‌దును ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బుధ‌వారం తెల్ల‌వారు జామున చ‌కాన్ ప్రాంతంలోని ఏటీఎం ద‌గ్గ‌ర పేలుళ్ల‌కు పాల్ప‌డ్డారు ఇద్ద‌రు దొంగ‌లు. ఏటిఎం మెషిన్‌ను పేల్చి దాదాపు 28 నుంచి 30 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు న‌గ‌దును ఎత్తుకెళ్లార‌ని పింప్రీ చించ్వాడ్ పోలీసులు వివ‌రించారు.

  ఈ దొంగ‌త‌నం గురించి స‌మాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటినా ఏటిఎం వ‌ద్ద‌కు చేరుకుని ప‌రిశీలించారు. ద‌ర్యాప్తు ను ప్రారంభించిన పోలీసులు ఏటిఎం పేలుళ్ల‌కు ఎలాంటి పేలుడు పదార్థాలు వినియోగించారో తెలుసుకోడానికి నమూనాలను సేకరించారు. పేలుడుకు టీఎన్‌టీ డిటోనేటర్లు, జిలెటిన్‌ స్టిక్స్‌ లేదా ఇత‌ర పేలుడు పదార్థాలు ఉపయోగించారా అనే విష‌యం ఇంకా నిర్ధారణ కాలేదు. సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించిన పోలీసులు ఇద్ద‌రు దుండ‌గులు ఉన్న‌ట్టు గుర్తించామ‌ని తెలిపారు. స‌మ‌యం లేక‌పోవ‌డంతో రూ.10ల‌క్ష‌ల‌ను అక్క‌డే వ‌దిలి వెళ్లిపోయిన‌ట్టు చెప్పారు.
 
 ఏటిఎంను తెర‌వ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న క్ర‌మంలో స‌మీపంలో ఉన్న ఓ ఇంటి య‌జ‌మాని చూశాడ‌ని.. త‌రువాత ఏటిఏం పేల్చేశార‌ని చెప్పారు. పేలుడు అనంత‌రం అక్క‌డ‌కు వెళ్లిన ఆ వ్య‌క్తిని కాల్చేస్తామ‌ని బెదిరించ‌డంతో ఆయ‌న భ‌య‌ప‌డి అక్క‌డి నుంచి వెళ్లిపోయి.. 15 నిమిషాల త‌రువాత త‌మ‌కు స‌మాచ‌రం అందించాడ‌ని పోలీస‌లు వివ‌రించారు.  మొద‌ట‌గా ఏటీఎంను ప‌గుల‌గొట్టి చోరి చేయాల‌ని దొంగ‌లు ప్ర‌య‌త్నించారని అది ఎంత‌కి తెరుచుకోక‌పోవ‌డంతో పేల్చివేసి ఉంటార‌ని అనుమానం వ్య‌క్తం చేశారు.
 
 ముందు ఏటీఎంకు బాంబులు అమ‌ర్చిన దొంగ‌లు.. అది పేలిన అనంత‌రం డ‌బ్బుల‌ను దొంగ‌లించారు. దీనిపై ఏటిఎం నిర్వ‌హ‌ణ సంస్థ స్పందిస్తూ.. ఏటీఎంలో చివరి సారిగా రూ.25 లక్షలు లోడ్ చేసినట్టు దీని నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రయివేట్ సంస్థ వివ‌రించింది. చివరి లావాదేవీల తర్వాత నగదు నిల్వలపై స్టేట్‌మెంట్‌ను తీసుకున్నామ‌ని.. అయితే, ఏటీఎం సెంట‌ర్ లోపల సీసీటీవీని ఏర్పాటు చేయలేద‌ని తెలిపింది. ఈ ఘ‌ట‌నలో దొంగ‌లు ఎటువంటి పేలుడు పదార్థాలను వినియోగించారో గుర్తించే ప్రక్రయ కొనసాగుతోంది అని పోలీస్ అధికారి దశరథ్ వాఘ్‌మోడ్ తెలిపారు.



నిర్మల్‌ను ముంచెత్తిన వరద

షాకింగ్ న్యూస్.. ఐదేళ్లపాటు ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్ శాలరీ..

షాకింగ్‌: అశోక్‌గజపతి రాజుపై కేసు నమోదు..?

పోలీసులకి లంచం ఇచ్చి తప్పించుకోవాలనుకున్న రాజ్ కుంద్రా...

శిల్పాశెట్టి భర్త పాపం ఒట్టి అమాయకుడట..

RRR సినిమాలో ఎన్టీఆర్ ముస్లిం టోపీ వెనుక కారణం అదేనా?

రాజ్ కుంద్రా అరెస్ట్ కు ముందు శిల్పాశెట్టి పోస్ట్... అందులో ఏముందంటే ?

రాజ్ గలీజ్ లీలలు..అందుకే బట్టలు విప్పానంటున్న మోడల్.. !

ఫైట్ ఫ‌ర్ రైట్ : జ‌గ‌న్ స‌ర్ త‌ప్పు చేస్తున్నారు??? మీరు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>