MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/5-highly-anticipated-war-films-85455510-0732-4e00-a528-bf762b3c3838-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/5-highly-anticipated-war-films-85455510-0732-4e00-a528-bf762b3c3838-415x250-IndiaHerald.jpgమహమ్మారి కారణంగా చాలా సినిమాల విడుదల ఆలస్యం అయినప్పటికీ ఈ సంవత్సరం సినీ ప్రేమికులు పండగ చేసుకునే సినిమాలు వరుసగా లైన్ లో ఉన్నాయి. యుద్ధ నేపథ్యంలో యాక్షన్ ప్రియులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాయి. అయితే అందులో కొన్ని ఓటిటిలో రిలీజ్ కానున్నాయి. మరి కొన్ని మాత్రం థియేటర్లలో ప్రేక్షకులను పలకరించడానికి ఎదురు చూస్తున్నాయి. మీరు యాక్షన్-ప్యాక్డ్, దేశభక్తిని ప్రేరేపించే చలన చిత్రాల కోసం చూస్తున్నట్లయితే ఈ ఏడాది రానున్న 5 సినిమాలను మాత్రం ఖచ్చితంగా మిస్ కావొద్దు. రాబోయే 5 వార్ చిత్రాలు మీ మనసులను థ్రిల5 Highly Anticipated War Films;{#}Jayanthi;Kiara Advani;Meghna Gulzar;Priyadarshan;Sonakshi Sinha;Vicky Kaushal;abhishek;ajay;editor mohan;November;Sunil Shetty;sam;Sam Mendes;Arjun;commander;Samantha;war;Army;Joseph Vijay;lion;Lion;vikram;Chitram;Amazon;Cinema;Augustఈ 5 వార్ మూవీస్ ను అస్సలు మిస్ కావొద్దు...!ఈ 5 వార్ మూవీస్ ను అస్సలు మిస్ కావొద్దు...!5 Highly Anticipated War Films;{#}Jayanthi;Kiara Advani;Meghna Gulzar;Priyadarshan;Sonakshi Sinha;Vicky Kaushal;abhishek;ajay;editor mohan;November;Sunil Shetty;sam;Sam Mendes;Arjun;commander;Samantha;war;Army;Joseph Vijay;lion;Lion;vikram;Chitram;Amazon;Cinema;AugustFri, 23 Jul 2021 19:00:00 GMTమహమ్మారి కారణంగా చాలా సినిమాల విడుదల ఆలస్యం అయినప్పటికీ ఈ సంవత్సరం సినీ ప్రేమికులు పండగ చేసుకునే సినిమాలు వరుసగా లైన్ లో ఉన్నాయి. యుద్ధ నేపథ్యంలో యాక్షన్ ప్రియులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాయి. అయితే అందులో కొన్ని ఓటిటిలో రిలీజ్ కానున్నాయి. మరి కొన్ని మాత్రం థియేటర్లలో ప్రేక్షకులను పలకరించడానికి ఎదురు చూస్తున్నాయి. మీరు యాక్షన్-ప్యాక్డ్, దేశభక్తిని ప్రేరేపించే చలన చిత్రాల కోసం చూస్తున్నట్లయితే ఈ ఏడాది రానున్న 5 సినిమాలను మాత్రం ఖచ్చితంగా మిస్ కావొద్దు. రాబోయే 5 వార్ చిత్రాలు మీ మనసులను థ్రిల్లింగ్ తో, దేశభక్తితో నింపేయడానికి సిద్ధంగా ఉన్నాయ్. అవి ఏంటంటే...

షేర్షా
సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ నటించిన చిత్రం "షేర్షా". పరమ వీర చక్ర అవార్డు గ్రహీత ఆర్మీ కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ చిత్రం ఆగస్టు 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. విష్ణువర్ధన్ దర్శకత్వం వహించారు.

సామ్ బహదూర్
మేఘనా గుల్జార్ తెరకెక్కిస్తున్న రియల్ వార్ హీరో సామ్ మానేక్షా బయోపిక్ "సామ్ బహదూర్". విక్కీ కౌషల్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా సైనిక వృత్తి నాలుగు దశాబ్దాల్లో ఐదు యుద్ధాలతో సాగింది. 1971 ఇండో-పాక్ యుద్ధంలో మొదటి భారత సైన్యాన్ని విజయం వైపు నడిపించాడు.ఆయన జయంతి సందర్భంగా ఫీల్డ్ మార్షల్‌కు నివాళిగా ఈ చిత్రం రూపొందుతోంది.

భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా
స్క్వాడ్రన్ నాయకుడు విజయ్ కర్నిక్ నాయకత్వంలో ఐఎఎఫ్ ఎయిర్‌బేస్‌ను పునర్నిర్మించిన గుజరాత్‌కు చెందిన 300 మంది మహిళల కథను ఈ చిత్రం వివరిస్తుంది. అజయ్ దేవ్‌గన్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా తదితరులు ఈ చిత్రంలో నటించారు. అభిషేక్ దుధయ్య దర్శకత్వం వహించారు. ఆగష్టు 11న ఈ చిత్రం రిలీజ్ కానుంది.

 
మరక్కర్: అరబికడలింటే సింహాం
మరో యుద్ధ చిత్రం "మరక్కర్: అరబికడాలింటే సింహం" తెలుగులో "మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియా సముద్రం". 16వ శతాబ్దంలో పోర్చుగీస్ దండయాత్రకు వ్యతిరేకంగా మలబార్ తీరాన్ని రక్షించిన ప్రసిద్ధ నావికాదళ కమాండర్ కుంజలి మరక్కర్ కథను చెబుతుంది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ మలయాళ చిత్రంలో సౌత్ సూపర్ స్టార్స్ మోహన్ లాల్, అర్జున్ సర్జా, సునీల్ శెట్టి తదితరులు నటించారు. ఇది ఆగస్టు 12న థియేట్రికల్ రిలీజ్ కానుంది.

తేజస్
కంగనా రనౌత్ నటించిన "తేజస్" భారతీయ వైమానిక దళ పైలట్ల కథను చెప్పే చిత్రం. ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సింది. కానీ మహమ్మారి కారణంగా ఆలస్యం అయింది. ఈ ఏడాది నవంబర్ 19న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది.



బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీ!

2020 రియల్ సంక్రాంతి విన్నర్ ఎవరో తెల్చేసిన మహేష్ రికార్డు...

'బిచ్చగాడు' సీక్వెల్... సర్ప్రైజ్ ఇస్తున్న మురుగదాస్ ?

కార్తీక దీపం సౌందర్య నటిస్తున్న తెలుగు సినిమాలు ఇవే !

2020 లో హైయెస్ట్ గ్రోసర్స్ గా నిలిచిన ఇండియన్ సినిమాలు ఇవే...

చైతు సక్సెస్ ఫామ్.. వెనుక ఉన్న సీక్రెట్ వ్యక్తి ఎవరంటే..!

బాలయ్య తేడా కథ వర్కౌట్ అవుతుందా!!

వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.. దీనికోసమో తెలుసా?

రికార్డుల రారాజుగా మహేష్.. సౌత్ ఇండియా తరపున మొదటి హీరో..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>