PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-d4163bdb-6645-4cc1-821f-bef3ee30f3cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-d4163bdb-6645-4cc1-821f-bef3ee30f3cf-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకోస్తానని, ఇక్కడ ప్రజలకు అండగా ఉండటానికే పార్టీ పెడుతున్న అని చెప్పి దివంగత వైఎస్సార్ తనయురాలు షర్మిల, వైఎస్సార్ తెలంగాణ పేరిట పార్టీ పెట్టి రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. కొత్తగా పార్టీ పెట్టిన ఏ మాత్రం తడబాటు లేకుండా చాలా కాన్ఫిడెంట్‌గా రాజకీయాలు చేస్తూ, అధికార టీఆర్ఎస్‌పై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. అటు కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడుతూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. sharmila{#}Khammam;Sharmila;Scheduled Tribes;politics;YCP;Y. S. Rajasekhara Reddy;Jagan;MP;Party;Assemblyషర్మిల పోటీ చేసేది అక్కడేనా...ఆ సీటు ఫిక్స్ అవుతుందా?షర్మిల పోటీ చేసేది అక్కడేనా...ఆ సీటు ఫిక్స్ అవుతుందా?sharmila{#}Khammam;Sharmila;Scheduled Tribes;politics;YCP;Y. S. Rajasekhara Reddy;Jagan;MP;Party;AssemblyFri, 23 Jul 2021 02:00:00 GMTతెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకోస్తానని, ఇక్కడ ప్రజలకు అండగా ఉండటానికే పార్టీ పెడుతున్న అని చెప్పి దివంగత వైఎస్సార్ తనయురాలు షర్మిల, వైఎస్సార్ తెలంగాణ పేరిట పార్టీ పెట్టి రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. కొత్తగా పార్టీ పెట్టిన ఏ మాత్రం తడబాటు లేకుండా చాలా కాన్ఫిడెంట్‌గా రాజకీయాలు చేస్తూ, అధికార టీఆర్ఎస్‌పై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. అటు కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడుతూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.

నిదానంగా పార్టీని కూడా బలోపేతం చేయడమే లక్ష్యంగా షర్మిల ముందుకెళుతూ, నియోజకవర్గాల వారీగా బలమైన నాయకులని తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అలాగే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలని ఏర్పాటు చేస్తున్నారు. ఇలా పార్టీని ఇప్పటినుంచే బలోపేతం చేసుకుంటూ వెళుతూ, నెక్స్ట్ ఎన్నికల్లో సత్తా చాటాలని షర్మిల చూస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే పార్టీ సంగతి పక్కనబెడితే నెక్స్ట్ ఎన్నికల్లో షర్మిల ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో వైఎస్సార్ అభిమానులు, రెడ్డి, దళిత ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోనే షర్మిల బరిలో దిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇదే సమయంలో 2014లో జగన్ పార్టీ వైసీపీ గెలిచిన ఖమ్మం జిల్లాలో షర్మిల పోటీ చేయొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2014 ఎన్నికల్లో తెలంగాణలో వైసీపీ మూడు అసెంబ్లీ, ఒక ఎంపీ సీటు గెలుచుకుంది. అవి కూడా ఖమ్మం జిల్లాలోనే. ఖమ్మం పార్లమెంట్, పినపాక, అశ్వరావుపేట, వైరా నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది. అయితే ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వడ్ కావడంతో వీటిల్లో పోటీ చేయడానికి కుదరదు. కానీ ఖమ్మం జిల్లాలో తనకు అనువైన నియోజకవర్గంలో షర్మిల పోటీ ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అలాగే నల్గొండలో కూడా వైఎస్సార్ అభిమానులు ఎక్కువ. ఆ జిల్లాలో అయినా షర్మిల పోటీకి దిగొచ్చని తెలుస్తోంది. చూడాలి మరి షర్మిల ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది.



రేవంత్ స్పీడుకు బ్రేక్...రివర్స్ షాక్ తప్పదా!

ఆ టీడీపీ వారసులకు సెకండ్ ఛాన్స్ కూడా కష్టమేనా!

రాముడే గెలిచాడు : తెలుగు యువ‌తకు ద‌ళ‌ప‌తి అత‌డే...

షాకింగ్‌: అశోక్‌గజపతి రాజుపై కేసు నమోదు..?

బీజేపీ బీజియ‌మ్ : పోల‌వ‌రంపై ప్రేమ

ప్రొబేషనరీ కావాలంటే పరీక్ష పాస్ అవ్వాల్సిందే

తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకోస్తానని, ఇక్కడ ప్రజలకు అండగా ఉండటానికే పార్టీ పెడుతున్న అని చెప్పి దివంగత వైఎస్సార్ తనయురాలు షర్మిల, వైఎస్సార్ తెలంగాణ పేరిట పార్టీ పెట్టి రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. కొత్తగా పార్టీ పెట్టిన ఏ మాత్రం తడబాటు లేకుండా చాలా కాన్ఫిడెంట్‌గా రాజకీయాలు చేస్తూ, అధికార టీఆర్ఎస్‌పై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. అటు కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడుతూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.

అధికార పార్టీలో ఉంటే నాయకులకు ఏదొక పదవి తప్పనిసరిగా వస్తుందనే చెప్పొచ్చు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో నాయకులకు పదవుల పంపకాలు జరుగుతాయి. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో అదే కార్యక్రమం జరుగుతుంది. జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వైసీపీ నేతలకు పదవుల పండగ నడుస్తోంది. ఇటీవల కూడా నామినేటెడ్ పదవులని భర్తీ చేశారు. పలు కార్పొరేషన్‌లకు ఛైర్మన్‌లని నియమించారు.

కాంగ్రెస్ నుంచి బయటకొచ్చాక వైసీపీ పెట్టిన జగన్‌పై జనాలకు భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఊహించని విధంగా 2012 ఉపఎన్నికల్లో సత్తా చాటిన జగన్, 2014లో గెలిచి అధికారంలోకి వచ్చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఊహించని పరిణామాల మధ్య రాష్ట్రం విడిపోవడం, రాజధాని లేని ఏపీకి సీనియర్ నాయకుడు చంద్రబాబు సీఎం అయితేనే బాగుంటుందని చెప్పి ప్రజలు టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>