BusinessPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/hyderabad5a950feb-2477-4357-bf6d-888f57cb156f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/hyderabad5a950feb-2477-4357-bf6d-888f57cb156f-415x250-IndiaHerald.jpgవిశ్వనగరం దిశగా దూసుకెళ్తున్న హైదరాబాద్... అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో దిగ్గజ కంపెనీలు వ్యాపారం చేసేందుకు, తమ వ్యాపార కార్యకలాపాలు విస్తరించేందుకు అనువైన నగరాలను ఎంచుకునే జాబితాలో హైదరాబాద్ టాప్ ప్లేస్‌లో ఉంది. సాంకేతిత పరిజ్ఞానం, సిబ్బంది అందుబాటు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా రూపొందించారు. కరోనా వంటి విపత్కర సమయాల్లో కూడా వ్యాపార కొనసాగింపునకు హైదరాబాద్ నగరం ఉత్తమమైందిగా గుర్తింపు పొందింది. Hyderabad{#}Delhi;INTERNATIONAL;Coronavirus;Hyderabad;Surveyవిశ్వనగరం దిశగా దూసుకెళ్తున్న హైదరాబాద్విశ్వనగరం దిశగా దూసుకెళ్తున్న హైదరాబాద్Hyderabad{#}Delhi;INTERNATIONAL;Coronavirus;Hyderabad;SurveyThu, 22 Jul 2021 07:47:00 GMTవిశ్వనగరం దిశగా దూసుకెళ్తున్న హైదరాబాద్... అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో దిగ్గజ కంపెనీలు వ్యాపారం చేసేందుకు, తమ వ్యాపార కార్యకలాపాలు విస్తరించేందుకు అనువైన నగరాలను ఎంచుకునే జాబితాలో హైదరాబాద్ టాప్ ప్లేస్‌లో ఉంది. సాంకేతిత పరిజ్ఞానం, సిబ్బంది అందుబాటు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా రూపొందించారు. కరోనా వంటి విపత్కర సమయాల్లో కూడా వ్యాపార కొనసాగింపునకు హైదరాబాద్ నగరం ఉత్తమమైందిగా గుర్తింపు పొందింది.


బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాలు ఉద్యోగాల కల్పనకు సిద్ధమవుతున్నాయి. టీమ్‌ లీజ్‌ సర్వీసెస్‌ సంస్థ చేసిన కొత్త సర్వే నివేదిక ప్రకారం వ్యాపార విస్తరణ అవసరాలకు సంబంధించిన జాబితాలో హైదరాబాద్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. కొవిడ్‌ మహమ్మారి సెకండ్‌ వేవ్‌ నుంచి భారత్‌ ఇప్పుడిప్పుడే కొలుకుంటోంది. వ్యాపార కొనసాగింపు, వృద్ధి రెండింటినీ కంపెనీలు చూస్తుండటంతో... అమ్మకాలు, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలకు టాప్ సిటీస్‌లో అధిక డిమాండ్ ఉంది. కరోనా సెకండ్‌ వేవ్‌ను తట్టుకుని నిలబడిన నగరాల జాబితాలో కూడా హైదరాబాద్ ముందుంది. సర్వే నివేదిక ప్రకారం... నైపుణ్యత కలిగిన సిబ్బంది కూడా హైదరాబాద్‌లో అందుబాటులోనే ఉన్నారు.  


బెంగళూరు, చండీగఢ్‌, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా వంటి నగరాలు ఉద్యోగ కల్పనకు డ్రైవర్లుగా మారబోతున్నాయి. ఈ నగరాల్లో టీకాలు వేయడం అధికంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నగరాల్లో వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉండటం కూడా వ్యాపార సంస్థలకు కొంత ఊరట కలిగిస్తోంది. వార్షిక ఉద్యోగాల నమూనా సర్వే ప్రకారం.. ఐటీ, ఈ-కామర్స్, హెల్త్‌ కేర్‌ వంటి అనేక రంగాలు మహమ్మారి నుంచి తప్పించుకున్నాయి. బ్యాకింగ్‌, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌, టెలికామ్, ఇంజనీరింగ్‌, తయారీ రంగాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి కూడా. హాస్పిటాలిటీ, పర్యాటక రంగాలు కూడా నెమ్మదిగా గాడిలో పడుతున్నాయి. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని నిర్వహించిన సర్వేలో... మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ టాప్‌ 5 ప్లేస్‌లో స్థానం సంపాందించింది.



బుజ్జాయిల కోసం తల్లి పాల కేంద్రాలు !

గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధరలు

కొవిడ్‌పై భార‌తీయులు ఇంత ఖ‌ర్చు చేశారా.?

జులై 22...చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు

RRR ప్రమోషనల్ సాంగ్ తమిళ్ వెర్షన్ లో పెర్ఫార్మ్ చేయనునన్న ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్?

RRR సినిమాలో భారీ ఫైట్ ఉండబోతుందా?

చేయని తప్పుకి జగన్ శిక్ష అనుభవించాలా..?

"మూడురోజులుండేలా" ఢిల్లీ రండి??

మోడీ చెప్పిన దానికి.. అసలు మాటలు కూడా రావట్లేదు : రౌత్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>