PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpd7cfe6c4-bbe7-4b34-937c-8e79984a88c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpd7cfe6c4-bbe7-4b34-937c-8e79984a88c8-415x250-IndiaHerald.jpgఏపీలో అధికార వైసీపీకి తిరుగులేని బలం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి జిల్లాలోనూ వైసీపీకి ఆధిక్యం ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. అయితే కొన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడుప్పుడే పుంజుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కాకపోయినా, కొన్ని జిల్లాల్లో వైసీపీకి ధీటుగా టీడీపీ బలోపేతం అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ysrcp{#}Godavari River;Mylavaram;Unguturu;Assembly;Telugu Desam Party;TDP;YCP;Vijayawada;West Godavariఆ రెండు జిల్లాల్లో వైసీపీకి షాక్...లీడింగ్ మారిందా?ఆ రెండు జిల్లాల్లో వైసీపీకి షాక్...లీడింగ్ మారిందా?ysrcp{#}Godavari River;Mylavaram;Unguturu;Assembly;Telugu Desam Party;TDP;YCP;Vijayawada;West GodavariThu, 22 Jul 2021 01:00:00 GMTఏపీలో అధికార వైసీపీకి తిరుగులేని బలం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి జిల్లాలోనూ వైసీపీకి ఆధిక్యం ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. అయితే కొన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడుప్పుడే పుంజుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కాకపోయినా, కొన్ని జిల్లాల్లో వైసీపీకి ధీటుగా టీడీపీ బలోపేతం అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీకి కాస్త పట్టు దక్కినట్లే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో వైసీపీ హవా స్పష్టంగా కనిపించింది. కృష్ణాలో 16 సీట్లు ఉంటే వైసీపీ 14 స్థానాల్లో గెలవగా, టీడీపీ కేవలం రెండే స్థానాలతో సరిపెట్టుకుంది. అటు పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు ఉంటే టీడీపీ రెండు గెలుచుకోగా, వైసీపీ 13 చోట్ల సత్తా చాటింది. అయితే ఊహించని విధంగా రెండు జిల్లాల్లో వైసీపీకి షాక్ ఇస్తూ, సగం నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ అయిందని విశ్లేషణలు వస్తున్నాయి.

కృష్ణాలో 16 అసెంబ్లీ స్థానాలు ఉంటే టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేల ఉండగా, అందులో ఒకరు వైసీపీకి వైపుకు వెళ్లారు. దీంతో టీడీపీ బలం ఒకటికి చేరుకుంది. అయితే వైసీపీ ఎమ్మెల్యేల గెలిచిన చోట టీడీపీ నేతలు పుంజుకున్నట్లు తెలుస్తోంది. పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలకు అనుకూల వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్, పెనమలూరు, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ కాస్త పుంజుకుందని తెలుస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లా విషయానికొస్తే టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా, వీరు  స్ట్రాంగ్‌గానే ఉన్నారని తెలుస్తోంది. వీరితో పాటు పలువురు టీడీపీ ఇన్‌చార్జ్‌లు పికప్ అయ్యారు. జిల్లాలో దెందులూరు, తణుకు, గోపాలాపురం, నిడదవోలు, ఉంగుటూరు లాంటి నియోజకవర్గాల్లో టీడీపీకి పట్టు చిక్కిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మొత్తానికైతే కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సగం నియోజకవర్గాల్లో వైసీపీకి టీడీపీ షాక్ ఇచ్చి బాగానే లైన్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది.    





దాడి ఫ్యామిలీ మళ్ళీ రూట్ మారుస్తుందా?

చిత్తూరు జిల్లా అనగానే మొన్నటివరకు టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా అని, టీడీపీకి అనుకూలమైన జిల్లా అని తెలిసేది. కానీ ఇప్పుడు పరిస్తితి మారింది. చిత్తూరు జిల్లా అంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డా అని గట్టిగా చెప్పొచ్చు. ఈయన వల్లే జిల్లాలో టీడీపీకి చెక్ పెట్టి వైసీపీ బలమైన స్థానంలో ఉంది. ఈయన ప్రభావం జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో ఉంది.

ఏపీలో అధికార వైసీపీకి తిరుగులేని బలం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి జిల్లాలోనూ వైసీపీకి ఆధిక్యం ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. అయితే కొన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడుప్పుడే పుంజుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కాకపోయినా, కొన్ని జిల్లాల్లో వైసీపీకి ధీటుగా టీడీపీ బలోపేతం అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

చేయని తప్పుకి జగన్ శిక్ష అనుభవించాలా..?

ఏపీలో క‌రోనా ఉధృతి?

వైసీపీలో చేరేందుకు స‌తీష్‌రెడ్డికి ఇష్టం లేదా ?

వైసీపీలో చేరేందుకు భ‌య‌ప‌డుతోన్న రెడ్డిగారు ?

శాకాంబరీ ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి

వైసీపీ ఎమ్మెల్యేతో ప్రాణాహాని ఉందంటున్న బీజేపీ నేత‌...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>