MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/heroines-in-danger-positioned3058c6-1a07-45b6-94d0-3727147ae52e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/heroines-in-danger-positioned3058c6-1a07-45b6-94d0-3727147ae52e-415x250-IndiaHerald.jpgఒక్కాసారి హీరోయిన్లకు ఫ్లాప్ ముద్ర పడితే చాలు.. వాళ్లు ఇంక పనికిరానివారిగానే చూస్తారు. అలాంటి ఇమేజ్ తో వాళ్లకు అవకాశాలు దూరమవుతాయి. కొంతమంది హీరోయిన్లు ఇలాంటి దుర్భర పరిస్థితులనే ఫేస్ చేస్తున్నారు. ఒక్క హిట్ వస్తే చాలు కెరీర్‌ సెట్ అయిపోతుంది అనే భావనలో ఉన్నారు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. Heroines in Danger Position{#}BEAUTY;anoushka;Anushka;rakul preet singh;Tollywood;Cinema;Telugu;Heroine;Successడేంజర్ పొజిషన్ లో హీరోయిన్లు..!డేంజర్ పొజిషన్ లో హీరోయిన్లు..!Heroines in Danger Position{#}BEAUTY;anoushka;Anushka;rakul preet singh;Tollywood;Cinema;Telugu;Heroine;SuccessThu, 22 Jul 2021 06:54:38 GMTసినిమా ఇండస్ట్రీలో విజయం అనేది భవిష్యత్ ని నిర్ణయిస్తుంది. ఎవరైనా సక్సెస్ సాధిస్తేనే వరుస అవకాశాలు వస్తాయి. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఆ బ్యూటీ వైపు ఎవరూ చూడరు. ఇక ఆ ముద్దుగుమ్మ కెరీర్ చివరి దశకు చేరుకుందనే చెప్పొచ్చు. కొంతమంది హీరోయిన్లు ఇలాంటి పొజిషన్ లోనే ఉన్నారు. అర్జంట్ గా హిట్ కొడితేనే.. లేకపోతే ఇక వాళ్ల కెరీర్ అంతే.

టాలీవుడ్ బ్యూటీ అనుష్క గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఏలిందనే చెప్పాలి. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి' లాంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుంది. అయితే 'సైజ్‌ జీరో, నిశ్శబ్ధం' లాంటి సినిమాలు ఆమెను నిరాశపరిచాయి. పైగా విపరీతంగా బరువు పెరిగిపోవడంతో అవకాశాలు దూరమవుతూ వస్తున్నాయి. ఈ మాటలతోనే స్వీటీ సినిమాలకి కూడా దూరమైంది. లావు తగ్గాకే మళ్లీ సినిమాలు చేస్తాననే ఫీలింగ్ లో ఉంది ఈ బ్యూటీ.

ఇక రకుల్‌ ప్రీత్‌ సింగ్ విషయానికొస్తే ఇప్పటికీ సన్నజాజి తీగలాగే ఉంది. టాప్ హీరోలతో పాటు.. కుర్ర హీరోలతోనూ సినిమాలు చేసింది.  అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 'మన్మథుడు2' తర్వాత సమస్యలొచ్చి పడ్డాయి. రకుల్‌ చాలా ఓల్డ్‌ లుక్‌లో కనిపించిందనే కామెంట్స్‌ వచ్చాయి. ఆ తర్వాత 'చెక్' సినిమా కూడా నిరాశపరిచింది. దీంతో రకుల్ సినీ కెరీర్ ప్రమదంలో పడింది. ఈ పరిస్థితుల్లో క్రిష్, వైష్ణవ్‌తేజ్‌ సినిమాతో పాటు, 'అక్టోబర్ 31 లేడీస్ నైట్'లో నటిస్తోంది రకుల్. ఈ సినిమాలు అయినా రకుల్ సినీ కెరీర్ ను గాడిలో పెడతాయేమో చూడాలి.

లావణ్య త్రిపాఠి సరైన హిట్‌ సాధించి దాదాపు ఐదు సంవత్సరాలు అవుతోంది. 'శ్రీరస్తు శుభమస్తు' తర్వాత మధ్యలో వచ్చిన 'అర్జున్ సురవరం' తప్ప మిగిలిన సినిమాలన్నీ లావణ్యను కష్టాల్లోకి నెట్టాయి. 'ఏ1 ఎక్స్‌ప్రెస్, చావు కబురు చల్లగా' సినిమాలతో లావణ్య కెరీర్‌ మరింత కష్టాల్లో పడింది. ఇక ముందైనా ఆమెకు లక్ కలిసొస్తుందేమో చూద్దాం.

 



ఉప ఎన్నికలో ఈటలకు బీపీ కేసీఆర్ హ్యాపీ..?

ట్రెండింగ్ లో "హూ ఈజ్ బాలయ్య".. షాకిచ్చిన నెటిజన్లు

కుర్ర హీరోలకు బ్యాడ్ టైమ్ !

స్మరణ : బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన రావి కొండలరావు..

కేసీఆర్ సహకరించడం లేదు.. మేమేం చేసిది చెప్పండి..?

వర్షాకాలంలో అందమైన ముఖం కోసం ఇలా చెయ్యండి..

'రాజమౌళిని చూసి నేర్చుకోండి'.. ఆ సినిమా టీమ్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం..?

పవర్ స్టార్ ట్రిపుల్ రోల్.. ఫ్యాన్స్ కు పండుగే..!

RRR ప్రమోషనల్ సాంగ్ తమిళ్ వెర్షన్ లో పెర్ఫార్మ్ చేయనునన్న ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>