MoviesGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tag7eca9ddb-0606-4a89-8da0-2fec7094020f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tag7eca9ddb-0606-4a89-8da0-2fec7094020f-415x250-IndiaHerald.jpg భారీ బ‌డ్జెట్‌తో తీసే కొన్ని హాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఊహించ‌నిరీతిలో క్రేజ్ వస్తుంటుంది. స్థానికంగా ఉండే సూప‌ర్ హీరోల సినిమాల‌కు ధీటుగా అవి ధియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతుంటాయి. క‌లెక్ష‌న్లు కూడా దుమ్మురేపేలా ఉంటాయి. రెండు సంవ‌త్స‌రాల కింద‌ట ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ మ‌న‌దేశంలో ఎంత కొల్ల‌గొట్టిందో అంద‌రికీ తెలిసిందే. దీని తర్వాత అంత క్రేజ్ సంపాదించుకున్న హాలీవుడ్ మూవీ ఏదంటే.. ‘గాడ్జిల్లా వెర్సస్ కాంగ్’. tag{#}March;king;King;Chitram;Amazon;House;Hollywood;Hindi;Cinema;Indiansఅమెజాన్ ప్రైమ్‌లో మీరు ఊహించ‌ని సినిమా?అమెజాన్ ప్రైమ్‌లో మీరు ఊహించ‌ని సినిమా?tag{#}March;king;King;Chitram;Amazon;House;Hollywood;Hindi;Cinema;IndiansFri, 23 Jul 2021 16:27:57 GMT
భారీ బ‌డ్జెట్‌తో తీసే కొన్ని హాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఊహించ‌నిరీతిలో క్రేజ్ వస్తుంటుంది. స్థానికంగా ఉండే సూప‌ర్ హీరోల సినిమాల‌కు ధీటుగా అవి ధియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతుంటాయి. క‌లెక్ష‌న్లు కూడా దుమ్మురేపేలా ఉంటాయి. రెండు సంవ‌త్స‌రాల కింద‌ట ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ మ‌న‌దేశంలో ఎంత కొల్ల‌గొట్టిందో అంద‌రికీ తెలిసిందే. దీని తర్వాత అంత క్రేజ్ సంపాదించుకున్న హాలీవుడ్ మూవీ ఏదంటే.. ‘గాడ్జిల్లా వెర్సస్ కాంగ్’.

మార్చి 24న విడుద‌లైంది
ఈ ఏడాది మార్చి 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు భారతీయులు బ్ర‌హ్మరథం పట్టారు. పెద్ద న‌గ‌రాల్లోని మల్టీప్లెక్సుల్లో హౌస్ ఫుల్స్ క‌లెక్ష‌న్ల‌తో ఈ సినిమా బ్ర‌హ్మాండంగా ఆడింది. ధియేట‌ర్ల‌లో కూడా బాగానే వ‌సూలు చేసింది. ‘గాడ్జిల్లా వెర్సస్ కాంగ్’ను థియేటర్లలో చూడ‌లేక‌పోయిన‌వారు చాలామంది డిజిటల్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఆగస్టు 14వ తేదీన ‘గాడ్జిల్లా వెర్సస్ కాంగ్’ను భార‌త్‌లో విడుద‌ల చేయ‌బోతోంది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి తెస్తున్నారు. ఒక‌ర‌కంగా ఇది ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకు శుభ‌వార్తే అన‌డంలో ఏమాత్రం అతిశ‌యోక్తి లేదు. ఈ చిత్రంపై ఉన్న భారీ అంచనాల నేప‌థ్యంలో పే పర్ వ్యూ పద్ధతిలో విడుద‌ల చేస్తార‌న్నారు. ఇప్ప‌టికే ధియేట‌ర్ల‌లో విడుద‌లై ఐదునెల‌లు కావ‌డంతో ఆ ప‌ద్ధ‌తి బాగోద‌ని అమెజాన్ ప్రైమ్ భావించింది.

యాక్ష‌న్ ఘ‌ట్టాలు న‌భూతో న‌భ‌విష్య‌త్‌
గాడ్జిల్లా, కింగ్ కాంగ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఇవి రెండూ ఒకదాంతో ఒకటి హోరాహోరీగా త‌ల‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ‘గాడ్జిల్లా వెర్సస్ కాంగ్’ పై ప్రేక్షకుల్లో ఆస‌క్తి అలాగే ఉంది. ఎందుకంటే ఈ సినిమా ద్వితీయ భాగంలోని  యాక్షన్ ఘట్టాలు నభూతో నభవిష్యత్ అంటూ సినీ విమ‌ర్శ‌కులు కూడా కొనియాడారు. వెండితెర‌పై ఒక వెలుగు వెలిగిన ఈ చిత్రం బుల్లితెర‌పై కూడా అలాగే వెలుగుతుంద‌ని భావిస్తున్నారు.





బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీ!

2020 రియల్ సంక్రాంతి విన్నర్ ఎవరో తెల్చేసిన మహేష్ రికార్డు...

'బిచ్చగాడు' సీక్వెల్... సర్ప్రైజ్ ఇస్తున్న మురుగదాస్ ?

ఈ 5 వార్ మూవీస్ ను అస్సలు మిస్ కావొద్దు...!

కార్తీక దీపం సౌందర్య నటిస్తున్న తెలుగు సినిమాలు ఇవే !

2020 లో హైయెస్ట్ గ్రోసర్స్ గా నిలిచిన ఇండియన్ సినిమాలు ఇవే...

చైతు సక్సెస్ ఫామ్.. వెనుక ఉన్న సీక్రెట్ వ్యక్తి ఎవరంటే..!

విశాఖప‌ట్నం ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడం ఖాయమని కేంద్రం స్ప‌ష్టం చేయ‌డంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు స్పందించారు. విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ నేత‌ల‌కు ఆయ‌న లేఖ‌లు రాశారు. ఉద్య‌మానికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నేతృత్వం వ‌హించాల‌ని, ఆయ‌న ముందుండి పోరాటం చేయాల‌ని కోరారు. అంద‌రూ ఐక్యంగా ఉండి పోరాడితేనే ఉక్కు క‌ర్మాగారాన్ని ప్ర‌యివేటీక‌ర‌ణ బారినుంచి ర‌క్షించుకోగ‌ల‌మ‌ని చంద్ర‌బాబు అన్నారు. విశాఖ ఉక్కు క‌ర్మాగారం పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి తెలుగుదేశం త‌ర‌ఫున సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్టు ప్ర‌క‌టించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో క‌ర్మాగారం సాధించుకున్నామ‌ని, ఎన్నెన్నో అడ్డంకులు, అవాంత‌రాల‌ను అధిగ‌మించి జాతికి అంకితం చేశామ‌న్నారు. తాము ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో 2000 సంవ‌త్స‌రంలో కేంద్రం ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు మొగ్గుచూపింద‌ని, తాను విజ్ఞ‌ప్తి చేయ‌డంతో ప్యాకేజీ ఇచ్చి ఆ ప్ర‌తిపాద‌న‌ను విర‌మించుకున్నార‌ని బాబు తెలిపారు.

విశాఖ ఉక్కు కోసం జ‌గ‌న్ పోరుబాట‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>