PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/hujurabadh-by-elections7ac77f62-e67c-45cf-b931-5d46594f6246-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/hujurabadh-by-elections7ac77f62-e67c-45cf-b931-5d46594f6246-415x250-IndiaHerald.jpgతెలంగాణ ఎంతోమంది అమరులను సాధించుకున్న బంగరు భూమి. నేడు కేసీఆర్ అధ్యక్షతన అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అధికార పార్టీ నాయకులు డప్పు కొడుతుంటే ? మరో వైపు విపక్షాలు అన్నీ మూకుమ్మడిగా కేసీఆర్ నాయకత్వాన్ని ఎండగడుతున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగా, ప్రస్తుతం అందరి దృష్టి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో ఖాళీ అయిన హుజురాబాద్ నియోజకవర్గంలో అతి త్వరలోనే ఉప ఎన్నిక మీదనే నెలకొంది. HUJURABADH-BY-ELECTIONS{#}Petrol;Eatala Rajendar;kaushik;రాజీనామా;Huzurabad;Congress;Press;Assembly;KCR;Bharatiya Janata Party;MP;Reddy;central government;Coronavirus;Telangana;Telangana Rashtra Samithi TRS;Partyహుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలుపు కష్టమే ?హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలుపు కష్టమే ?HUJURABADH-BY-ELECTIONS{#}Petrol;Eatala Rajendar;kaushik;రాజీనామా;Huzurabad;Congress;Press;Assembly;KCR;Bharatiya Janata Party;MP;Reddy;central government;Coronavirus;Telangana;Telangana Rashtra Samithi TRS;PartyThu, 22 Jul 2021 20:11:42 GMTతెలంగాణ ఎంతోమంది అమరులను సాధించుకున్న బంగరు భూమి. నేడు కేసీఆర్ అధ్యక్షతన అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అధికార పార్టీ నాయకులు డప్పు కొడుతుంటే ? మరో వైపు విపక్షాలు అన్నీ మూకుమ్మడిగా కేసీఆర్ నాయకత్వాన్ని ఎండగడుతున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగా, ప్రస్తుతం అందరి దృష్టి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో ఖాళీ అయిన హుజురాబాద్ నియోజకవర్గంలో అతి త్వరలోనే ఉప ఎన్నిక మీదనే నెలకొంది. ఇప్పుడు ఈ స్థానంపై త్రిముఖ పోరు జరగనుంది. ఇప్పటికే ఈటల రాజేందర్ కేసీఆర్ పై పంతం నెగ్గించుకునేందుకు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మరో వైపు ఈ మధ్యనే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయిన ఎంపీ రేవంత్ రెడ్డి ని తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. దీనితో ప్రధానంగా పోటీ బీజేపీ మరియు తెరాసల మధ్యనే ఉండనుంది. అయితే ఇప్పటికే హుజురాబాద్ గెలుపుపై ఎవరికి వారు మేమంటే మేమే గెలుస్తాం అని సవాల్ ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న ప్రకారం తెరాస ఖచ్చితంగా హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుస్తుందని రాజకీయ వర్గాలు అనుకుంటున్న మాట. 
అయితే ఈటల రాజేందర్ కు మంచి పేరు, అభిమానం ఉన్న మాట వాస్తవమే అయినా, అధికార పార్టీపై గెలవడం సవాలుతో కూడుకున్న విషయమే. ఇక్కడ తెరాస అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి నిలబడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇటీవలే కాంగ్రెస్ నుండి తెరాస లోకి జంప్ చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రెస్ మీట్ లో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఈటల రాజేందర్ హత్యలు చేసి రాజకీయాల్లో పదవులను సంపాదించాడు. ఇంత స్థాయికి ఎదిగాడు అని చేసిన వ్యాఖ్యలు ప్రజలంతా వినే ఉంటారు. మరియు అంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కౌశిక్ రెడ్డిపై దాడి చేయించింది కూడా ఈటల అని కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇవి కూడా ఈ ఎన్నికల్లో కీలకం అయ్యే అవకాశం లేకపోలేదు. ప్రజలు గుడ్డిగా అభిమానంతోనే, లేదా మా కులం వాడనో ఓట్లు వెయ్యరు. వారికీ ఉపయోగపడుతున్నారా ? వారి నియోజకవర్గానికి మంచి చేస్తున్నారా ? అన్న విషయాలను సైతం ఒక్కోసారి పరిగణలోకి తీసుకుంటారు. అలాంటప్పుడు ఎంత పేరున్నా? ఓటమి నుండి తప్పించుకోలేరు.
అంతే కాకుండా ఇంకో బలమైన కారణం కూడా ఈటల ఓడిపోవడానికి కారణమవుతుందని బయట వినిపిస్తోంది. బీజేపీపై ప్రజల్లో ఒకింత అసంతృప్తి నెలకొంది. దానికి కేంద్ర స్థాయిలో పాలనాపరమయిన చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం కావడం, ప్రజలకు నిత్యావసరాలయిన గ్యాస్ మరియు పెట్రోల్ డీజిల్ ధరలను అమాంతం పెంచుకుంటూ పోవడం వంటివి ఉన్నాయి. వీటిని గురించి కనుక హుజురాబాద్ ప్రజలు ఆలోచిస్తే ఖచ్చితంగా ఈటల రాజేందర్ కు ఓటమిని బహుమతిగా ఇస్తానడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రజలు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో ? ఎవరికి పట్టం కడతారో ? ఎవ్వరూ ఊహించలేము. కాబట్టి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం కావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంది.



తెలంగాణ ఎంతోమంది అమరులను సాధించుకున్న బంగరు భూమి. నేడు కేసీఆర్ అధ్యక్షతన అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అధికార పార్టీ నాయకులు డప్పు కొడుతుంటే ? మరో వైపు విపక్షాలు అన్నీ మూకుమ్మడిగా కేసీఆర్ నాయకత్వాన్ని ఎండగడుతున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగా, ప్రస్తుతం అందరి దృష్టి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో ఖాళీ అయిన హుజురాబాద్ నియోజకవర్గంలో అతి త్వరలోనే ఉప ఎన్నిక మీదనే నెలకొంది.

బిజినెస్ : వ్యాపారం మొదలు పెట్టేవారికి మోడీ సర్కార్ శుభవార్త..

పంజాబ్ పాలిటిక్స్: రంగంలోకి ట్రబుల్ షూటర్ ?

టిఆర్ఎస్ మంత్రులపై టాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్?

ఇందిరా గాంధీ లేఖను షేర్ చేసిన ప్రముఖ వ్యాపారవేత్త ?

జాతి రత్నాలు డైరెక్టర్ కోసం ఆ ప్లాప్ హీరో ప్రయత్నాలు..?

రాజ్ గలీజ్ లీలలు..అందుకే బట్టలు విప్పానంటున్న మోడల్.. !

బయటకు రావొద్దంటున్న కేసీఆర్

ఎల్ఆర్ఎస్ పై టీఎస్ స‌ర్కార్ క్లారిటీ.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>